.లిన్‌ ట్రంప్‌కి వీరాభిమాని ట్రంప్ తో సెల్ఫీ దిగినందుకే  విడాకులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కారణంగా తాను తన భర్తతో విడిపోయానని ఓ మహిళ ఆరోపించింది. ట్రంప్ తో సెల్ఫీ దిగినందుకే తన భర్త తనకు విడాకులు ఇచ్చాడంటూ ఆమె పేర్కొంది. ఈ మేరకు ఆమె ఓ ప్రెస్‌ నోట్‌ కూడా విడుదల చేసింది.

వివరాల్లోకి వెళితే అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన లిన్‌.. ఒకప్పుడు అమెరికన్‌ ఫుట్‌బాల్‌ జట్టు మయామి డాల్ఫిన్స్‌కు చీర్‌లీడర్‌గా పనిచేసింది. ఆమె భర్త డేవ్‌ పామ్‌ బీచ్‌ కౌంటీకి అటార్నీగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

కాగా..లిన్‌ ట్రంప్‌కి వీరాభిమాని. దీంతో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లిన్‌ ఆయనతో పలుమార్లు సెల్ఫీలు దిగింది. తన భార్య ట్రంప్ తో సెల్పీలు దిగడం నచ్చని డేవ్ ఆమెతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ గొడవలు కాస్తా తారాస్థాయికి చేరడంతో వారు విడాకులు తీసుకొన్నారు. దీంతో తాను ట్రంప్ తో ఫోటో దిగడమే తాము విడిపోవడానికి కారణమంటూ లిన్ తన ఆవేదన వ్యక్తం చేస్తోంది.