MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ ప్రాంతాలో భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ ప్రాంతాలో భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో అల్పపీడనం బలపడుతోందనీ, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వాతావరణం మారిందని ఐఎండీ పేర్కొంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 09 2026, 07:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Image Credit : Chatgpt

ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా రుతుపవనాలకు తగినట్టుగా వర్షాలు పడటం లేదు. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ అదిరిపోయే కూల్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, అలాగే ద్రోణి ప్రభావంతో రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 11 నాటికి పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వద్ద మరొక అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అల్పపీడన వ్యవస్థలు, ద్రోణి ప్రభావం ఎంతంటే?
Image Credit : Gemini

అల్పపీడన వ్యవస్థలు, ద్రోణి ప్రభావం ఎంతంటే?

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. అయితే, తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఒక ద్రోణి సుదీర్ఘంగా కొనసాగుతోంది. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్రను ఆనుకుని బలమైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ రెండింటి సంయుక్త ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడి, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Articles

Related image1
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
Related image2
Water In Dreams: కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
35
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను గాలులు, పిడుగుల ప్రమాదం
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌కు తుపాను గాలులు, పిడుగుల ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన కథనం ప్రకారం, రాష్ట్రంలో పలు చోట్ల ఆకస్మిక ఈదురుగాలులతో పాటు తీవ్రమైన పిడుగులు పడే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటాయని తెలిపింది.

45
తెలంగాణకు ఎల్లో అలర్ట్: గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Image Credit : Gemini

తెలంగాణకు ఎల్లో అలర్ట్: గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు

తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

55
నైరుతి రుతుపవనాల చివరి దశ, ఎల్ నినో ప్రభావం
Image Credit : Gemini

నైరుతి రుతుపవనాల చివరి దశ, ఎల్ నినో ప్రభావం

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్ తుది దశకు చేరుకుంది. రుతుపవనాలు దేశం నుండి తిరోగమనం ప్రారంభించే ముందు సెప్టెంబర్ 12 నుంచి 21 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా వర్షాలు మళ్ళీ ఉంటాయని 'ఇన్శాట్-3డీఎస్' (INSAT-3DS) శాటిలైట్ చిత్రాల ఆధారంగా వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి.

ఈ ఏడాది బలపడుతున్న ఎల్ నినో కారణంగా వర్షాభావ రోజులు పెరిగి, దేశంలో కాలానుగుణ వర్షపాత లోటు సాధారణం కంటే దాదాపు 14 శాతం తక్కువగా నమోదైంది. జూన్ నుంచి ఆగస్టు వరకు సరైన వర్షాలు లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నిరాశలో ఉన్న రైతన్నలకు రాబోయే వర్షాలు తాత్కాలిక ఊరటనివ్వనున్నాయి. అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్ర‌మాలు పూర్తిగా అవాస్త‌వం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
Recommended image2
Dasara Holidays : ఈసారి దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకు, ఎన్నిరోజులో తెలుసా?
Recommended image3
Now Playing
ఆ పాపమే నిన్నే వెంటాడుతుంది జగన్ | Chinthamaneni Prabhakar Fires On Ys Jagan | Asianet Telugu
Related Stories
Recommended image1
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
Recommended image2
Water In Dreams: కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved