హైదరాబాద్: కర్ణాటకలో మెడిసిన్ సీటొచ్చినా కూడ కేటీఆర్ మెడిసిన్ చేయకుండా డిగ్రీలో చేరాడు. టీఆర్ఎస్ లో అనతి కాలంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎదిగారు.

ఆదివారం నాడు మంత్రివర్గ విస్తరణలో మరోసారి మంత్రిగా కేటీఆర్‌కు స్థానం దక్కింది.  ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో 1976 జూలై 24న సిద్దిపేటలో   కేటీఆర్ జన్మించారు. ఎన్టీఆర్ పై అభిమానంతో కేసీఆర్ కల్వకుంట్ల తారకరామారావు అని  ఆయనకు పేరు పెట్టారు.రెండేళ్ల  పాటు కేటీఆర్ కరీంనగర్ లో పాఠశాల విద్యను అభ్యసించారు.

ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం హైద్రాబాద్‌లోనే సాగింది. గుంటూరులోని విజ్ఞాన్  కాలేజీ లో రెండేళ్ల పాటు చదువుకొన్నారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాశారు.  అయితే కర్ణాటకలో కేటీఆర్ కు మెడికల్ సీటు వచ్చింది. అయితే ఆయన మెడిసిన్ లో చేరలేదు.

హైద్రాబాద్ నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో చేరాడు. ఆ తర్వాత ఫూణెలో చదువుకొన్నారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ లో ఎంబీఏ పట్టా తీసుకొన్నాడు.  మేజేజ్‌మెంట్ ఆఫ్ ఈ కామర్స్ లో కేటీఆర్ ఎంబీఏ చేశారు.

అమెరికాలోనే కొంత కాలం పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు.  ఆ తర్వాత ఇండియాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇంచార్జీగా కూడ చాలా కాలం పాటు వ్యవహరించారు. 2006 లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో కేటీఆర్ టీఆర్ఎస్ లో కార్యకర్తగా రంగ ప్రవేశం చేశారు. 2008లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కేటీఆర్ ఎంపికయ్యారు.

ఉమ్మడి అసెంబ్లీకి 2009లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నుండి పోటీ చేసి ఆయన తొలిసారి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల మెజారిటీతో అప్పటి టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్ధి కెకె మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2010, 2014, 2018 ఎన్నికల్లో కేటీఆర్ ఇదే అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.

2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత  కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. టీఆర్ఎస్ వ్యవహరాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి.

మొదటి టర్మ్‌లో కేసీఆర్ మంత్రివర్గంలో ఐటీ,పురపాలక,మైనింగ్ తదితర శాఖలను కేటీఆర్ నిర్వహించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో కేటీఆర్ కీలక భూమిక  పోషించారు.మళ్లీ కేటీఆర్ మంత్రివర్గంలోకి చోటు దక్కింది. ఇక  కేటీఆర్  మరోసారి పాలనలో తన మార్క్‌ను చూపించే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

 

సంబంధిత వార్తలు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....