MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Telangana
  • Railway: తెలుగు ప్రజలకు కేంద్రం పండగలాంటి వార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్ల పెంపు

Railway: తెలుగు ప్రజలకు కేంద్రం పండగలాంటి వార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్ల పెంపు

Railway: దేశంలో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు మార్గాల్లో అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 09 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
17 జిల్లాల మీదుగా భారీ రైల్వే విస్తరణ
Image Credit : Gemini AI

17 జిల్లాల మీదుగా భారీ రైల్వే విస్తరణ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్‌ 9న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మొత్తం 8 మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో దక్షిణ భారతదేశానికి చెందిన ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి.

తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 17 జిల్లాల పరిధిలో ఈ రైల్వే విస్తరణ పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.10,021 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. 2029-30 నాటికి పనులను పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ అదనపు రైల్వే మార్గాలు పూర్తయితే రైళ్ల రాకపోకలకు మరింత స్థలం అందుబాటులోకి వస్తుంది. దక్షిణ భారతదేశంలో సుమారు 2,121 గ్రామాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడుతుందని కేంద్రం తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఘట్‌కేసర్‌-కాజీపేట మార్గానికి నాలుగో లైన్‌
Image Credit : Gemini

ఘట్‌కేసర్‌-కాజీపేట మార్గానికి నాలుగో లైన్‌

తెలంగాణకు సంబంధించి ఘట్‌కేసర్‌-కాజీపేట రైల్వే సెక్షన్‌ అత్యంత ప్రాధాన్యంకలిగిన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. ఈ మార్గంలో 110 కిలోమీటర్ల మేర నాలుగో రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,419 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌ వైపు నుంచి కాజీపేట మీదుగా ఉత్తర, తూర్పు భారతదేశానికి వెళ్లే రైళ్లకు ఈ మార్గం కీలకంగా ఉంది. ఇప్పటికే రద్దీగా ఉన్న ఈ సెక్షన్‌లో అదనపు లైన్‌ అందుబాటులోకి వస్తే రైళ్లను నిర్వహించేందుకు మరింత అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్ల నిర్వహణ కూడా సులభతరం కానుంది.

Related Articles

Related image1
పర్ఫ్యూమ్ ఎలా త‌యారు చేస్తారు.? ఎక్కువ సేపు వాస‌న ఉండ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా.?
Related image2
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
35
ఏపీలో విశాఖ, విజయవాడకు కీలక ప్రయోజనం
Image Credit : Asianet News

ఏపీలో విశాఖ, విజయవాడకు కీలక ప్రయోజనం

కేంద్రం చేపడుతున్న రైల్వే విస్తరణలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా గణనీయమైన ప్రయోజనం కలగనుంది. హౌరా-చెన్నై ప్రధాన రైల్వే కారిడార్‌లోని కీలక ప్రాంతాల మీదుగా అదనపు లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మార్గంలో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన రైల్వే కేంద్రాలకు భవిష్యత్తులో మరింత రవాణా సామర్థ్యం అందుబాటులోకి రానుంది. అలాగే ముంబై-చెన్నై రైల్వే కారిడార్‌లో భాగమైన గుంతకల్లు, రేణిగుంట ప్రాంతాల మీదుగా రైల్వే మౌలిక వసతులను విస్తరించనున్నారు. అదనపు ట్రాక్‌లు అందుబాటులోకి వస్తే ఒకే మార్గంలో రైళ్ల రద్దీని నియంత్రించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రేణిగుంట వంటి జంక్షన్లు దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌లో కీలక స్థానంలో ఉండటంతో ఈ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

45
దక్షిణాదిలో ఇతర కీలక ప్రాజెక్టులు
Image Credit : AI

దక్షిణాదిలో ఇతర కీలక ప్రాజెక్టులు

దక్షిణ భారతదేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన మార్గాలు కూడా ఉన్నాయి. అరక్కోణం-రేణిగుంట సెక్షన్‌లో 77 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో లైన్లు ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటకలోని వైట్‌ఫీల్డ్‌-బంగారుపేట మార్గంలో 47 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో ట్రాక్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో బెంగళూరు పరిసర ప్రాంతాల రైల్వే రవాణా సామర్థ్యం పెరగనుంది. ఇక తమిళనాడులో సేలం-కరూర్‌-దుండిగల్‌ మార్గంలో 159 కిలోమీటర్ల డబ్లింగ్‌, హోసూర్‌-ఒమలూరు మధ్య 147 కిలోమీటర్ల డబ్లింగ్‌ పనులకు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదనపు లైన్లు, డబ్లింగ్‌ పనులు పూర్తయిన తర్వాత రైళ్లను ఒకదానికొకటి అడ్డంకి లేకుండా నడిపేందుకు వీలు కలుగుతుంది. ఫలితంగా ప్రయాణికుల రైళ్లతో పాటు పారిశ్రామిక సరుకు రవాణా వేగం కూడా పెరిగే అవకాశం ఉంది.

55
పోర్టులు, పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ
Image Credit : gemini

పోర్టులు, పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ

కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యాల్లో రవాణా సామర్థ్యాన్ని పెంచడం ఒకటి. అదనపు ట్రాక్‌లు అందుబాటులోకి రావడంతో రద్దీ మార్గాల్లో రైళ్లను నిలిపివేసే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు మెరుగైన షెడ్యూల్‌ రూపొందించవచ్చు. మరోవైపు విశాఖపట్నం వంటి ప్రధాన పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలకు సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. విజయవాడ, గుంతకల్లు, రేణిగుంట వంటి జంక్షన్ల సామర్థ్యం పెరగడం ద్వారా వివిధ ప్రాంతాలను అనుసంధానించే రైల్వే వ్యవస్థ మరింత బలపడనుంది. 2029-30 నాటికి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ముందుకు సాగితే దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీ, పారిశ్రామిక సరుకు రవాణాకు ఈ మల్టీ ట్రాకింగ్‌ పనులు ఉపయోగపడనున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నరేంద్ర మోదీ
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana Assembly: కేటీఆర్, హరీశ్‌ సహా 22 మంది BRS ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారు?
Recommended image2
Now Playing
కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session
Recommended image3
Now Playing
KTR VS POLICE | KTR Fumes Over KCR Security | Asianet News Telugu
Related Stories
Recommended image1
పర్ఫ్యూమ్ ఎలా త‌యారు చేస్తారు.? ఎక్కువ సేపు వాస‌న ఉండ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved