ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ భారత్ తీసుకొన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ నిరసించింది. పాకిస్తాన్ లోని భారత రాయబారి అజయ్ బిసారియాకు పాక్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. జమ్మూ కాశ్మీర్ , లడఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.ఈ మేరకు సోమవారం నాడు కేంద్రం ప్రకటన వెలువరిచింది. 370 ఆర్టికల్ రద్దు చేస్తూ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది.

ఈ పరిణామాలపై పాక్ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370 ను రద్దు చేయడంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా మండలి తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించిందని పాక్ అభిప్రాయపడింది.ఈ మేరకు పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అలీ భారత్ పై విమర్శలు గుప్పించారు. 

భారత్ తీసుకొన్న నిర్ణయం కాశ్మీర్ ప్రజలకు అభీష్టానికి వ్యతిరేకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.జమ్మూ కాశ్మీర్ పై భారత్ తీసుకొన్న నిర్ణయాలపై చర్చించేందుకు పార్లమెంట్ ఉభయసభలను ఏర్పాటు చేయాలని పాక్ అధ్యక్షుడు ఆరిప్ అల్వీ ఆదేశించారు. మంగళవారం నాడు పార్లమెంట్ ఉభయసభలు ఈ విషయమై ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

జమ్మూకాశ్మీర్ పై భారత్ తీసుకొన్న నిర్ణయాలపై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడ స్పందించారు. 370 ఆర్టికల్ రద్దు విషయమై మలేషియా, టర్కీ ప్రధాన మంత్రులతో ఇమ్రాన్ ఖాన్ ఫోన్ లో చర్చించారు. ఈ చర్యతో భారత్- పాక్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక చర్చలకు కూడ అవకాశాలు దెబ్బతిన్నాయని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రదేశం కాశ్మీర్. దీనిపై భారత్ తీసుకొన్న నిర్ణయం అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. కాశ్మీరీల కోసం తమ దౌత్యాన్ని విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగిస్తామని ఇమ్రాన్ ఖాన్ ఈ రెండు దేశాల ప్రధానులకు చెప్పారు. 

భారత్ తీసుకొన్న నిర్ణయాలకు కౌంటరిచ్చేందుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టుగా ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.ద్వైపాక్షిక చర్చలతో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించదు, ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ కోరినట్టుగా పాక్  విదేశాంగ శాఖ ప్రకటించింది.

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ భారత్ తీసుకొన్న నిర్ణయంపై పాకిస్థాన్ ముస్లిం లీగ్  నవాజ్ అధ్యక్షుడు షెహ్బాజ్‌ షరీఫ్‌ చెప్పారు. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాలని ఆయన కోరారు.

చైనా, రష్యా, టర్కీ, సౌదీ అరేబియాలనను సంప్రదించాలని ఆయన డిమాండ్ చేశారు. కాశ్మీర్ లో భారత్ అరాచకాలను ఆర్టికల్ రద్దు చేయడం నిదర్శనమని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మెన్ బిలావల్ భుట్టో జర్దారీ విమర్శించారు.

సంబంధిత వార్తలు

ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభ ఆమోదం

ఆర్టికల్ 370 వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు, ఇక మార్పు వస్తోంది: లోక్ సభలో అమిత్ షా

లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుపై అమిత్ షా ప్రకటన

ఆర్టికల్ 370: శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినాదం, మోడీ ఉద్యమం

ఆర్టికల్ 370 రద్దు: కశ్మీర్ ప్రజలు శాంతి సామరస్యంతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం: ఆర్టికల్ 370 రద్దుపై స్వరూపానంద

హత్యకేసులో ఉన్న వ్యక్తి హోంమంత్రి అయితే ఇలానే ఉంటుంది : ఆర్టికల్ 370 రద్దుపై సీపీఐ నేత రామకృష్ణ

సర్వే: గవర్నర్ పాలనపై కాశ్మీరీల సంతృప్తి

మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్