MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • Vijay Thalapathy : విజయ్ దళపతికి డిప్యూటీ సీఎం పదవి ఖాయమేనా?

Vijay Thalapathy : విజయ్ దళపతికి డిప్యూటీ సీఎం పదవి ఖాయమేనా?

Tamil Nadu Assembly Election 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ విజయ్ దళపతి ప్రకంపనలు రేగుతున్నాయి. అసలు టీవీకే పార్టీ వ్యూహాలు ఏంటి? బీజేపీతో పొత్తు వార్తలు నిజమేనా? కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణలో ఏం తేల్చారు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 15 2026, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తమిళనాట త్రిముఖ పోరు: డీఎంకే వర్సెస్ టీవీకే.. విజయ్ వ్యూహం ఫులిస్తుందా?
Image Credit : Asianet News

తమిళనాట త్రిముఖ పోరు: డీఎంకే వర్సెస్ టీవీకే.. విజయ్ వ్యూహం ఫులిస్తుందా?

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ దళపతి, తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం తమిళనాట పెను సంచలనాన్ని సృష్టించింది. తన సినిమాల్లో లాగే విజయ్ రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఉత్కంఠభరిత పరిణామాల మధ్య సాగుతోంది. అయితే, సెప్టెంబర్ 27, 2025న కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం విజయ్ రాజకీయ ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సీబీఐ విచారణలో విజయ్ : ఏం జరిగింది?
Image Credit : Asianet News

సీబీఐ విచారణలో విజయ్ : ఏం జరిగింది?

కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా విజయ్ ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరయ్యారు. తాజాగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన సుమారు ఏడు గంటల పాటు అధికారుల ప్రశ్నలను ఎదుర్కొన్నారు. షెడ్యూల్ కంటే ఏడు గంటలు ఆలస్యంగా సభకు ఎందుకు వచ్చారు? రద్దీ పెరిగినా ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించారు? ఘటన జరిగిన వెంటనే చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయారు? అనే అంశాలపై సీబీఐ అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.

36
బీజేపీ బిగ్ ఆఫర్ : విజయ్ దళపతికి డిప్యూటీ సీఎం పదవి
Image Credit : stockPhoto

బీజేపీ బిగ్ ఆఫర్ : విజయ్ దళపతికి డిప్యూటీ సీఎం పదవి

మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీవీకే మధ్య పొత్తు చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఎన్డీయే (NDA) కూటమిలో చేరితే విజయ్‌కి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలోని 234 స్థానాల్లో సుమారు 80 స్థానాలను టీవీకేకు ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. విజయ్ ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుని, కనీసం 2 శాతం ఓట్లు సాధించినా అది తమ విజయానికి కీలకం అవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది.

46
టీవీకే విజయ్ బలాలు.. బలహీనతలు ఏంటి?
Image Credit : Asianet News

టీవీకే విజయ్ బలాలు.. బలహీనతలు ఏంటి?

51 ఏళ్ల విజయ్ ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్, యువతలో ఉన్న క్రేజ్ పార్టీకి పెద్ద బలం. సామాజిక న్యాయం, ద్విభాషా విధానం వంటి అంశాలను ఆయన తన సిద్ధాంతాలుగా ప్రకటించారు. మహిళలకు ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెలవారీ ఆర్థిక సాయం వంటి సూపర్ సిక్స్ హామీలను ఆయన ప్రకటించారు. అయితే, రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీలో ఆయన ఒక్కరే స్టార్ క్యాంపెయినర్‌గా ఉండటం కొంత బలహీనతగా కనిపిస్తోంది.

56
విజయ్ దళపతి ముందున్న అవకాశాలు.. సవాళ్లు ఏమిటి?
Image Credit : Asianet News

విజయ్ దళపతి ముందున్న అవకాశాలు.. సవాళ్లు ఏమిటి?

తమిళనాడులో దశాబ్దాలుగా ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని విజయ్ భావిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు మార్పు కోరుకుంటున్న తరుణంలో ఇది ఆయనకు మంచి అవకాశం. కానీ, కరూర్ తొక్కిసలాట ఘటన ఆయన ప్రతిష్ఠకు కొంత విఘాతం కలిగించింది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం ఉన్న పార్టీలను ఢీకొట్టడం విజయ్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. ప్రస్తుతం డీఎంకే ద్రావిడ మోడల్ 2.0 నినాదంతో ముందుకు వెళ్తుండగా, విజయ్ తన సొంత ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

66
టీవీకే విజయ్ : సస్పెన్స్‌లో పొత్తుల వ్యవహారం
Image Credit : Asianet News

టీవీకే విజయ్ : సస్పెన్స్‌లో పొత్తుల వ్యవహారం

బీజేపీతో పొత్తు వార్తలను టీవీకే నేతలు కొట్టిపారేస్తున్నారు. పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీని తమ సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు. పొత్తుల వార్తలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రచారంగా ఆయన పేర్కొన్నారు. అయితే, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్నికల తేదీల ప్రకటన వచ్చిన ఉన్న తరుణంలో, విజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రాజకీయాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image2
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image3
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Related Stories
Recommended image1
Tamil Nadu Assembly Election 2026: మినీ కురుక్షేత్రం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలివే !
Recommended image2
Tamil Nadu Assembly Election 2026 : తమిళనాడు ఎన్నికల డేట్ ఫిక్స్.. స్టాలిన్ పీఠం దక్కేది ఎవరికి? పూర్తి షెడ్యూల్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved