Asianet News TeluguAsianet News Telugu

ఏచీర కట్టుకోవాలి, అమెరికా రాయబారి డిలేమా...

  • మేరీ కార్లసన్‌ భార‌త‌ 70వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొననున్నారు.
  • ఏ చీర తీసుకోవాలో అర్థం కావడం లేదట
American Envoy To India Needs Help With SareeSearch For Independence Day

 

ఈ నాలుగు  చీరల్లో ఏ చీర ఎంచుకోవాలో అర్థం కావడంలేదు.. నాకు కొంచెం సహాయం చేయండి.. అని అడుగుతున్నారు భారత్ లోని అమెరికా రాయబారి  మేరీ కార్లసన్.  విషయమేమిటంటే..

దిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న మేరీ కార్లసన్‌ భార‌త‌ 70వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె చీర కట్టుకోవాలని భావించారు. అందుకోసం ఆమె షాపింగ్‌ కూడా చేశారు. కానీ ఏ చీర తీసుకోవాలో అర్థం కావడం లేదట. దీంతో ఆమె ఎంచుకున్న నాలుగు చీరలను కట్టుకొని వాటిలో ఏది ఎంచుకోవాలో  అర్థం కావడం లేదు సహాయం చేయండి అంటూ శారీసెర్చ్‌ పేరుతో హ్యష్ ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆమె పెట్టిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మీకు చీర చాలా బాగుంది.. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ మెచ్చుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios