హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆదివారం  నాడు సాయంత్రం గవర్నర్ సౌందర రాజన్  ఆరుగురితో  మంత్రులుగా  ప్రమాణం చేయించారు.

ఆదివారం నాడు సాయంత్రం రాజ్‌భవన్ లో ఆరుగురు మంత్రులతో  గవర్నర్ సౌందరరాజన్ ప్రమాణం  చేయించారు. రాజ్‌భవన్ కు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకే కారులో వచ్చారు.

రాజ్‌భవన్ కు వచ్చిన కేటీఆర్, హరీష్ రావులను పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు అభినందించారు. తొలుత హరీష్ రావు మంత్రిగా ప్రమాణం చేశారు.తొలుత హరీష్ రావు మంత్రిగా ప్రమాణం చేశారు. హరీష్ రావు తర్వాత కేటీఆర్ ప్రమాణం చేశారు. కేటీఆర్ తర్వాత సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు.

సబితా ఇంద్రారెడ్డి ప్రమాణం చేసిన తర్వాత  కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రమాణం చేశారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మంత్రిగా ప్రమాణం చేశారు. సత్యవతి రాథోడ్ తర్వాత చిట్టచివరిగా పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ప్రమాణం చేశారు.

మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత హరీష్ రావు, కేటీఆర్, సత్యవతి రాథోడ్ లు సీఎం కేసీఆర్ కాళ్లకు దండం పెట్టారు. కొత్త, పాత మంత్రులతో కలిసి గవర్నర్ సౌందర రాజన్ మంత్రుల ప్రమాణం తర్వాత ఫోటోలు దిగారు. 

తెలంగాణ మంత్రివర్గంలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. ఎస్టీ సామాజిక వర్గం నుండి సత్యవతి రాథోడ్ కు చోటు లభించింది. రెడ్డి సామాజిక వర్గం నుండి సబితా ఇంద్రారెడ్డికి చోటు లభించింది. 2014-2019 వరకు కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళ కూడ మంత్రిగా లేరు. ఈ విషయమై విపక్షాలు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ దఫా కేసీఆర్ తన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు.

కేసీఆర్ మంత్రివర్గంలో వెలమ సామాజిక వర్గం నుండి కేటీఆర్,  హరీష్ లకు కూడ చోటు దక్కింది. దీంతో ఈ సామాజిక వర్గం నుండి ఇప్పటికే కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడ ఉన్నారు. దీంతో ఈ సామాజిక వర్గం నుండి కేబినెట్ లో సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. సబితా ఇంద్రారెడ్డి చేరికతో రెడ్డి సామాజిక వర్గం నుండి కేబినెట్ లో ఆరుగురు సభ్యులకు చేరింది.

మంత్రుల గ్రూప్ ఫోటో  తర్వాత కేసీఆర్ ఒక్కొక్కరుగా తన మంత్రులకు గవర్నర్ సౌందర రాజన్ కు పరిచయం చేశారు.తొలుత డిప్యూటీ సీఎం మహమూద్ అలీని పరిచయం చేశారు. ఆ తర్వాత హరీష్ రావును పరిచయం చేశారు. హరీష్ రావు తర్వాత శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్ ,కేటీఆర్ లను పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....