చెన్నై పోలీస్ లు ..దర్శకుడు ఎఆర్ మురగదాస్ ని అరెస్ట్ చేయటటానికి ఇంటికి  రాత్రి వచ్చారనే వార్త తమిళ సినీ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పు మంది. అందులో నిజం ఉందా... అంటే అవుననే సమాధానమిస్తున్నారు మురగదాస్. ఆయన ఇంటికి పోలీస్ లు వచ్చి చాలా సార్లు తలుపుపై కొట్టారని...అయితే తాను ఆ సమయంలో బయట ఉండటంతో అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ విషయమై నిర్మాతలు సన్ నెట్ వర్క్ వారు ఓ ట్వీట్ చేసారు. ఆ విషయాన్ని మరో ట్వీట్ తో ఖరారు చేసారు మురగదాస్. దాంతో మురగదాస్ అభిమానుల్లో అసలేం జరుగుతోంది అనే ఉత్కంఠ నెలకొంది. ఇలా పోలీస్ లు రావటాని కారణం ..తాజా చిత్రం సర్కార్ వివాదమే అని తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరో విజయ్‌ తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజీతో వెళ్తుండగా.. ఆయన సినిమాలకు కొన్ని సమస్యలు కూడా ఎప్పటికప్పుడు వెంటాడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సమస్యలు మరింత అధికం అయ్యాయి. రాజకీయపరంగా ఒత్తిడి ఎదురవుతోంది. ఆయన చిత్రంలో డైలాగులు, సన్నివేశాలు రాజకీయ వర్గాలను కలవరపెడుతూ, ఇబ్బందికి గురి చేస్తున్నాయి. 

ఇప్పటికే పలు చిత్రాలకు ఈ తరహా సమస్యలొచ్చాయి. తాజాగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్‌’లోని కొన్ని సీన్స్  కూడా చర్చనీయాంశాలుగా మారాయి. ప్రభుత్వపరంగా, పార్టీల పరంగా ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కు చెందిన ఓ మంత్రి సైతం ఈ విషయమై వార్నింగ్ లు సైతం ఇచ్చేసారు. 

ఈ  సినిమాలోని కొన్ని సన్నివేశాలపై పాలక అన్నాడీఎంకే భారీ స్థాయిలో మండి పడుతోంది. చిత్రంలో ఉచిత మిక్సీ, గ్రైండర్‌, ఫ్యాన్లను పగలగొట్టే సీన్స్ ను తొలగించాలని డిమాండ్‌ చేస్తోంది. ఉచిత పథకాలకు తమ విప్లవ నాయిక జయలలితే ప్రతీక అని, ఆమెను విమర్శిస్తూ పలు సీన్స్ ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు అన్నాడీఎంకే నేతలు. 

మరో ప్రక్క విలన్‌ మూడు తరాల రాజకీయ నేతగా చూపించడంతో డీఎంకే కూడా భుజాలు తడుముకుంటోంది. అయితే తమ బ్యానరే కావటంతో ఆ విషయమై స్పందించటం లేదు.   మరోవైపు బీజేపి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎదిగి వస్తున్న విజయ్‌కి ఇలాంటి సినిమాలు మంచివి కాదని మంత్రులు సైతం చెబుతున్నారు. అంతేకాకుండా దీనిపై ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకుంటుందని కూడా పేర్కొన్నారు. ఇవన్నీ ఓవైపు ఉండగా.. ఇప్పుడు మురగదాస్ అరెస్ట్ కు ప్రభుత్వం రెడీ అవటం విషయాన్ని పెద్దది చేస్తోంది. 

ఇవి కూడా చదవండి..

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!