- Home
- Entertainment
- Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్ వార్నింగ్
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్ వార్నింగ్
రెడ్ టీమ్ లీడర్ రోహిత్ నాయుడికి ఓ వైపు వర్షిణి, ఇంకోవైపు కృష్ణుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అహాంకారం, తలపొగరు తగ్గించుకోవాలని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.

రెండు టీమ్‌లుగా విడిపోయిన బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభమైన రెండో రోజుకే హీటెక్కిపోయింది. ఈ వారం దాదాపు అందరు నామినేషన్ ఉన్నారు. అయితే ఆ నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి సంబంధించి టాస్క్ లు, అదే సమయంలో కెప్టెన్సీ టాస్క్ లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హౌజ్ రెండు గా విడిపోయింది. రోహిత్, రామ్ ప్రసాద్ టీమ్ లీడర్స్ గా రెండు టీములు విడిపోయాయి. బ్యాగ్స్ ని సంపాదించే టాస్క్ లో రామ్ ప్రసాద్ బ్లూ టీమ్‌గా, రోహిత్ రెడ్ టీమ్‌గా విడిపోయారు. రామ్ ప్రసాద్.. తన టీమ్‌లోకి ముఖేష్, సుధీర్, నరేష్, దేబ్జానీ, వర్షిణి, కృష్ణుడు, త్రిగుణ్‌లను ఎంపిక చేసుకున్నారు. అలాగే రోహిత్ తన టీమ్‌లోకి అమర్, షాలిని, చైత్ర రాయ్, సృష్టి, టెంపర్ వంశీ, సింగర్ ఝాన్సీలను తీసుకున్నారు.
రెడ్ టీమ్‌ని నామినేట్ చేసిన బ్లూ టీమ్
ఇక నామినేషన్ చేసే ప్రక్రియలో..రెడ్ టీమ్‌ని బ్లూ టీమ్ నామినేట్ చేస్తూ.. రామ్ ప్రసాద్.. చరణ్‌ని, సుధీర్.. అమన్‌ని, వర్షిణి రోహిత్‌ని, ముఖేష్ గౌడ చైత్రలను నామినేట్ చేశారు. అయితే వర్షిణి మాత్రం రోహిత్‌కి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చింది. అగ్నిపరీక్షలో నువ్వే తోపు అని ఎక్కడో ఆకాశంలో ఉన్నావని, నా అంత తోపు ఎవరూ లేరన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావని, కొంచెం కిందికి దిగాలని చెబుతూ రోహిత్‌ని నామినేట్ చేసింది. తనదైన స్టయిల్‌లో ఆయనకు గట్టిగా ఇచ్చిపడేసింది. రామ్ ప్రసాద్ కూడా రోహిత్ విషయంలో ఇదే కామెంట్ చేశాడు. యాటిట్యూడ్ తగ్గించుకోవాలని చెప్పాడు. దేబ్జానీ సైతం రోహిత్‌కి అదే తరహాలో కౌంటర్ ఇచ్చింది.
వర్షిణి నటిస్తుంది, దేబ్జానీ పక్కోళ్ల మీద ఆధారపడుతుంది
అనంతరం బ్లూ టీమ్‌లోని ఐదుగురుని రెడ్ టీమ్ నామినేట్ చేయాల్సి ఉండగా, ఉమ్మడిగా ఓ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా రోహిత్.. తమ టీమ్ నామినేట్ చేయాలనుకున్నవారిని వెల్లడించారు. కృష్ణుడిని నామినేట్ చేస్తూ, మీరు స్టాండ్ తీసుకోలేదు, మీరు అనుకున్న దానిపై నిల్చోలేకపోతున్నారు, గివప్ ఇస్తున్నారని అన్నాడు. రామ్ ప్రసాద్‌ని నామినేట్ చేస్తూ.. బిగ్ బాస్ ఇచ్చిన సూచనలను సరిగా చదవలేదని, ఫస్ట్ పేజ్ చదివి వెళ్లిపోయావని, రెండు సార్లు అలానే చేశావని, నీ మైండ్ ప్రజెన్స్ లో లేదని చెబుతూ నామినేట్ చేశాడు. వర్షిణిని నామినేట్ చేస్తూ.. హౌజ్‌లో సహజంగా లేవని, నటిస్తున్నావని, సేఫ్ గేమ్ ఆడుతున్నావని వెల్లడించాడు. త్రిగుణ్‌ని నామినేట్ చేస్తూ వినే ఓపిక లేదని, పక్కవాళ్లని మాట్లాడనివ్వడం లేదని చెప్పాడు. దేబ్జానీని నామినేట్ చేస్తూ, బిగ్ బాస్ సూట్ కేస్‌లు ఇచ్చినప్పుడు వాటిని సరిగా పెట్టలేదని, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని ఇతరులపై డిపెండ్ అవుతున్నావని చెప్పి నామినేట్ చేశాడు రోహిత్.
దమ్ముంటే రండి మాట్లాడుకుందాం.. వర్షిణి వార్నింగ్
దీనికి బ్లూ టీమ్ స్పందించింది. మీ రీజన్స్ చాలా సిల్లీగా ఉన్నాయని, వాటిలో స్టఫ్ లేదని తెలిపింది. తాము చాలా హర్ట్ అయ్యామని చెప్పారు. వర్షిణి కూడా అదే రియాక్ట్ అయ్యింది. తాను చెప్పిన కారణాలపై వాదించే దమ్ముంటే రండి అంటూ ఫైర్ అయ్యింది. అదే సమయంలో కృష్ణుడు కూడా రెచ్చిపోయాడు. లీడర్‌గాను నువ్వు అనర్హడివి అని, లీడర్ అంటూ అందరిని కలుపుకొని పోవాలని, కానీ నీకు అన్నీ నేనే అనే అహాంకారం ఉందని చెబుతూ అవే తగ్గించుకోవాలని మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే దీనికి రెడ్ టీమ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం.
హౌజ్‌లో ఫన్నీ ఇన్సిడెంట్స్
ఇవి పక్కన పెడితే.. ఫైరింగ్ గేమ్‌లో.. బ్లూ టీమ్.. రెడ్ టీమ్‌పై ఎటాక్ చేసే ఆట ఆసక్తికరంగా సాగింది. ఇందులో తనకు హెల్మెట్ లేకుండా కూడా ఎటాక్ చేశారని చెప్పి షాలిని ఆవేదన వ్యక్తం చేసింది. చరణ్ వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. రామ్ ప్రసాద్ వ్యవహరించిన తీరుపై ఆమె హర్ట్ అయినట్టు చెప్పింది. ఇంకోవైపు చరణ్ తన బాధని పంచుకోగా, దేబ్జానీ ఓదార్చింది. నేను నీ అక్కనిరా అంటూ ఆమె అతన్ని హగ్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఇంకోవైపు నరేష్, రామ్ ప్రసాద్.. సింగర్ ఝాన్సీ మధ్య ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇలా హాట్ హాట్‌గా, కొంత ఫన్నీగా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక మొదటి వారం అందరు నామినేషన్‌లో ఉన్నారు. అందరు ఆడియెన్స్ ఓటింగ్ ని ఫేస్ చేయాల్సి రావడం విశేషం. ఇది బిగ్ బాస్ ఆదేశం.

