కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఈటలకు ఉద్వాసన తప్పదా?
కేసీఆర్ కేబినెట్ నుండి ఎవరు తమ పదవులను కోల్పోతారనే విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే ముగ్గురి పేర్లు మాత్రం ప్రస్తుతం ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురికి కేసీఆర్ చోటు కల్పించనున్నారు. అయితే మంత్రివర్గం నుండి తప్పించే అవకాశాలు ఉన్నాయా అనే విషయమై స్పష్టం కాలేదు. అయితే ఒకరిద్దరిని మంత్రి వర్గం నుండి తప్పిస్తారానే విషయమై ప్రచారం కూడ లేకపోలేదు.మంత్రివర్గం నుండి ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది.
ఆదివారం నాడు ఆరుగురికి కేసీఆర్ చోటు కల్పించాలని భావిస్తున్నారు. అయితే ఆరుగురికి చోటు కల్పిస్తే మాత్రం కేబినెట్ నుండి ఉద్వాసన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కేసీఆర్ కేబినెట్ లో ఉన్నారు. ఆదివారం నాడు మరో ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పిస్తే రెడ్డి సామాజిక వర్గం నుండి మంత్రి పదవులు దక్కే వారి సంఖ్య ఏడుకు చేరుకొంటుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుండి ఇద్దరిని తప్పిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.
మంత్రి వర్గం నుండి తప్పిస్తారానే ప్రచారం సాగుతున్న వారిలో ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుండి సబితా ఇంద్రారెడ్డికి చోటు కల్పించే అవకాశం ఉంది.సుఖేందర్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించాలని బావించినప్పటికీ ఆయనను శాసనమండలి ఛైర్మెన్ గా అవకాశం కల్పించనున్నారు.
ఇక కొంత కాలంగా ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుండి తప్పిస్తారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై ఈటల రాజేందర్ గత నెల 29 మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి తనకు బిక్ష కాదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో సంచలనంగా మారాయి.
టీఆర్ఎస్ నాయకత్వం కూడ నష్టనివారణ చర్యలకు దిగింది. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడ ఈటల రాజేందర్ తరహలోనే వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే గంగుల కమలాకర్ కు చోటు కల్పిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ను తప్పిస్తే రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ లేకపోలేదు.బీజేపీ అదను కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాజకీయంగా నష్టం కలిగే నిర్ణయాలు కేసీఆర్ తీసుకొనే అవకాశాలు ఉండవని చెబుతున్నారు.మంత్రివర్గం నుండి ఎవరిని తప్పించకుండానే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయవచ్చని సమాచారం.
సంబంధిత వార్తలు
నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....
కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే
కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌కు చోటు, కారణమదేనా
సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....