భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి పూర్తి స్థాయిలో కేబినెట్‌ను విస్తరించనున్నారు. అలాగే మహిళకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చి.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని భావించిన సీఎం.. ఈ కోవలోనే సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. దీంతో సబితా ముచ్చటగా మూడోసారి మంత్రి పదవిని చేపట్టబోతున్నారు.

Telangana cm KCR to Induct Sabitha Indra Reddy Into his cabinet

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి పూర్తి స్థాయిలో కేబినెట్‌ను విస్తరించనున్నారు. అలాగే మహిళకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చి.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని భావించిన సీఎం.. ఈ కోవలోనే సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. దీంతో సబితా ముచ్చటగా మూడోసారి మంత్రి పదవిని చేపట్టబోతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రిగా పనిచేసిన పి. ఇంద్రారెడ్డి సతీమణే సబిత.. 2000వ సంవత్సరంలో ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల ద్వారా ఆమె తొలిసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

కాంగ్రెస్ తరపున చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సబిత ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం 2004లో చేవేళ్ల నుంచి నెగ్గిన ఆమె తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో సబిత గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లను ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి పోటీ చేసి విజయం సాధించి తొలి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

దివంగత సీఎం వైఎస్‌తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండేది. తన సుదీర్ఘ పాదయాత్ర విజయవంతం కావడంతో పాటు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజశేఖర్ రెడ్డికి చేవెళ్ల సెంటిమెంట్‌పై మంచి నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి పార్టీ, ప్రభుత్వపరంగా ఏ కార్యక్రమం చేపట్టినా వైఎస్ చేవెళ్ల నుంచే మొదలుపెట్టేవారు. అలా సబితకు చేవెళ్ల చెల్లెమ్మ అనే పేరు నిలిచిపోయింది. 

అయితే వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సబిత పేరును సీబీఐ తన చార్జిషీటులో చేర్చడంతో పాటు ఏ4గా పేర్కొనడంతో అప్పట్లో ఆమె హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై ఆమె ఎన్నోసార్లు న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి వచ్చింది. చివరికి 2013 మే 25న సబిత తన పదవికి రాజీనామా చేశారు.

2014 ఎన్నికల్లో ఓటమిపాలైన సబిత...తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారడంతో ఆమె కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. అయితే 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసిన ఆమె విజయం సాధించారు.

అనంతర కాలంలో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. రెండోసారి సీఎం అయిన తర్వాత కేసీఆర్ పాలనపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈసారి సీనియర్లకు చోటు కల్పించనున్నారు.

దీనిలో భాగంగా సీనియర్ శాసనసభ్యురాలిగా, రాష్ట్రానికి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డి సేవలు వినియోగించుకోవాలని భావించిన కేసీఆర్.. ఆమెను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు పుష్రలంగా ఉన్నాయి.

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios