Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. 

harish rao:Here is harish rao biography
Author
Hyderabad, First Published Sep 8, 2019, 4:09 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన  తన్నీరు హరీష్‌రావుకు కేసీఆర్ మంత్రివర్గంలో రెండో దఫా చోటు దక్కనుంది.  సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి హరీష్ రావు వరుసగా విజయం సాధిస్తున్నాడు. కేసీఆర్ కంటే ఎక్కువ మెజారిటీతో హరీష్ రావు ఈ నియోజకవర్గంలో విజయం సాధించి తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు.

తెలంగాణ సీఎం కేసీఆర్ హరీష్ రావుకు మేనమామ. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత హరీష్ రావు కేసీఆర్ వద్దే ఉండేవాడు. కేసీఆర్ ఎమ్మెల్యేగా మంత్రిగా టీడీపీలో ఉన్న సమయంలో  హరీష్ రావు ఆయన వ్యక్తిగత సహయకుడిగా ఉన్నాడు. కేసీఆర్ టీఆర్ఎస్ ను ప్రారంభించిన సమయంలో హరీష్ పాత్ర అత్యంత కీలకం.

టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్‌గా హరీష్ రావును అందరూ పిలుస్తారు. పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించేవారు.అందుకే ఆయనకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. టీఆర్ఎస్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా కూడ హరీష్ రావును పిలుస్తారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 26 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల నియోజకవర్గాల్లో హరీష్ రావు ప్లాన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ 26 మంది కీలక కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా  హరీష్ రావు ప్లాన్స్ వర్కౌటయ్యాయి. 

ఈ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రత్యేకంగా హరీష్ రావు ప్రచారం కోసం ఒక్క హెలికాప్టర్ ను కేటాయించారు.2014 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొండంలో కూడ హరీష్ రావు కీలకపాత్ర పోషించారు.

రెండో దఫా సీఎంగా  కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  కేటీఆర్, హరీష్ రావులకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కానీ, కేటీఆర్ ను మాత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. హరీష్ రావును ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేశారనే  ప్రచారం సాగింది.

కొంతకాలంగా  హరీష్ ను దూరం పెడుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది.ఈ ప్రచారానిక చెక్ పెడుతూ హరీష్ కు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.తొలి టర్మ్ లో కేసీఆర్ మంత్రివర్గంలో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి కావడంలో హరీష్  పాత్రను విస్మరించలేం. ప్రాజెక్టుల వద్దే హరీష్ రావు నిద్ర పోయిన సందర్భాలు కూడ ఉన్నాయి. కాళేశ్వరరావు ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ గవర్నర్  నరసింహన్  హరీష్ రావును కాళేశ్వరరావు అని కూడ పిలిచారు.

2004 ఎన్నికల్లో మెదక్  ఎంపీ  స్థానంతో పాటు సిద్దిపేట అసెంబ్లీ నుండి కేసీఆర్ విజయం సాధించారు. ఎంపీగా కేసీఆర్ కొనసాగడంతో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ సమయంలో  హరీష్ రావు సిద్దిపేట నుండి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. 

2004 ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి, మాజీ మంత్రి ముత్యంరెడ్డిపై 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో మరోసారి ప్రత్యర్థి బైరి అంజయ్యపై 58,935 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో అంజయ్యకు కేవలం 17,335 ఓట్లు మాత్రమే రావడతో ధరావత్తు కోల్పోయారు. 

2009 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 85,843 ఓట్లు సాధించారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి బైరి అంజయ్యకు కేవలం 21,166 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్‌ 64,677 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా ప్రత్యర్థికి డిపాజిట్‌ దక్కలేదు. 

2010 ఉప ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,779 ఓట్లు రాగా ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు కేవలం 12,921 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్‌ 95,858 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో హరీశ్‌రావుకు 1,08,699 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు కేవలం 15,371 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఎన్నికల్లో హరీష్ రావు 93వేల 328 ఓట్లు మెజారిటీ సాధించగా ప్రత్యర్థి డిపాజిట్ కోల్పోయారు.  

2018 ఎన్నికల్లో హరీష్  రావు మెజారిటీ  లక్ష దాటింది.అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన సభలో 1,20,650 ఓట్ల అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు హరీష్ రావు. సిద్ధిపేట నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతం ఓట్లను హరీష్ రావు సాధించారు. లక్ష 20వేల 650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.          
                                     
సంబంధిత వార్తలు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

Follow Us:
Download App:
  • android
  • ios