Asianet News TeluguAsianet News Telugu

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

తన మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యీస్థీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆరుగురు కొత్త వారికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరి ప్రమాణ స్వీకారం ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగింది. ఇందులో అందరి దృష్టి.. టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు పైనే ఉంది

kcr cabinet expansion: trs chief strategy on harish rao
Author
Hyderabad, First Published Sep 9, 2019, 11:08 AM IST

తన మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యీస్థీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆరుగురు కొత్త వారికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరి ప్రమాణ స్వీకారం ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగింది.

ఇందులో అందరి దృష్టి.. టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు పైనే ఉంది. కొంచెం ఆలస్యంగానైనా హరీశ్‌కు మంత్రి పదవి దక్కడంతో ఆయన అభిమానులు, మద్ధతుదారులు హర్షం వ్యక్తం చేశారు. 

ఇంతటి సంతోషానికి కారణాలు సైతం లేకపోలేదు.. టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత నెంబర్-2గా వ్యవహరించిన హరీశ్‌కు కేటీఆర్ రాకతో కాస్త ప్రాధాన్యం తగ్గిందనే చెప్పవచ్చు.

గతేడాది డిసెంబర్‌ నెలలో జరిగిన ఎన్నికల నుంచి హరీశ్ ప్రభ మసకబారుతూ వచ్చింది. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడినిన చేయగా.. హరీశ్‌కు అసలు మంత్రివర్గంలోనే చోటు దక్కలేదు. 

దీంతో కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికే సీఎం.. వ్యూహాత్మకంగానే హరీశ్‌ను పాత్రను పరిమితం చేశారనే ప్రచారం జరిగింది. దాదాపు 9 నెలల నుంచి హరీశ్ సిద్ధపేటకే పరిమితమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్-కేటీఆర్‌లు దూకుడుకి లోక్‌సభ ఎన్నికలు బ్రేక్ వేశాయి. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ కంచుకోటలైన నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో పాటు రాజధాని హైదరాబాద్‌లో బీజేపీ పాగా వేసింది. 

దీనికి తోడు ఈటల రాజేందర్, రసమయి బాలకిషన్ వంటి నేతలు పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఈ అవకాశాలను వినియోగించుకుని బీజేపీ దూసుకొచ్చేస్తుందని సీఎం భావించారు.

రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా, పాలనాపరంగా అపార అనుభవమున్న హరీశ్‌రావుకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. గతంలో పార్టీకి సంబంధించిన ఏ అవసరం వచ్చినా తొలుత హరీశ్ పేరు వినిపించేది.

అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ కాళేశ్వరాన్ని పరుగులు పెట్టించిన ఆయన.. ఎన్నికల సమయానికి చివరి దశకు తీసుకొచ్చి గవర్నర్ నరసింహన్‌తో కాళేశ్వరరావుగా పేరు తెచ్చుకున్నారు. 

అయితే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హరీశ్‌కు ఆహ్వానం అందకపోవడం అప్పట్లో ఆయన అభిమానులను తీవ్రంగా కలచివేసింది. అయినప్పటికీ హరీశ్ రావు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే ఉంటూ ఈ ప్రచారాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా జనంలోనే ఉంటూ వచ్చారు. చివరికి టీఆర్ఎస్ ముఖ్యుల సలహా మేరకు హరీశ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు కేసీఆర్.

ప్రమాణ స్వీకార సమయంలో కేటీఆర్, హరీశ్ ఒకే కారులో రావడం.. కేసీఆర్ ఇంట్లో ఆహ్వానం పలకడం, ప్రమాణ స్వీకార వేదిక మీద తొలిగా హరీశ్‌తో ప్రమాణం చేయించడం పెద్ద చర్చకు కారణమైయ్యాయి. 

ఇక ప్రభుత్వంలో కీలకమైన ఆర్ధిక శాఖను హరీశ్ రావుకు అప్పగించడం అన్నింటిలోకి హైలెట్. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్నప్పటికీ అనేక బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఇప్పటికే భారీ ప్రాజెక్ట్‌లను నెత్తికెత్తుకున్న నేపథ్యంలో ఆర్ధిక మాంద్యం ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సమర్థుడైన హరీశ్‌రావుకు ఆర్ధిక శాఖను అప్పగించడం ద్వారా కేసీఆర్ వ్యూహాత్మంగా వ్యవహరించారని విశ్లేషకులు అంటున్నారు. 

అదే సమయంలో ఈ ప్రాధాన్యత హరీశ్ పనితనానికి కేసీఆర్ గుర్తింపునిచ్చారా లేక మంత్రిగా చోటు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ప్రజలతో సంబంధాలు ఉండని శాఖ ఇచ్చి జనంతో గ్యాప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి మాజీ మంత్రి హరీశ్ రావు నుంచి ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుగా తమ అభిమాన నేత మారడం పట్ల ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

Follow Us:
Download App:
  • android
  • ios