స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు ఒక్కసారిగా హడావుడి మొదలవుతుంది. ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులే కొన్ని సార్లు సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో బజ్ క్రియేట్ చేస్తారు. సినిమా అందరికి రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ ప్రధాన ఆయుధం. 

అయితే తెలుగులో ఈ సారి తన సినిమాను భారీగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ వేసిన విజయ్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. విజయ్ సర్కార్ సినిమాపై తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా అంచనాలు భారిగానే ఉన్నాయి. సాధారణంగా విశాల్ సూర్య 'లాంటి హీరోలు తెలుగులో కూడా వారి సినిమాలను భారీగా రిలీజ్ చేస్తే ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతారు. 

కానీ విజయ్ లాంటి స్టార్ హీరో తెలుగులో మార్కెట్ కావాలని అంటున్నాడు గాని ప్రమోషన్స్ కు మాత్రం రావడం లేదు. పోనీ ఇక్కడ రిలీజ్ చేస్తున్నవారు ఏమైనా బజ్ క్రియేట్ చేస్తున్నారా అంటే అది లేదు. దీంతో ఈ విధానం సినిమా ఓపెనింగ్స్ పై ఎంతో కొంత ప్రభావం చూపించవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. మరి సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.