స్టార్ హీరోలు సందేశాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటే ఆ సినిమాకు ఏర్పడే బజ్ మాములుగా ఉండదు. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ సినిమాపై అంచనాలు పెరిగాయి. మురగదాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కడం ప్రధానం అంశం. ఇదివరకే ఈ కాంబో లో వచ్చిన తుపాకీ - కత్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఇప్పుడు సర్కార్ పై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఇక సినిమా ప్రీమియర్ షోలు తమిళనాట అలాగే పలు రాష్ట్రాల్లో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు ఆ టాక్ ఎలా ఉందొ చూద్దాం..

కుళ్ళిన రాజకీయ వ్యవస్థపై కార్పోరేట్ వ్యవస్థ వ్యవహారించే తీరే ఈ సర్కార్ అసలు కథ.  ఒక ఎన్నికలో తన ఓటు వేయలేనప్పుడు రాజకీయ నాయకులతో ఒక కార్పొరేట్ వ్యక్తి ఎలాంటి స్వభావంతో నడుచుకుంటాడో అర్ధమవుతుంది. సెక్షన్ 49P అంశాలను అర్థమయ్యేలా వివరించారు. 

సుందర్ (విజయ్) తన ఓటు వేయడానికి భారతదేశానికి వస్తాడు, కానీ తన తరఫున ఓటు ఎవరో  వేసినట్లు తెలుసుకున్న తర్వాత అతను ఊహించని దారిలో వెళతాడు. తమిళ రాజకీయలకు దగ్గరగా ఉండేట్లు చాలా సన్నివేశాలను డిజైన్ చేశారు. ఎన్నికలు వాయిదా పడటం విజయ్ విలన్స్ ని ఎదుర్కోవడం మాత్రం కొంచెం రొటీన్ గా అనిపిస్తాయి. ఇక కోపంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు అపరాధులను ఎలా దారిలోకి తెచ్చి బహిర్గతం చేశాడు అనేది తదుపరి స్క్రీన్ పై చూడాలి. 

స్ట్రాంగ్ మెస్సేజ్ తో దర్శకుడు సినిమాను తెరకెక్కించడాని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య వేడుకలో పాల్గొనే ప్రాముఖ్యతను సర్కార్ సినిమా నొక్కి చెబుతుంది.

ప్రతి సీన్ ను దర్శకుడు విజయ్ క్రేజ్ కి తగ్గట్టు క్రియేట్ చేసుకున్నాడు. ఫాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయని చెప్పవచ్చు. ఇక కీర్తి సురేష్ మొదటి సారి సరికొత్త లుక్స్ తో అందరిని ఆకర్షించింది. యాక్షన్ సీన్స్ ఆదిరిపోయాయి. దానికి తోడు ఏఆర్.రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమా స్థాయిని పెంచుతుంది. 

కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. పాత కథలను కూడా గుర్తు చేస్తాయి కానీ మురగదాస్ తనదైన శైలిలో చాలా స్టైలిష్ గా సినిమాను ప్రజెంట్ చేశాడు. ఈ దీపావళికి విజయ్ ఫ్యాన్స్ కి సినిమా ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పవచ్చు.

 

ఇవి కూడా చదవండి.. 

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!