MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం

Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. తన మాస్ బ్యాటింగ్ తో 270 రన్స్‌తో చెలరేగాడు. టీమిండియా టెస్టు జట్టులో రీఎంట్రీకి సిద్ధమని తన ఇన్నింగ్స్ తో హెచ్చరికలు పంపాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 08 2026, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అజిత్ అగార్కర్ ముందే కిషన్ రచ్చ.. 270 రన్స్‌తో టీమిండియాకి రీఎంట్రీ ఫిక్స్
Image Credit : AFP

అజిత్ అగార్కర్ ముందే కిషన్ రచ్చ.. 270 రన్స్‌తో టీమిండియాకి రీఎంట్రీ ఫిక్స్

ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో కెప్టెన్ హోదాలో మైదానంలోకి దిగిన అతను, బౌలర్లను చెండాడి పడేశాడు. తన కెరీర్‌లో రెండో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.

చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ తరఫున నంబర్-5 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే తనదైన శైలిలో ఆడటం ప్రారంభించాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 270 రన్స్ చేశాడు. 80.84 స్ట్రైక్ రేట్‌తో సాగిన ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 30 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అతనితో పాటు కుమార్ కుషాగ్రా కూడా 101 రన్స్‌తో రాణించడంతో ఈస్ట్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 రన్స్ చేసి ఆలౌట్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీమిండియా టెస్టు జట్టు సెలెక్షన్ కోసం గట్టి పోటీ
Image Credit : X/@ImTanujSingh

టీమిండియా టెస్టు జట్టు సెలెక్షన్ కోసం గట్టి పోటీ

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్ భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ అలర్ట్ పంపాడు. టీమిండియా తమ తదుపరి టెస్టు సిరీస్‌ను ఈ ఏడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో ఆడనుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు ఈ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వర్ల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్ గెలవడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌కు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా స్టేడియంలోనే ఉన్నారు. ఆయన ముందే ఇషాన్ ఈ విధ్వంసం సృష్టించడం విశేషం.

Related Articles

Related image1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే?
Related image2
Water In Dreams: కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
35
పది సంవత్సరాల తర్వాత మళ్లీ డబుల్ సెంచరీ
Image Credit : ANI

పది సంవత్సరాల తర్వాత మళ్లీ డబుల్ సెంచరీ

ఇషాన్ కిషన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి అతను 273 బంతులు తీసుకోగా, ఆ తర్వాత కేవలం 27 బంతుల్లోనే 250 రన్స్ మార్కును దాటేయడం అతని హిట్టింగ్ పవర్‌ను చూపిస్తోంది. గతంలో కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా సెంచరీ కొట్టి గెలిపించిన చరిత్ర కిషన్‌కు ఉంది.

45
రికార్డుల కంటే టీమ్ విజయాన్నే కోరుకున్నా: ఇషాన్ కిషన్
Image Credit : X/BCCI

రికార్డుల కంటే టీమ్ విజయాన్నే కోరుకున్నా: ఇషాన్ కిషన్

ఈ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్ మాట్లాడాడు. మైదానంలో మైలురాళ్లు లేదా పర్సనల్ రికార్డులు తన మనసులో లేవని స్పష్టం చేశాడు. "నిజం చెప్పాలంటే నేను 50 రన్స్ గురించి గానీ, 300 రన్స్ గురించి గానీ ఆలోచించలేదు. కేవలం భాగస్వామ్యాలు నెలకొల్పడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. జాతీయ జట్టుకు దూరమైన సమయంలో డొమెస్టిక్ క్రికెట్‌లో రెండేళ్లు ఆడటం వల్ల ఆటను ఎలా సులభతరం చేసుకోవాలో నేర్చుకున్నాను. మళ్లీ సున్నా నుంచి ప్రారంభించాల్సి వస్తుందని అర్థమైంది" అని కిషన్ వెల్లడించాడు.

55
టెస్టుల్లో ఇషాన్ కిషన్ ఇప్పటివరకు ట్రాక్ రికార్డ్
Image Credit : ANI

టెస్టుల్లో ఇషాన్ కిషన్ ఇప్పటివరకు ట్రాక్ రికార్డ్

ఇషాన్ కిషన్ చివరిసారిగా టీమిండియా తరఫున జులై 2023లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పేన్ టెస్టులో ఆడాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 2 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కిషన్ 78 సగటుతో 78 రన్స్ చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ (నాటౌట్ 52) ఉంది. అంతేకాకుండా వికెట్‌కీపర్‌గా 5 క్యాచ్‌లు/స్టంపింగ్స్ చేశాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో కొట్టిన ఈ 270 రన్స్ దాడితో న్యూజిలాండ్ టూర్ కోసం సెలెక్టర్లు అతడి పేరును కచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే?
Recommended image2
Water In Dreams: కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved