గత కొన్ని రోజులుగా నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలోకి తిగుతారన్న దానిపై ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నల్గొండ అసెంబ్లీ స్థానానికి ఇటీవల హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య, ప్రస్తుత నల్గొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి అభ్యర్థిగా నిలబెడతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇదివరకు క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి మరోసారి ఆమె అభ్యర్థిత్వాన్ని కాదన్నట్టు మాట్లాడారు. 

మిర్యాలగూడ లో మాట్లాడిన కొమటిరెడ్డి... ఈ సారి తాను నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి ఫోటీ చేయనున్నట్లు వెల్లడిండించారు. మిర్యాలగూడతో పాటు నల్గొండ అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ తరపున  యువకులను బరిలోకి దించనున్నట్లు వెల్లడించారు. దీంతో నల్గొండ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. 

 

 కోమటిరెడ్డి ఎమన్నారో కింది వీడియోలో చూడండి