MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?

పిల్లి అడ్డొస్తే నిజంగానే అపశకునమా? ఈ నమ్మకం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా?

Facts: పిల్లి ఎదురుగా వస్తే చాలామంది ఒక్కసారిగా ఆగిపోతారు. కొందరు కాసేపు నిలబడి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తారు.టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఈ నమ్మకాన్ని పాటిస్తున్నారు. అయితే పిల్లి అడ్డొస్తే మంచిది కాదనే భావన ఎలా వచ్చిందో తెలుసా.?

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 05 2026, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పిల్లి అడ్డొస్తే ఎందుకు ఆగుతారు?
Image Credit : Gemini AI

పిల్లి అడ్డొస్తే ఎందుకు ఆగుతారు?

పిల్లి ఎదురుగా వెళ్లడాన్ని చాలామంది అపశకునంగా భావిస్తుంటారు. ముఖ్యంగా ఇంటి నుంచి ఏదైనా పని కోసం బయలుదేరిన సమయంలో పిల్లి అడ్డొస్తే వెంటనే ప్రయాణాన్ని కొనసాగించకుండా కాసేపు ఆగిపోతారు. కొందరు నీళ్లు తాగి లేదా కూర్చొని లేచి మళ్లీ బయలుదేరుతుంటారు. కానీ ఈ ఆచారం మొదట్లో మూఢనమ్మకంతో పుట్టలేదని చెబుతుంటారు. అప్పటి పరిస్థితులు, ప్రయాణ మార్గాలు, అడవుల్లో ఉండే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఒక జాగ్రత్తగా దీనిని పాటించడం ప్రారంభించారని ప్రచారంలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పూర్వకాలంలో ప్రయాణం అంత సులువు కాదు
Image Credit : Gemini AI

పూర్వకాలంలో ప్రయాణం అంత సులువు కాదు

పూర్వకాలంలో ఇప్పటిలా కార్లు, బస్సులు, రైళ్లు ఉండేవి కావు. విశాలమైన రహదారులు, వీధి దీపాలు కూడా అందుబాటులో ఉండేవి కావు. ఎక్కువ మంది అడవులు, చెట్లు, పొదల మధ్య ఉన్న మార్గాల్లో కాలి నడకన లేదా ఎడ్లబండ్లపై ప్రయాణించేవారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం. అడవి జంతువులు, విషసర్పాలు లేదా ఇతర ప్రమాదాలు ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితి ఉండేది. అందుకే ప్రయాణించే సమయంలో చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అయ్యేది.

Related Articles

Related image1
పుట్టుక నుంచే బ‌తుకు పోరాటం, జీవిత‌మంతా క‌ష్టాల‌మ‌యం.. అయినా కృష్ణుడు భ‌గ‌వంతుడు ఎలా అయ్యాడు?
Related image2
బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో తెలుసా.? ప్రాసెస్ తెలిస్తే వావ్ అనాల్సిందే
35
పిల్లుల అప్రమత్తతే దీనికి కారణమా?
Image Credit : Gemini AI

పిల్లుల అప్రమత్తతే దీనికి కారణమా?

సాధారణంగా పిల్లులు చాలా అప్రమత్తంగా ఉండే జంతువులు. చిన్నపాటి శబ్దాన్ని కూడా త్వరగా గుర్తించగలవు. తమకు ఏదైనా ప్రమాదం ఉందని అనిపించినా వెంటనే స్పందిస్తాయి. చుట్టుపక్కల ఏదైనా జంతువు కదలిక ఉన్నా వాటి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని పూర్వకాలంలో ప్రజలు జాగ్రత్తగా గమనించేవారని చెబుతారు. పిల్లి సాధారణంగా నడుస్తూ కాకుండా అకస్మాత్తుగా భయంతో ఒక వైపు నుంచి మరో వైపుకు పరుగెత్తితే, సమీపంలో ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఉండవచ్చని భావించేవారు.

45
పిల్లి ప్రవర్తనను ప్రమాద హెచ్చరికగా భావించేవారు
Image Credit : Gemini AI

పిల్లి ప్రవర్తనను ప్రమాద హెచ్చరికగా భావించేవారు

అడవులు, నిర్మానుష్య మార్గాల్లో ప్రయాణించే సమయంలో పిల్లి హఠాత్తుగా పరుగెత్తడం వెనుక ఏదో కారణం ఉండవచ్చని పెద్దలు భావించేవారు. అక్కడ క్రూర జంతువు ఉండటం, పాము సంచరించడం లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉండే అవకాశం ఉందని అనుమానించేవారు. అందుకే పిల్లి అడ్డొచ్చిన వెంటనే ప్రయాణాన్ని కొనసాగించకుండా కొద్దిసేపు ఆగేవారు. అవసరమైతే ఎడ్లబండి దిగి చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించేవారు. మార్గం సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మళ్లీ ప్రయాణం సాగించేవారు. అంటే ఇది భయంతో తీసుకున్న నిర్ణయం కాదు.. అప్రమత్తతతో తీసుకున్న జాగ్రత్తగా భావించవచ్చు.

55
జాగ్రత్తగా మొదలైన ఆచారం.. అపశకునంగా మారిందా?
Image Credit : Gemini AI

జాగ్రత్తగా మొదలైన ఆచారం.. అపశకునంగా మారిందా?

కాలం మారడంతో ప్రయాణ పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. అడవుల మధ్య ప్రయాణాలు తగ్గాయి. రహదారులు, వాహనాలు, సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే పిల్లి అడ్డొస్తే కాసేపు ఆగాలనే ఆచారం మాత్రం కొనసాగుతూ వచ్చింది. క్రమంగా ఈ ఆచారం వెనుక ఉన్న అసలు కారణాన్ని చాలామంది మరిచిపోయారు. దీంతో పిల్లి అడ్డొస్తే ఏదో చెడు జరుగుతుందనే నమ్మకం బలపడింది. ఇలా ఒకప్పుడు ప్రయాణికుల భద్రత కోసం పాటించిన జాగ్రత్త, కాలక్రమేణా అపశకునం అనే సెంటిమెంట్‌గా మారిపోయిందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే, పిల్లి అడ్డొస్తే అపశకునం అని శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు. పూర్వకాల పరిస్థితుల్లో జంతువుల ప్రవర్తనను గమనించి అప్రమత్తంగా ఉండేందుకు ఏర్పడిన ఒక ఆచారం, కాలక్రమేణా మూఢనమ్మకంగా మారిపోయి ఉండవచ్చని ఈ ప్రచారంలో ఉన్న కథనం చెబుతోంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ర‌మ్ వ‌ర్సెస్ విస్కీ... ఈ రెండింటి మ‌ధ్య అస‌లు తేడా ఏంటో తెలుసా.?
Recommended image2
బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో తెలుసా.? ప్రాసెస్ తెలిస్తే వావ్ అనాల్సిందే
Recommended image3
మొఘల్ చక్రవర్తులకు ఇరానీ మహిళలంటే ఎందుకంత ఇష్టం?
Related Stories
Recommended image1
పుట్టుక నుంచే బ‌తుకు పోరాటం, జీవిత‌మంతా క‌ష్టాల‌మ‌యం.. అయినా కృష్ణుడు భ‌గ‌వంతుడు ఎలా అయ్యాడు?
Recommended image2
బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో తెలుసా.? ప్రాసెస్ తెలిస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved