MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం

హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం

Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ టెక్నాలజీ పెట్టుబడి రాబోతోంది. దేశంలోనే అత్యంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్యాంపస్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

3 Min read
Author : Narender Vaitla
Published : Sep 05 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
250 ఎకరాల్లో అత్యాధునిక ఏఐ క్యాంపస్
Image Credit : Gemini AI

250 ఎకరాల్లో అత్యాధునిక ఏఐ క్యాంపస్

ఈ భారీ డేటా సెంటర్ క్యాంపస్‌ను 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మొత్తం 1 గిగావాట్, అంటే 1,000 మెగావాట్ల కంప్యూటింగ్ సామర్థ్యంతో అత్యాధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. భారీ స్థాయిలో ఏఐ మోడల్స్‌ను నిర్వహించేందుకు అవసరమైన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థలను ఇందులో అందుబాటులోకి తీసుకురానున్నారు. సాంప్రదాయ డేటా సెంటర్లకు భిన్నంగా అత్యాధునిక లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ఈ క్యాంపస్ ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థలు, హైపర్‌స్కేలర్లు, అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలకు అవసరమైన భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించనుంది. భవిష్యత్తులో ఏఐ ఆధారిత సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి మౌలిక వసతులకు డిమాండ్ మరింత పెరగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల ఉద్యోగాలకు అవకాశం
Image Credit : Gemini AI

రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల ఉద్యోగాలకు అవకాశం

హైపర్ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. డేటా సెంటర్ నిర్మాణంతో పాటు నిర్వహణ, సాంకేతిక సేవలు, నెట్‌వర్కింగ్, విద్యుత్ సరఫరా, కూలింగ్ వ్యవస్థలు వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఐటీ, ఏఐ, డేటా ఇంజినీరింగ్ రంగాలతో పాటు నిర్మాణం, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆపరేషన్స్, సెక్యూరిటీ వంటి అనుబంధ విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. భారీ టెక్ ప్రాజెక్టులు రావడంతో స్థానికంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా కొత్త వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉంది.

35
సీఎం రేవంత్‌తో టీసీఎస్ ప్రతినిధుల కీలక సమావేశం
Image Credit : Gemini AI

సీఎం రేవంత్‌తో టీసీఎస్ ప్రతినిధుల కీలక సమావేశం

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టీసీఎస్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. టీసీఎస్ సీఈఓ కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్‌తో పాటు హైపర్ వాల్ట్ ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ స్థాయి ఏఐ సంస్థలకు అవసరమైన కంప్యూటింగ్ మౌలిక వసతులను తెలంగాణలో అభివృద్ధి చేయడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

45
గ్రీన్ ఎనర్జీ, వాటర్ న్యూట్రల్ విధానానికి ప్రాధాన్యం
Image Credit : Gemini AI

గ్రీన్ ఎనర్జీ, వాటర్ న్యూట్రల్ విధానానికి ప్రాధాన్యం

భారీ డేటా సెంటర్ల నిర్వహణకు అధిక స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేలా ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వాటర్ న్యూట్రల్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఏఐ డేటా సెంటర్లలో అధిక శక్తి వినియోగం, సర్వర్ల నుంచి వెలువడే వేడిని నియంత్రించడం ప్రధాన సవాళ్లుగా ఉంటాయి. అందుకే ఆధునిక కూలింగ్ వ్యవస్థలు, సమర్థవంతమైన విద్యుత్ వినియోగ సాంకేతికతలను ఈ క్యాంపస్‌లో వినియోగించనున్నారు. సాంకేతిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.

55
ఫ్యూచర్ సిటీకి కొత్త బలం.. ఏఐ హబ్‌గా హైదరాబాద్
Image Credit : Gemini AI

ఫ్యూచర్ సిటీకి కొత్త బలం.. ఏఐ హబ్‌గా హైదరాబాద్

ఈ ప్రాజెక్టు తెలంగాణతో పాటు దేశ టెక్నాలజీ రంగానికి కూడా కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మోడల్స్, భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అత్యంత కీలక మౌలిక వసతులుగా మారనున్నాయని, వాటిని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురావడం వల్ల తెలంగాణకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్టుపై తొలి చర్చలు 2026 జనవరిలో దావోస్‌లో జరిగినట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశంతో ఈ ప్రతిపాదనకు రూపం వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం పలుదఫాలుగా చర్చలు జరిపి ఒప్పందం దిశగా అడుగులు పడ్డాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టును ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ తెలంగాణకు అవకాశం దక్కడం విశేషం.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ ప్రాజెక్టు బలమైన పునాది వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ, డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ మెగా పెట్టుబడి నగరానికి అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంచే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాల సాధనలోనూ ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Recommended image2
Musi Riverfront Project: మూసీ నది ఒడ్డున రూ.1,108 కోట్లుతో ఓంకారేశ్వరాలయం
Recommended image3
RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Related Stories
Recommended image1
పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?
Recommended image2
బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో తెలుసా.? ప్రాసెస్ తెలిస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved