చెన్నై: సర్కార్ సినిమాలో విజయ్ పాత్రను చాలా శ్రద్ధగా తీర్చిదిద్టినట్లు కనిపిస్తోంది. సర్కార్ సినిమాపై తమిళనాడు అధికార పార్టీ అన్నాడియంకె తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మురదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మీడియా కింగ్ కళానిథి మారన్ నిర్మించారు. సినిమా ఇప్పటికే వంద కోట్ల మేరకు కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. 

సినిమాలో ఇండియాకు తిరిగి వచ్చిన ఎన్నారై పాత్రలో విజయ్ నటించారు. ఓటు వేయడానికి అతను ఇండియాకు వస్తాడు. అయితే, తన ఓటును ఎవరో అప్పటికే వేశారని అతను తెలుసుకుంటాడు. దాంతో అతను పరిశోధనలోకి దిగుతాడు. అప్పటి నుంచి రాజకీయాలపై తీవ్రమైన విమర్శలతో సినిమా సాగుతూ ఉంటుంది. 

త్వరలో తమిళనాడులో 20 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సర్కార్ సినిమా అన్నాడియంకెను ప్రధానంగా లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించిందని అంటున్నారు. ఈ ఉప ఎన్నికల సందర్భంలోనే విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నాడియంకె సినిమాపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

నిరసనను అణచివేసేందుకు అన్నాడియంకె ప్రయత్నిస్తోందని డిఎంకె విమర్శిస్తోంది.  పాలక అన్నాడియంకె నేతలు, మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తోందని డిఎంకె అధికార ప్రతినిధి ఎ. శరవణన్ అన్నారు. డెంగ్యూతో ప్రజలు మరణిస్తున్నారని, నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోందని, సినిమాపై విమర్శలతో ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. 

అయితే, తాము అసహనం ప్రదర్శిస్తున్నట్లు వస్తున్న విమర్శలను అన్నాడియంకె ఖండిస్తోంది. తాము అసహనం ప్రదర్శించి ఉంటే సినిమా విడుదలకు అనుమతి ఇచ్చి ఉండేవాళ్లం కాదని, రోజుకు ఏడు షోలకు తాము అనుమతి ఇచ్చామని అంటోంది. 

విజయ్ సినిమా రాజకీయ వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మెర్సల్ బిజెపి నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంది. 

సంబంధిత వార్తలు

ఆ సెక్షన్ గుట్టు విప్పిన సర్కార్ సినిమా: కోట్ల మంది సెర్చ్ చేస్తున్నారట..!

సర్కార్ లేడీ విలన్ తో జయలలితకు పోలిక: కొట్టిపారేసిన దినకరన్

'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?

'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!