తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా కలెక్షన్ల పరంగా దూకుడు చూపిస్తుంటే ఇప్పుడు సినిమాలో సన్నివేశాలను తొలగించాలని రాయకీయపార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు వివాదం ఎందుకు మొదలైందంటే.. మొదటగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు పెట్టిన పేరు.

అదేంటంటే కోమలవల్లి. నిజానికి తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కూడా ఇదే. దీనికి తోడు సినిమాలో తన తండ్రికి అధిక మోతాదులో మందులు ఇచ్చి కోమలవల్లి చంపేస్తుంది. ఈ కారణంగానే తమిళనాట రచ్చ మొదలైంది. 

ఏకంగా తమిళనాడు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. కోమలవల్లి పేరుపై అధికార అన్నాడీఎంకె పార్టీ విరుచుకుపడుతోంది. ఇవి మాత్రమే కాకుండా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలపై కూడా ఈ సినిమాలో సెటైర్లు వేశారు.

వీటితో పాటు ప్ర‌భుత్వ సంక్షేమ డ‌బ్బును త‌గ‌ల‌బెట్టే సీన్ ఒక‌టి ఉంది.. ఆ సీన్‌ను అన్నాడీఎంకే వ్య‌తిరేకిస్తున్న‌ది. ఇదొక‌ర‌కంగా ఉగ్ర‌వాదులు హింస‌ను ప్రేరేపించిన‌ట్లు ఉన్న‌ద‌ని ఆరోపిస్తున్నారు.  ఈ సన్నివేశాలను తొలగించాలని అన్నాడీఎంకె డిమాండ్ చేస్తోంది. చిత్రబృందం కూడా అన్నాడీఎంకె డిమాండ్ చేసినట్లుగా సన్నివేశాలను తొలగించనున్నట్లు సమాచారం. 

ఇవి కూడా చదవండి..

'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!