Asianet News TeluguAsianet News Telugu

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం నాడు కేసీఆర్ తో భేటీ అయ్యారు.

 

etela rajender meets kcr at begumpeta airport in hyderabad
Author
Hyderabad, First Published Sep 8, 2019, 9:25 AM IST | Last Updated Sep 8, 2019, 9:32 AM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం నాడు బేగంపేట ఎయిర్‌పోర్టులో సమావేశమయ్యారు. కొత్త గవర్నర్ కు స్వాగతం పలికిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మంత్రి పదవి విషయంలో ఈటల రాజేందర్ గత నెల 29వ తేదీన సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ తో ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

మంత్రి పదవి విషయమై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం నుండి ఫోన్లు రావడంతో ఈటల రాజేందర్ కేసీఆర్ మా నాయకుడు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించనుందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కొత్త గవర్నర్ కు స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు కేసీఆర్ కంటే ముందే మంత్రి ఈటల రాజేందర్ చేరుకొన్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులోనే సీఎం కేసీఆర్ తో ఈటల రాజేంందర్ భేటీ అయ్యారు.  కొద్దిసేపు ఆయనతో చర్చించారు.గవర్నర్ కు స్వాగతం పలికిన తర్వాత ఈటల రాజేందర్ అక్కడి నుండి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios