MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?

Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?

Bank Holidays: సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకింగ్ సేవలకు బ్రేక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. వీకెండ్ హాలిడేస్‌ తో పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా వరుస సెలవులు వస్తున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 21 2026, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాంకులకు వరుస సెలవులు
Image Credit : ChatGPT

బ్యాంకులకు వరుస సెలవులు

Bank Holidays September 2026 : ఈ (సెప్టెంబర్) నెలాఖరులో బ్యాంక్ కస్టమర్లు కొంచెం అలర్ట్‌గా ఉండాలి. సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు వరుసగా 6 రోజుల పాటు రెగ్యులర్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 25 (శుక్రవారం) వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో అధికారిక సెలవు ఉండే అవకాశాలున్నాయి. అంటే ఈరోజు బ్యాంకులకు కూడా సెలవే అన్నమాట. ఇక సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, సెప్టెంబర్ 27న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి.

ఈ వీకెండ్ హాలిడేస్ కు బ్యాంకు ఉద్యోగుల సమ్మె తోడవనుంది... దీంతో సెలవుల సంఖ్య మరింత పెరగనుంది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి... దీంతో వచ్చే సోమ, మంగళ, బుధవారం బ్యాంకులు మూతపడనున్నాయి.

మొత్తంగా సెప్టెంబర్ నెలాఖరులో ఆరురోజుల పాటు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి... కాబట్టి కస్టమర్లకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లి చేయాల్సిన పనులు లేట్ అవ్వొచ్చు… కాబట్టి డాక్యుమెంట్లు ఇవ్వడం, చెక్ క్లియరెన్స్ లాంటి పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. ముఖ్యమైన పనులను ముందే పూర్తి చేసుకోవాలని ఎస్‌బీఐ (SBI) లాంటి బ్యాంకులు కస్టమర్లను కోరుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాంకు ఉద్యోగసంఘాల డిమాండ్స్ ఇవే..
Image Credit : getty

బ్యాంకు ఉద్యోగసంఘాల డిమాండ్స్ ఇవే..

ఈ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మె వెనుక డిమాండ్లు చాలానే ఉన్నాయి. వారానికి 5 రోజులే బ్యాంకులు పనిచేసే విధానాన్ని అమలు చేయాలి అంటే వీకెండ్ రెండ్రోజులు (శని, ఆదివారం) పూర్తిగా సెలవులు కావాలని కోరుతున్నారు. 2024 వేతన ఒప్పందం ప్రకారం దీనికి అంగీకారం తెలిపారని సంఘాలు చెబుతున్నాయి. దీంతోపాటు పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ఇన్సెంటివ్‌లు, కొత్త సిబ్బంది నియామకం, పెన్షన్, కొత్త పెన్షన్ స్కీమ్, గ్రాట్యుటీ లాంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

35
నిరవధిక సమ్మెకూ సిద్దమే : బ్యాంకు ఉద్యోగ సంఘాల హెచ్చరిక
Image Credit : ChatGPT

నిరవధిక సమ్మెకూ సిద్దమే : బ్యాంకు ఉద్యోగ సంఘాల హెచ్చరిక

ఈ నెలలోనే (2026 సెప్టెంబర్ 11) బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. అప్పుడే నెలాకరులో మరోసారి సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు... ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు దిగుతున్నారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే వచ్చేనెల అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఉద్యోగసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

45
కస్టమర్స్ ముందుగానే జాగ్రత్తపడాలి
Image Credit : getty

కస్టమర్స్ ముందుగానే జాగ్రత్తపడాలి

బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. సమ్మె మొదలయ్యేలోపే బ్రాంచ్‌లో చేయాల్సిన ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాలని సూచించింది. డాక్యుమెంట్లు ఇవ్వడం, చెక్ పనులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటివి లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఏటీఎంలు (ATM), క్యాష్ డిపాజిట్ మెషీన్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు, నెట్ బ్యాంకింగ్, యోనో (YONO), మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) లాంటి సేవలు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. కాబట్టి 6 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోతాయని భయపడాల్సిన పనిలేదు. కేవలం బ్రాంచ్‌కు వెళ్లి చేసే పనులకే బ్రేక్ పడుతుంది.

55
వీకెండ్, బంద్ కలిసివస్తున్నాయి
Image Credit : getty

వీకెండ్, బంద్ కలిసివస్తున్నాయి

సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు "6 రోజుల బ్యాంక్ హాలిడేస్" అని చెప్పడం కంటే.. 3 రోజులు వీకెండ్ సెలవులు, ఆ తర్వాత 3 రోజులు సమ్మె వల్ల బ్యాంక్ బ్రాంచ్‌ల సేవలకు బ్రేక్ పడుతుందని అర్థం చేసుకోవాలి. దీనివల్ల అన్ని బ్యాంకింగ్ సేవలు 6 రోజుల పాటు పూర్తిగా ఆగిపోవు… ఆన్ లైన్ సేవలు యధావిధిగా కొనసాగుతాయి.

ప్రస్తుత UFBU ప్రకటన ప్రకారం.. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె జరుగుతుంది. డిమాండ్లపై ఒప్పందం కుదరకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని సంఘాలు చెబుతున్నాయి. ఈలోపు ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు సక్సెస్ అయితే పరిస్థితి మారొచ్చు. ఏదేమైనా బ్రాంచ్‌లో పనులు ఉంటే ముందే పూర్తి చేసుకోవడం కస్టమర్లకు సేఫ్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image2
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Recommended image3
TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Related Stories
Recommended image1
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Recommended image2
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అక్టోబ‌ర్ 1 నుంచి మ‌నీ విత్‌డ్రాపై ఛార్జీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved