MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్

Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్

Rain Alert: తెలంగాణలో వాతావరణ విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. పగటిపూట భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతుండగా, రాత్రి సమయానికి వాతావరణం చల్లబడుతూ పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 02 2026, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంగా మైదాన ప్రాంతాల వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో ఈ వ్యవస్థ జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పశ్చిమ-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని అంచనా. దీనికి తోడు మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పగలు మండే ఎండలు.. రాత్రిళ్లు వర్షాలు
Image Credit : Asianet News

పగలు మండే ఎండలు.. రాత్రిళ్లు వర్షాలు

తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలుచోట్ల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఏర్పడుతున్న అధిక వేడి కారణంగా వాతావరణంలో అస్థిరత పెరుగుతుండటం కూడా స్థానికంగా వర్షాలకు కారణమవుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడనుండగా, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

34
ఈ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం
Image Credit : Asianet_News to Asianet

ఈ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం

దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుండగా, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల వర్షపాతం నమోదైంది.

44
హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత భారీ వర్షం
Image Credit : Gemini

హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత భారీ వర్షం

హైదరాబాద్ నగరంలో పగటిపూట వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. అయితే రాత్రి వేళల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. గత అర్థరాత్రి తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొంతసేపు కుండపోత వర్షం పడటంతో రోడ్లపై నీరు నిలిచింది. తెల్లవారు జామున వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, బుధవారం కూడా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. పగటి వేడితో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ వాసులకు రాత్రిపూట కురిసే వర్షాలు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image2
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Recommended image3
Ration Card: రేషన్ కార్డు కట్ కావొద్దంటే ఇలా చేయండి.. అంతా ఇంటి నుంచే !
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Recommended image2
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved