హైదరాబాద్:  మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని ఆయన మండిపడ్డారు. గత టర్మ్‌లో నాయిని నర్సింహరెడ్డి హోం మంత్రిగా కొనసాగారు. ఈ దఫా నాయిని నర్సింహరెడ్డికి కేసీఆర్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో నాయిని నర్సింహరెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  తనకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పారని నాయిని నర్సింహరెడ్డి చెప్పారు. తనకు ఏ కార్పోరేషన్ పదవి వద్దని నాయిని నర్సింహరెడ్డి తేల్చి చెప్పారు.

హోం మంత్రి పదవి నిర్వహించిన తాను కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని చేస్తానా అని ఆయన ప్రశ్నించారు. కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి ఎవరికి కావాలని ఆయన ప్రశ్నించారు.టీఆర్ఎస్‌కు తాను కూడ ఓనర్‌నేనని ఆయన చెప్పారు. కిరాయికి వచ్చిన వాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదన్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే వద్దు కౌన్సిల్ లో ఉండు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ తనకు చెప్పిన విషయాన్ని నాయిని గుర్తు చేశారు. మా అల్లుడికి కూడ ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనకు ఆర్టీసీ పదవి తనకు వద్దన్నారు. అందులో రసం లేదని ఆయన సెటైర్లు వేశారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముషీరాబాద్ అసెంబ్లీ సీటును తన అల్లుడికి ఇవ్వాలని  సీఎం కేసీఆర్ వద్ద  నాయిని నర్సింహరెడ్డి టిక్కెట్టు ఇవ్వాలని కోరారు. కానీ ఆ సీటును ముషీరాబాద్ అసెంబ్లీ సీటును టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన ముఠా గోపాల్ కు ఇచ్చారు. ఈ సమయంలో తనకు ఇచ్చిన హమీని నెరవేర్చలేదని కేసీఆర్ పై నాయిని నర్సింహ రెడ్డి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....