హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలవ్వడంతో ఆ పార్టీలో అసంతృప్తి ఉప్పెనలా ఎగిసిపడుతుంది. టిక్కెట్ దక్కని ఆశావాహులు గాంధీభవన్ వద్ద, ఢిల్లీలో వరుస ఆందోళనలకు దిగుతుంటే మరికొందరు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇంకొందరైతే ఇండిపెండెంట్ గా నిలిచేందుకు రెడీ అవుతున్నారు. ఇలా అభ్యర్థులకు పక్కలో బల్లెంలో ఆశావాహులు రెడీ అవుతుండటం పార్టీకి పెద్ద ముప్పు తెచ్చిపెట్టేలా ఉంది. 

తాజాగా కాంగ్రెస్ పార్టీలో సీట్ల లొల్లి మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కొంపలో కుంపటి పెట్టింది. మామపై పోటీకి అల్లుడు క్రిశాంక్ రెడీ అంటున్నాడు. మామ బరిలోకి దిగితే ఇండిపెండెంట్ దిగి పక్కలో బళ్లెం అవుతానని హెచ్చరిస్తున్నారు. 

వివరాల్లోకి వెళ్తే కంటోన్మెంట్ సీటు కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు కేటాయించడంతో అదే స్థానాన్ని ఆశించిన అల్లుడు క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు కాకుండా మూడుసార్లు ఓడిన సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. 
సర్వే సత్యనారాయణకు టిక్కెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ గాంధీభవన్ వద్ద నిరసనకు దిగారు. ఐదు నెలల గర్భిణీ అయిన తన భార్యను వదిలిపెట్టి పార్టీకోసం అహర్నిశలు శ్రమించినట్లు తెలిపారు క్రిశాంక్. 6 నెలలుగా తాను బస్తీ నిద్ర వంటి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నానని తెలిపారు. మా జేబులు కూడా ఖాళీ అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ఆశయాలను నర నరాల్లో జీర్ణింపచేసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను తిరస్కరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక వేచి చూసే ఓపిక తనకు లేదని తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు టిక్కెట్ ఇచ్చేందుకు అంగీకరించినా కొంతమంది అడ్డుకున్నారని ఆరోపించారు.  

కాంగ్రెస్‌లో సీటు దక్కాలంటే గాడ్‌ఫాదర్‌ ఉండాలని తనకు అర్థమైందన్నారు. కొప్పుల రాజు తనకు చాలా సహకరించారని గుర్తుచేశారు. కానీ కొన్ని ఒత్తిళ్ల వల్లే తన టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
 
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపుల్లో ఓయూ జేఏసీగా కానీ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కానీ తనకు సీటు వస్తుందని ఆశించానని కానీ రాలేదన్నారు. అందుకే తాను రెబల్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నానని ప్రకటించారు. మామ సర్వేపై ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తమ మధ్య పోటీ మామ-అల్లుళ్ల పోటీగా చూడొద్దని ప్రజలను విజ్ఞప్తిచేశారు. తనను ఒక విద్యార్థి నాయకుడిగా మాత్రమే గుర్తించాలని క్రిశాంక్ కోరారు.

అటు మామ సర్వే సత్యనారాయణపై క్రిశాంక్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వే సత్యనారాయణ సాధారణ ఎన్నికల్లో మూడు సార్లు ఓడారని గుర్తు చేశారు. సర్వే సత్యనారాయణ అంటే ఎవరో కంటోన్మెంట్ ప్రజలకు తెలియదన్నారు. కానీ క్రిశాంక్ అంటే ఎవరో కంటోన్మెంట్ ప్రజలకు తెలుసని వివరించారు.  

కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు సర్వే సత్యనారాయణ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బరేల్ గ్రౌండ్ విషయంలో కానీ, ఆర్మీరోడ్ విషయంలో కానీ కనీసం స్పందించలేదన్నారు. ఆర్మీ రోడ్ విషయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇప్పించమంటే ఇప్పించలేదన్నారు.
 
తాను రాజకీయాల్లో బచ్చా అని, సర్వే సత్యనారాయణ అల్లుడు కాబట్టే గుర్తించారంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. తాను సర్వే సత్యనారాయణ అల్లుడిగా కాకుండా విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను చదవించి కంటోన్మెంట్ లోనేనన్నారు.  

సాధారణంగా దళిత నియోజకవర్గాల్లో అగ్రకులస్థుల పెత్తనం ఉంటుందని విన్నాను కానీ ఒక దళితుడు ఎదుగుదలకు మరో దళితుడు అడ్డంకి కంటోన్మెంట్ లోనే చూస్తున్నట్లు విలపించారు. సీఎం కావాలనే ఉద్దేశంతో సర్వే సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారన్నారు. సీఎం కావాలనుకుంటే వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేయోచ్చుకదా అని సూచించారు.  
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని సర్వే సత్యనారాయణ గెలుస్తానని  చెప్పుకుంటున్నారని విమర్శించారు. నాకు అవకాశం ఇచ్చి ఓడిపోతే ఓటమి కానీ ఇవ్వకుండా ఓడిపోతామని నిర్ణయిస్తే ఎలా అంటూ మామ సర్వేను నిలదీశారు. 

మరోవైపు టీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావుతో సర్వే సత్యనారాయణకు మంచి సంబంధాలున్నాయని ఆరోపించారు. చిత్తశుద్ధికలిగిన నాయకుడిగా మైనంపల్లి హన్మంతరావును   విమర్శిస్తే సర్వే ఒప్పుకోరన్నారు. టీఆర్ఎస్ నాయకులపై తాను నిరంతరం పోరాటం చేస్తుంటే, సర్వే వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని క్రిశాంక్  ధ్వజమెత్తారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ సీటుకి కాంగ్రెస్ వేలం, తాను పాల్గొనలేదంటున్న మాజీ ఎమ్మెల్యే

దిగొచ్చిన సీపీఐ: మూడు సీట్లు, రెండు ఎమ్మెల్సీలకు సర్ధుబాటు

కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు