హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే
తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకొన్న ఆరుగురికి శాఖలను కేటాయించారు. హరీష్ కు కేసీఆర్ పెద్ద పీట వేశారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దే కీలక శాఖలు ఉండనున్నాయి. కొత్తగా ప్రమాణం చేసిన ఆరుగురికి శాఖలను కేటాయించారు. హరీష్ రావుకు ఆర్ధిక శాఖను కేటాయించారు. గత టర్మ్‌లో కేటాయించిన శాఖలనే కేటీఆర్ కు కేటాయించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దే కీలకమైన కొన్ని శాఖలున్నాయి. కీలకమైన రెవిన్యూ, నీటిపారుదల శాఖలతో పాటు మైనింగ్ శాఖలు జీఏడీ, శాంతి భద్రతలు కూడ కేసీఆర్ వద్దే ఉన్నాయి.
ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డిని ఆ శాఖ నుండి తప్పించారు. జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించారు. గత టర్మ్‌లో కూడ జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ విస్తరణ కారణంగా మంత్రుల శాఖల్లో మార్పుల కారణంగా జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించారు.
ప్రస్తుతం ఆర్దిక శాఖకు మంత్రి లేరు. దీంతో హరీష్‌రావుకు ఆర్ధిక శాఖను కేటాయించారు. గత టర్మ్‌లో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖను కేటాయించారు. ఈ దఫా మాత్రం హరీష్ రావుకు ఆర్ధిక శాఖను కేటాయించారు. ఇక మంత్రిగా ప్రమాణం చేసిన కేటీఆర్ కు గతంలో పనిచేసిన మున్సిఫల్, ఐటీ, పరిశ్రమల శాఖలను కేటాయించారు.
రవాణశాఖను ప్రస్తుతం వేముల ప్రశాంత్ రెడ్డి చూసేవాడు. ప్రశాంత్ రెడ్డి నుండి రవాణా శాఖను పువ్వాడ అజయ్ కు ఇచ్చారు. కొప్పుల ఈశ్వర్ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను గంగుల కమలాకర్ కు కేటాయించారు.
కొత్త మంత్రుల శాఖలివే
హరీష్ రావు: ఆర్ధిక శాఖ
కేటీఆర్ మున్సిఫల్, ఐటీ, పరిశ్రమలు
పువ్వాడ అజయ్: రవాణ శాఖ
గంగుల కమలాకర్: బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ
సబితా ఇంద్రారెడ్డి : విద్యశాఖ
సత్యవతి రాథోడ్: ఎస్టీ సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
సంబంధిత వార్తలు
కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి
కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ
టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు
భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి
టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్ కాదని ఐటీ వైపు
బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..
బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే
ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల
మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ
కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ
నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....
కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే
కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌కు చోటు, కారణమదేనా
సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....