సోనియా గాంధీకి కోడలు దొరికినట్టేనా..?

Congress social media chief posts old video of Rakhi Sawant introducing man as PM Modi’s ‘son-in-law’
Highlights

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన భర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పెళ్లి చేసుకుని భార్య హోదా కల్పిస్తానని రాహుల్‌ చెప్పారంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోడలు దొరికేసిందా..? అంటే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్నాడా.. ఇదే కదా మీ ప్రశ్నలు. సోనియాగాంధీకి నిజంగానే కోడలు దొరికింది.  అంతేకాదు ప్రధాని నరేంద్రమోదీకి కూడా అల్లుడు దొరికేశాడు. మీరు చదివింది నిజమే.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. రాజకీయ నేతలు ఒకరిని మరొకరు విమర్శించుకోవడం అలవాటే. తమ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఏ ఒక్క చిన్న పాయింట్ దొరికినా.. రాజకీయ నేతలు వదిలిపెట్టరు. వాటిని అస్త్రాలుగా మార్చుకుంటారు. అయితే.. ఇటీవల బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. ఓ వీడియో పోస్టు చేసింది.

ఆ వీడియోలో‘‘ ఫ్రెండ్స్‌.. నాకు కాబోయే భర్త ఎవరా అంటూ అడుగుతూ ఉంటారు కదా. ఇదిగో ఇతడిని కలవండి. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అతడితో పాటు న్యూయార్క్‌లో విహరిస్తున్నాను. నా ఈ వీడియోను ప్రధాని మోదీతో సహా భారతీయులంతా చూస్తూ ఉంటారు. బాలీవుడ్‌ నటిని అయిన కారణంగా మోదీ నాకు పెద్ద అభిమాని. ఇదిగోండి ఈయనే మీ అల్లుడు’  అంటూ రాఖీ వ్యాఖ్యానించారు. 

ఈ వీడియోని కాంగ్రెస్ నేత రమ్య.. తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో.. దీనికి కౌంటర్ గా మరో వీడియో పోస్టు చేశాడు.. బీజేపీ నేత తేజీందర్ సింగ్. ఈయన చేసిన పోస్టులో  అలహాబాద్‌కు చెందిన ఒక మహిళ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన భర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పెళ్లి చేసుకుని భార్య హోదా కల్పిస్తానని రాహుల్‌ చెప్పారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన రోజూ తన కలలోకి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తారని, కానీ వాటిని నిలబెట్టుకోకుండా తనను మోసం చేశారంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. దళితులంటే ఎంతో ప్రేమ కలిగి ఉండే రాహుల్‌ ఓబీసీ మహిళనైన తనను పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా రాహుల్‌ గాంధీపై పలు సంచలన ఆరోపణలు చేశారు.

వీరిద్దరి పోస్టులు వైరల్ గా మారడంతో.. నెటిజన్లు కూడా తమదైన రీతిలో  కామెంట్స్ చేయడం ప్రారంభించారు. సోనియా గాంధీకి కోడలు, మోదీకి అల్లుడు దొరికేశారంటూ ట్వీట్లు చేస్తున్నారు.

loader