స్టార్ హీరో నటించిన సినిమా రిలీజ్ కి ముందే ఆన్ లైన్ లో పెట్టేస్తామని బెదిరిస్తున్నారు పైరసీదారులు. ఈ పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీలనుకుదిపేస్తున్న విషయం. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరి సినిమాలు ఈ పైరసీ బారిన పడుతూనే ఉన్నాయి.

ఇప్పుడు కొత్తగా పైరసీ చేసేవాళ్లు HD ప్రింట్ ఆన్ లైన్ లో పెట్టేస్తామని ముందే చెప్తుండడం మేకర్స్ ని ఆందోళనకి గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి పరిస్థితే విజయ్ 'సర్కార్'  సినిమాకి ఎదురైంది.

తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే పైరసీ వెబ్ సైట్స్ ను చాలా వరకు కంట్రోల్ చేశారు. కానీ తమిళ రాకర్స్ వెబ్ సైట్ ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. తాజాగా తమిళ రాకర్స్.. 'సర్కార్' HD ప్రింట్ ని థియేటర్లలో రిలీజ్ అయ్యే కొన్ని గంటల ముందే మా సియట్ లో పెడతామని ప్రకటించి సంచలనం సృష్టించారు. తమిళ రాకర్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

తెలుగులో ఈ సినిమాకి పెద్దగా బజ్ లేనప్పటికీ తమిళంలో మాత్రం ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మొదటి షో పడిన తరువాత ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. 

ఇవి కూడా చదవండి..

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!