Asianet News TeluguAsianet News Telugu

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

బిజెపి నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించే కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు చోటు కల్పించడం, ఈటల రాజేందర్ ను కొనసాగించడం, కడియం శ్రీహరి వంటి నేతలకు పదవులు ఇస్తానని ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు.

KCR changes his plan on cabinet expansion
Author
Hyderabad, First Published Sep 9, 2019, 11:17 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముంచుకొస్తున్న ముప్పును పసిగట్టి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత మంత్రివర్గ విస్తరణ విషయంలో తన ప్లాన్ ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో అదే చర్చనీయాంశంగా మారింది. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవడం, ఈటల రాజేందర్ ను మంత్రి వర్గంలో కొనసాగించడం వెనక కేసీఆర్ మారిన ప్రణాళికనే పనిచేసిందని అంటున్నారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కేసీఆర్ ను రాజకీయ వేడి తాకిందని చెప్పాలి. మాటల మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్ ప్రత్యర్థులను మాటల ద్వారానే కాకుండా తన వ్యూహాల ద్వారా కూడా తీవ్రంగా దెబ్బ తీస్తూ వచ్చారు. ఆయన ఎెదురులేదనే భావన నెలకొంటూ వచ్చింది. అయితే, లోకసభ ఎన్నికల తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. మొత్తంగా అన్ని వర్గాల్లో అని చెప్పలేం గానీ కొన్ని వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి చోటు చేసుకుంది. అది పెరుగుతూ వస్తోంది. 

రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా చేసిన తిరుగులేని ఆధిపత్యం చెలాయించాలని కేసీఆర్ టీడీపీని, కాంగ్రెసును తుడిచిపెట్టే పనికి ఒడిగట్టారు. అందులో విజయం సాధించారు కూడా. అయితే, బిజెపి రూపంలో ముప్పు ముంచుకొస్తుందని ఊహించలేకపోయారు. కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో పావులు కదపడం మొదలు పెట్టింది. బిజెపి తలుచుకుంటే ఏమైనా చేయగలదనేది క్రమంగా ప్రత్యర్థులకు అర్థమవుతోంది. 

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలకే కాకుండా టీఆర్ఎస్ నేతలకు కూడా బిజెపి గాలం వేస్తున్నట్లు ప్రచారం జరగడంతో కేసీఆర్ ప్రమాదాన్ని పసిగట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి. సీనియర్ నేతలు కడియం శ్రీహరి, నాయని నర్సింహా రెడ్డిలకు ఉన్నత పదవులు ఇస్తామని, శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ స్పీకర్ మధుసూదనా చారికి,  మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుకు కార్పోరేషన్ పదవులు ఇస్తామని చెప్పారు. అంతే కాకుండా 12 మంది ఎమ్మెల్యేలకు కార్పోరేషన్ పదవులు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించారు. నిజానికి, పదవులు ఇచ్చే విషయంలో ఇలాంటి అధికారిక ప్రకటన వెలువడడం అనేది లేదు. కానీ రాబోయే రాజకీయ ప్రమాదాన్ని పసిగట్టి ఆయన అధికారిక ప్రకటన వెలువరించినట్లు చెబుతున్నారు. 

నిజానికి, బిజెపి నుంచి కేసీఆర్ అంతగా ప్రమాదం ఉందా అన్ని ప్రశ్నించుకుంటే ఉందనే చెప్పాల్సి ఉంటుంది. బిజెపి నాయకత్వం ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అందులో అందె వేసిన చేయి అని కొద్ది కాలంగా వెల్లడవుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీయడానికే కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారని కూడా అంటున్నారు. 

పైగా, సెప్టెంబర్ 17వ తేదీ కేసీఆర్ కు ఓ క్లిష్టమైన సమస్యగా మారింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. అందుకు కేసీఆర్ ముందుకు రావడం లేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిగితే మిత్రపక్షం మజ్లీస్ దూరం కావచ్చు. ముస్లిం మైనారిటీలు టీఆర్ఎస్ కు దూరమవుతారనే అభిప్రాయం కేసీఆర్ కు ఉండవచ్చు. 

కేసీఆర్ సమస్యను ఆసరా చేసుకుని బిజెపి రాజకీయాలను నడపడానికి సెప్టెంబర్ 17ను ఆయుధంగా వాడుతోంది. ఆ రోజు అమిత్ షా హైదరాబాదు రాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేస్తే కేసీఆర్ పరిస్థితి ఏమటనేది ప్రశ్న. హోం మంత్రి హోదాలో అమిత్ షా, సహాయ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి తెలంగాణలో తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే సమయంలో సెప్టెంబర్ 17వ తేదీన అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని బిజెపి నేతలు అంటున్నారు. అనూహ్యమైన సంఘటనలు బహుశా చేరికల గురించే కావచ్చు. 

అదే సమయంలో బిజెపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తమిళిసై సౌందర రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా పంపించారు. ఆమె 17వ తేదీన తెలంగాణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటే సంభవించే పరిణామాలు ఎలా ఉంటాయనేది చెప్పలేం. కేసీఆర్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీయడానికే తమిళిసైని తెలంగాణ గవర్నర్ గా నియమించారని ప్రచారం జరుగుతోంది. పైగా, ఆమె బిజెపి నేతలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంది. గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర బిజెపి నేతలు ఆమెతో భేటీ అయ్యారు. బిజెపి ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను ఎదుర్కోవడానికి కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యగానే ఆ పనులన్నీ చేశారని అంటున్నారు.

యాదాద్రి వివాదంలో బిజెపి దూకుడుగా వ్యవహరించింది. యాదాద్రి శిలలపై కేసీఆర్ బొమ్మలను, కారు బొమ్మను, ఇతర కొన్ని బొమ్మలను చిత్రించడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి నేతలు ఆందోళనకు దిగారు, ఎమ్మెల్యే రాజా సింగ్ యాదాద్రి పర్యటన నుంచి మొదలు పెడితే బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కార్యర్తలతో అక్కడికి వెళ్లి ఆందోళనకు దిగడం కేసీఆర్ తనకు ప్రమాద హెచ్చరికగానే భావించి ఉంటారు. 

ఈ పరిస్థితిలోనే కేసీఆర్ తన సహజ లక్షణానికి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. మంత్రి వర్గ విస్తరణ విషయంలో అది కనిపించగా, యాదాద్రి విషయంలో అది స్పష్టమైంది. యాదాద్రి శిలలపై చెక్కిన బొమ్మల విషయంలో ఆయన వెనక్కి తగ్గడం అందరినీ ఆశ్చరపరిచే విషయమే. ప్రత్యర్థులను తన మాటలతో ఎదుర్కునే కేసీఆర్ తొలిసారి అడుగు వెనక్కి వేశారు. యాదాద్రి శిలలపై చెక్కిన శిల్పాలను ఆయన ప్రభుత్వం తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

Follow Us:
Download App:
  • android
  • ios