- Home
- Entertainment
- Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతూ నటించిన `మారెమ్మ` మూవీ గురువారం విడుదలతుంది. దీని ఫస్ట్ రివ్యూ వచ్చింది. మరి సినిమా ఎలా ఉండబోతుందంటే?

రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా మారెమ్మ మూవీ
రవితేజ ఇటేవలే `ఇరుముడి`తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతూ `మారెమ్మ` చిత్రంలో నటించారు. దీపా బాలు హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకుడు. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఇందులో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రేపు గురువారం(సెప్టెంబర్ 10)న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ రిపోర్ట్ ఏంటి? మూవీ ఎలా ఉందనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకుందాం.
మారెమ్మ మూవీ కథ ఇదేనా?
సినిమా కథేంటంటే? వరంగల్‌లోని మహిషాపురం అనే గ్రామంలో ప్రమాదకర గత్తర వ్యాధి వస్తుంది. దీంతో వరుసగా మరణాలు చోటు చేసుకుంటాయి. ఊరికి ఏదో పట్టిందంటారు. ప్రజలు భయానికి గురవుతుంటారు. ఆ సమయంలోనే ఊరిలో దున్నపోతు జన్మిస్తుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఓ జ్యోతిష్యుడు చెబుతాడు. అన్నట్టుగానే దున్నపోతు జన్మిస్తుంది. దానికి గ్రామ దేవత అయిన మారెమ్మ పేరు పెడతారు. దాన్నే దేవతగా భావిస్తారు. ఆ దున్నుపోతుని చూసుకునే బాధ్యత పశువుల కాపరి మారి(మాధవ్ భూపతిరాజు)కి ఇస్తారు. ఓ సందర్భంలో దున్నపోతుని ఊరి బయట వదిలేయాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి? ఊర్లో గత్తర వ్యాధి పోయిందా? మారెమ్మ ఎలాంటి ప్రభావం చూపించింది? దున్నపోతుతో మారికి ఉన్న అనుబంధం ఏంటనేది సినిమా కథ.
మారెమ్మ మూవీ సెన్సార్ రిపోర్ట్
`మారెమ్మ` మూవీ సెన్సార్ పూర్తి చేసుకొని ఏ సర్టిఫికెట్ పొందింది. ఏ సర్టిఫికెట్ పొందింది. సినిమా నిడివి రెండు గంటల 15 నిమిషాలుంది. ఇటీవల కాలంలో ఇది చాలా డీసెంట్ నిడివి అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ నిడివిగా చెప్పొచ్చు. ఇదొక ప్లస్ పాయింట్ కూడా. అయితే సినిమాలో కొన్ని అభ్యంతరకర పదాలుండటంతో సెన్సార్ అభ్యంతరం చెప్పిందట. వాటిని తొలగిస్తే సినిమా కథ, సోల్ మిస్ అవుతుందని టీమ్ అలానే ఉంచారు. దీంతో ఏ సర్టిఫికెట్‌ని ఇచ్చిందని సమాచారం. దీంతో ఇప్పుడు ఈ మూవీని 18ఏళ్లు నిండిన వారు మాత్రమే చూడాలి. ఇది మూవీకి మైనస్‌గా చెప్పొచ్చు.
మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ
ఇక మూవీ డివైన్ అంశాలున్నా యాక్షన్ ప్రధానంగా సాగే డ్రామా చిత్రం. మారెమ్మ అమ్మవారి చుట్టూ కథ రన్ అవుతుంది. హీరోకి, దున్నపోతుకి మధ్య ఉన్న బాండింగ్ ప్రధానంగా సాగుతుందట. అదే ఇందులో హైలైట్‌గా నిలుస్తుందని హీరో మాధవ్ చెప్పారు. అదే సమయంలో రవితేజ కూడా సినిమా గురించి ఓపెన్ అయ్యారు. చాలా బాగా వచ్చిందని, సెకండాఫ్, క్లైమాక్స్ అదిరిపోతుందన్నారు. సినిమాపై హైప్ ఇచ్చారు. ప్రారంభంలో గత్తర వ్యాధి, దాని ప్రభావం చూపించి, ఆ తర్వాత దున్నుపోతు జన్మించడంతో కథ సాఫీగా వెళ్తుందట. ఫస్టాఫ్ నార్మల్ గానే వెళ్తుందని ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలతో సినిమా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుందని, గ్రామ దేవతకి సంబంధించిన అంశాలు, డివైన్ అంశాలు యాక్షన్ ప్రధానంగా సాగుతాయట. అవి కొన్ని గూస్ బంమ్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్ ఫాస్ట్ గా రన్ అవుతుందని, ఒళ్లు గగుర్పొడిచే అంశాలుంటాయని చెబుతున్నారు. అదే సమయంలో దున్నపోతో హీరోకి ఉన్న అనుబంధం ఎమోషనల్‌గా ఉంటుందని టాక్. క్లైమాక్స్ మాత్రం పీక్‌లో ఉంటుందట. దానిపై మేకర్స్ ఆశలు పెట్టుకున్నట్టు టాక్. అయితే కొన్ని అంశాలు రెగ్యూలర్ గా ఉంటాయని, అన్ని సినిమాల్లో మాదిరిగానే ఉంటుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ రొటీన్‌గా వెళ్తుందట. కొన్ని సీన్లు ఇరికించినట్టు ఉంటాయని చెబుతున్నారు. బీజీఎం అదిరిపోయిందని, విజువల్‌గా మూవీ బాగుంటుందని టాక్. మరి నిజంగానే సినిమా ఎలా ఉంటుందా అనేది ఏసియానెట్ ఒరిజినల్ రివ్యూ కోసం వెయిట్ చేయండి.

