MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Jobs
  • Government Jobs
  • Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్

Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్

ఇంజనీరింగ్ పూర్తిచేసిన తెలుగు యువతకు బంపరాఫర్. ఏకంగా లక్ష రూపాయలకు పైగా శాలరీతో మేనేజర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, అదీ హైదరాబాద్ లోనే పోస్టింగ్… ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది. మీకు అర్హతలుంటే ట్రై చేయండి.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 22 2026, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు నిరుద్యోగులకు అద్భుత అవకాశం
Image Credit : Gemini

తెలుగు నిరుద్యోగులకు అద్భుత అవకాశం

Government Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్... తెలంగాణ సర్కార్ తాజాగా కీలకమైన రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. కేవలం ఇంజనీరింగ్ అర్హతతోనే ఆరంకెల జీతం అంటే నెలనెలా లక్షకు పైగా సంపాదించే అవకాశమున్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే జాబ్ లోకేషన్ రాజధాని హైదరాబాద్ నగరంలోనే. ఈ ఉద్యోగ భర్తీ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగాలు..
Image Credit : Gemini

హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగాలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ఆండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాల నియామక సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. HMWSSB లో మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ లో అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభం : 23 సెప్టెంబర్ 2026 అంటే ఈ బుధవారం నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లై చేసుకునేందుకు చివరి తేదీ : 17 అక్టోబర్ 2026 సాయంత్రం 5PM వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

రాతపరీక్ష : డిసెంబర్ 2026 (తేదీని త్వరలోనే ప్రకటిస్తారు)

హాల్ టికెట్స్ : పరీక్ష తేదీకి ఏడురోజుల ముందు హాల్ టికెట్స్ జారీ చేస్తారు. ఎగ్జామ్ కు ముందురోజు సాయంత్రం 5PM వరకు అభ్యర్థులకు డౌన్లోడ్ అవకాశం ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు ముందుగానే అప్లై చేసుకోవడం ఉత్తమం.. చివర్లో చేసుకుందాం అనుకుంటే ఇబ్బందులు ఎదురుకావచ్చు. చివరి తేదీల్లో అందరూ ఒకేసారి అప్లై చేసేందుకు ప్రయత్నించడంతో సర్వర్ పై ఒత్తిడి పెరిగి టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. అందుకే ముందుగానే దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలని TGPSC సూచిస్తోంది.

35
రిజర్వేషన్ల వారిగా ఖాళీల వివరాలు
Image Credit : Gemini AI

రిజర్వేషన్ల వారిగా ఖాళీల వివరాలు

HMWSSB లో మేనేజర్ ఉద్యోగాలు మల్లీ జోన్ 2 కిందకు వస్తాయి... మొత్తం 130 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్లవారిగా ఖాళీలను పరిశీలిస్తే..

OC - 37 (అన్ రిజర్వ్ 03)

EWS - 13

BC-A - 09 (అన్ రిజర్వ్ 01)

BC-B - 12

BC-C - 02

BC-D - 08

BC-E - 05

SC - 19 (అన్ రిజర్వ్ 01)

ST - 13

VH - 01 (అన్ రిజర్వ్ 01)

HH - 01

0H - 01

MH - 01

స్పోర్ట్స్ - 02

45
HMWSS ఉద్యోగాలకు విద్యార్హతలు
Image Credit : Gemini AI

HMWSS ఉద్యోగాలకు విద్యార్హతలు

18 సెప్టెంబర్ 2026 నాటికి ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.

80 శాతం పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ చేసినవారికి కేటాయించారు.

15 శాతం పోస్టులు ఎలక్ట్రిక్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసినవారికి కేటాయించారు.

5 శాతం పోస్టులు CSE లేదా IT లేదా ECE పూర్తిచేసినవారికి కేటాయించారు.

HMWSS ఉద్యోగాల వయో పరిమితి

హైదరాబాద్ వాటర్ సప్లై ఆడ్ సీవరేజ్ బోర్డులో మేనేజర్ ఉద్యోగాలకు 18 నుండి 44 ఏళ్లలోపు వయసుగల అభ్యర్థులు అర్హులు. అయితే రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ - 5 ఏళ్లు సడలింపు

దివ్యాంగులకు - 10 ఏళ్లు సడలింపు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు (కార్పోరేషన్స్, మున్సిపాలిటీ ఉద్యోగులకు వర్తించదు) - 5 ఏళ్ల వరకు సడలింపు

మాజీ ఆర్మీ ఉద్యోగులకు - 3 ఏళ్ల వరకు సడలింపు

N.C.C కలిగినవారికి - 3 ఏళ్ల వరకు సడలింపు

55
HMWSSB ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు
Image Credit : Getty

HMWSSB ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు

అన్ని అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకునేందుకు కొంత మొత్తంలో డబ్బులు అప్లికేషన్, ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఓసి, బిసి - రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి - రూ.500

ఎగ్జామినేషన్ ఫీజు : ప్రతి అభ్యర్థి రూ.120 చెల్లించాలి.

HMWSSB పరీక్ష సెంటర్లు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ కింది ప్రాంతాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది.

హైదరాబాద్ (HMDA పరిధిలో)

నల్గొండ

సంగారెడ్డి

మహబూబ్ నగర్

HMWSSB ఎగ్జామ్ సిలబస్

మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.

పేపర్-1 : (150 మార్కులు)

150 అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు - 150 నిమిషాల సమయం - ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నపత్రం ఉంటుంది.

పేపర్-2 : (300 మార్కులు)

సంబంధిత సబ్జెక్ట్ ప్రశ్నలు - 150 ప్రశ్నలు - 150 నిమిషాలు సమయం - కేవలం ఇంగ్లీష్ లోనే ప్రశ్నపత్రం ఉంటుంది... ఒక్క ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి.

HMWSSB మేనేజర్ శాలరీ

HMWSSB అనేది హైదరాబాద్ పరిథిలోని సంస్థ... కాబట్టి జాబ్ లొకేషన్ ఇక్కడే ఉంటుంది. మేనేజర్ పోస్టులు మంచి హోదా కలిగినవి... అలాగే మంచి శాలరీ కూడా ఉంటుంది. నెలకు రూ.54,220 నుండి రూ.1,33,630 వరకు జీతం ఉంటుందని TGPSC నోటిఫికేషన్ లో పేర్కొంది. అందరు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్స్ వీరికి కూడా వర్తిస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి
Recommended image3
Telangana Police Recruitment: కొలువుల జాతర.. 7437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1.80 లక్షల వరకు జీతంతో ఉద్యోగాలు
Recommended image2
Government Jobs : కేవలం డిప్లొమా, ఐటీఐ చదివితే చాలు.. నెలకు రూ.1.15 లక్షల శాలరీ జాబ్ పొందండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved