MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌

Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌

Motivational Story: మన జీవితంలో మంచిగా ఉండటం చాలా గొప్ప లక్షణం. అయితే కొన్ని సందర్భాల్లో మన మంచితనాన్నే కొందరు చేతకానితనంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అందుకు సమాధానం చెప్పే ఓ చిన్న కథ ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 08 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రామస్థులను భయపెట్టిన పాము
Image Credit : Gemini AI

గ్రామస్థులను భయపెట్టిన పాము

ఒక గ్రామంలో ఒక పాము ఉండేది. తన జోలికి ఎవరైనా వస్తే వెంటనే కాటేసేది. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు ఎప్పుడూ భయంతో జీవించేవారు. పొలాలకు వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఆ పాము ఎక్కడ కనిపిస్తుందోనని భయపడేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామస్థుల భయం మరింత పెరిగిపోయింది. చివరకు ఒక రోజు అందరూ కలిసి శివుడిని ప్రార్థించారు. “పరమేశ్వరా.. ఈ పాము బారి నుంచి మమ్మల్ని కాపాడు. మాకు ప్రశాంతంగా జీవించే అవకాశం ఇవ్వు” అని వేడుకున్నారు. గ్రామస్థుల ప్రార్థనలకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. వారి బాధను పూర్తిగా విన్నాడు. అనంతరం ఆ పామును పిలిచి, ఇకపై ఎవరినీ కాటేయకుండా దాని కోరలను తొలగించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాముకు కోరలు లేవని తెలిసి మారిపోయిన మనుషులు
Image Credit : Gemini AI

పాముకు కోరలు లేవని తెలిసి మారిపోయిన మనుషులు

శివుడు చెప్పిన మాటను పాము గౌరవించింది. ఇకపై ఎవరినీ కాటేయకూడదని నిర్ణయించుకుంది. మరుసటి రోజు నుంచి పాము ఎవరి జోలికీ వెళ్లలేదు. ఎవరినీ కాటేయలేదు. కొద్ది రోజుల్లోనే గ్రామస్థులకు ఆ పాము అంటే ఉన్న భయం పూర్తిగా పోయింది. “దానికి కోరలు లేవు కదా.. ఇక మనల్ని ఏమీ చేయలేదు” అని ధైర్యంగా దాని దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టారు. మొదట కొందరు దానిపై రాళ్లు విసిరారు. తర్వాత పిల్లలు కూడా దాని దగ్గరకు వెళ్లి ఆటపట్టించడం మొదలుపెట్టారు. కొందరు ఏకంగా దాని తోకను పట్టుకుని లాగుతూ ఆడుకున్నారు. పాము మాత్రం ఏమీ చేయలేక నిశ్శబ్దంగా బాధను భరించింది. ఎందుకంటే శివుడు ఇచ్చిన మాటను అది తప్పకూడదని అనుకుంది.

Related Articles

Related image1
పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?
Related image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
35
బాధను భరించలేక శివుడిని వేడుకున్న పాము
Image Credit : Gemini AI

బాధను భరించలేక శివుడిని వేడుకున్న పాము

రోజులు గడిచేకొద్దీ పాముపై గ్రామస్థుల వేధింపులు పెరిగిపోయాయి. రాళ్ల దెబ్బలకు గాయాలయ్యాయి. పిల్లలు చేసే అల్లరితో మరింత బాధపడింది. చివరకు ఆ పాము తన బాధను భరించలేక శివుడిని ప్రార్థించింది. “పరమేశ్వరా.. మీరు నాకు కాటేయకూడదని చెప్పారు. ఆ మాటను నేను తప్పలేదు. కానీ ఇప్పుడు ఈ గ్రామస్థులు నన్ను చాలా హింసిస్తున్నారు. నాకు బతకడం కూడా కష్టంగా మారింది. ఇక నాకు చావు తప్పదేమో” అని కన్నీళ్లతో వాపోయింది. పాము బాధను విన్న శివుడు చిరునవ్వుతో దాని దగ్గరకు వచ్చాడు.

45
కాటేయొద్దన్నాను.. బుస కొట్టొద్దని చెప్పలేదుగా..
Image Credit : Gemini AI

కాటేయొద్దన్నాను.. బుస కొట్టొద్దని చెప్పలేదుగా..

శివుడు పాముతో ఇలా అన్నాడు “ఓసి పిచ్చి పామూ.. నిన్ను ఎవరినీ కాటేయొద్దని మాత్రమే చెప్పాను. కానీ నీకు ఎవరైనా హాని చేయడానికి వచ్చినప్పుడు బుస కొట్టొద్దని చెప్పానా?” “నువ్వు ఎవరికీ కాటు వేయకుండా ఉండవచ్చు. కానీ నీ ఆత్మరక్షణ కోసం బుస కొట్టవచ్చు కదా. నువ్వు బుస కొట్టి భయపెట్టి ఉంటే వాళ్లు నీ దగ్గరకు వచ్చేవారు కాదు. రాళ్లు విసిరేవారు కాదు. నీ తోక పట్టుకుని ఆటపట్టించేవారు కాదు” అని చెప్పాడు. శివుడి మాటలు విన్న పాముకు అసలు విషయం అర్థమైంది. మంచిగా ఉండటం అంటే అందరి చేతుల్లోనూ మనల్ని మనం బాధించుకోవడం కాదని తెలుసుకుంది. ఎవరికీ హాని చేయకుండా ఉండటం మంచితనం. అదే సమయంలో మనకు హాని చేసేవారిని అడ్డుకోవడం ఆత్మరక్షణ.

55
మంచితనానికి హద్దులు ఉండాలి
Image Credit : Gemini AI

మంచితనానికి హద్దులు ఉండాలి

ఈ కథ మన జీవితానికి ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం మంచిగా ఉంటే ప్రతి ఒక్కరూ మన మంచితనాన్ని అర్థం చేసుకుంటారని అనుకోవడం పొరపాటు. కొందరు మన సహనాన్ని బలహీనతగా భావించవచ్చు. మన మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవచ్చు. మనం ఏమీ అనడం లేదని తమకు నచ్చినట్లు ప్రవర్తించవచ్చు. అందుకే మంచిగా ఉండాలి.. కానీ మనల్ని మనం కోల్పోయేంత మంచిగా ఉండకూడదు. ఎవరినీ బాధపెట్టకండి. కానీ ఎవరైనా మిమ్మల్ని పదేపదే బాధపెడుతుంటే హద్దులు పెట్టండి. అవసరమైనప్పుడు “ఇది నాకు నచ్చదు” అని స్పష్టంగా చెప్పండి. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించండి. మీ మంచితనాన్ని ఎవరూ దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోండి. ఎవరినీ కాటేయాల్సిన అవసరం లేదు.. కానీ అవసరమైనప్పుడు బుస కొట్టడం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో మంచితనం మన బలం కావాలి కానీ అదే మన బలహీనతగా మారకూడదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Psychology: నచ్చినవాళ్లు మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు బాధగా అనిపిస్తుంది? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Snakes : పాములు పదేపదే నాలుక ఎందుకు బయటపెడతాయి? రెండుగా చీలిన నాలుకలో ఇంత విషయం దాగుందా..!
Related Stories
Recommended image1
పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved