తమిళ స్టార్ హీరో విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సర్కార్'. కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పెషల్ షో ద్వారా సినిమాను ముందే చూడాలనుకున్న అభిమానులకి నిరాశే ఎదురైంది.

మద్రాస్ హైకోర్టు 'సర్కార్' సినిమా ప్రత్యేక షోల ప్రదర్శనపై నిషేధం విధించింది. సామాజిక కార్యకర్త దేవరాజ్ ఈ మేరకు కోర్టులో కేసు వేశారు. దీంతో దీపావళి సమయంలో సినిమా ప్రత్యేక షోలు, అదనపు షోలని ప్రదర్శించడంపై కోర్టు నిషేధం విధించింది.

దీంతో విజయ్ అభిమానులు నిరాశకి గురయ్యారు. ఇది ఇలా ఉండగా ఇటీవల ఈ సినిమా కథ విషయంలో వివాదం చెలరేగింది. వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత 'సర్కార్' కథ తనదేనంటూ కేసు వేశాడు. ఈ క్రమంలో వరుణ్ తో రాజీ పడ్డ చిత్రబృందం అతడికి సినిమా కథ విషయంలో క్రెడిట్ ఇస్తూ టైటిల్స్ లో పేరు వేయడానికి ఒప్పుకున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!