తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సర్కార్'. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఈ సినిమాలో కొన్ని రాజకీయ పార్టీలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ వివాదం చెలరేగింది. 

సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని అన్నాడీఎంకె పార్టీ నేతలు కోరారు. అయినప్పటికీ తొలగించకుండా అలానే సినిమాను ప్రదర్శిస్తుండడంతో సినిమా ఆడుతున్న థియేటర్లకు చేరుకొని విధ్వంసాలను సృష్టిస్తున్నారు. దీంతో తమిళనాడులో చాలా థియేటర్లలో సినిమాను రద్దు చేశారు.

సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని థియేటర్స్ అసోసియేషన్ చిత్రనిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సన్నివేశాలను తొలగించలేకపోతే సినిమాను ప్రదర్శించలేమని అంటున్నాయి థియేటర్ యాజమాన్యాలు. ఇప్పటివరకు 90 మంది విజయ్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోపక్క దర్శకుడు మురుగదాస్ ని అరెస్ట్ చేశారనే వార్తలు గుప్పుమన్నాయి.

దీనిపై చెన్నై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శకుడు మురుగదాస్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సర్కార్ సినిమాలో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని కమీషనర్ కి అన్నాడీఎంకె మద్దతుదారుడు దేవరాజన్ ఫిర్యాదు చేశారు. 

ఇవి కూడా చదవండి..

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!