MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత

Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత

Shafali Verma: జపాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ సెమీఫైనల్‌లో భారత యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ తన బ్యాట్‌ పవర్ చూపించింది. బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 100 రన్స్ తో ప్రపంచ రికార్డుల మోత మోగించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 20 2026, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
49 బాల్స్‌లో సెంచరీ బాదేసింది.. జపాన్‌లో హర్యానా పాప రికార్డుల రచ్చ
Image Credit : Getty

49 బాల్స్‌లో సెంచరీ బాదేసింది.. జపాన్‌లో హర్యానా పాప రికార్డుల రచ్చ

ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. జపాన్‌లోని నిషిన్, నాగోయాలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత ఓపెనర్ షెఫాలీ వర్మ తుపాను సెంచరీతో విరుచుకుపడింది. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
49 బంతుల్లో విధ్వంసం.. ఆసియా గేమ్స్‌లో తొలి సెంచరీ
Image Credit : X/BCCIWomen

49 బంతుల్లో విధ్వంసం.. ఆసియా గేమ్స్‌లో తొలి సెంచరీ

భారత తుఫాన్ ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి రికార్డుల మోత మోగించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సింగిల్ తీసి తన మొదటి టీ20 అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసుకుంది. ఉమెన్స్ ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెంచరీ బాదిన మొదటి మహిళా క్రికెటర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది. ఓవరాల్‌గా ఆసియా గేమ్స్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ప్లేయర్ గా (యశస్వి జైస్వాల్ తర్వాత) ఘనత సాధించింది. తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు బాది 204.08 స్ట్రైక్ రేట్‌తో బంగ్లా బౌలర్లను చెడుగుడు ఆడుకుంది.

35
ఒకే ఏడాదిలో 35 సిక్సర్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్
Image Credit : Getty

ఒకే ఏడాదిలో 35 సిక్సర్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్

ఈ మ్యాచ్‌లో 9 సిక్సర్లు బాదడం ద్వారా షెఫాలీ వర్మ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఉమెన్స్ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. 2026 క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు షెఫాలీ 35 సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంక కెప్టెన్ చమరి అటపత్తు పేరు మీద ఉన్న 32 సిక్సర్ల (2024) రికార్డును ఆమె అధిగమించింది. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో 104 సిక్సర్లు పూర్తి చేసుకుని, భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధానను దాటేసింది.

45
వరల్డ్ నంబర్ 1 గా స్మృతి మంధాన కొత్త రికార్డు
Image Credit : X/BCCIWomen

వరల్డ్ నంబర్ 1 గా స్మృతి మంధాన కొత్త రికార్డు

మరోవైపు ఓపెనర్ స్మృతి మంధాన 19 బంతుల్లో 37 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో (పురుషులు, మహిళలు కలిపి) అత్యధిక పరుగులు చేసిన రికార్డు సాధించింది. న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్‌ను దాటి 171 ఇన్నింగ్స్‌ల్లో 4,788 పరుగులతో అగ్రస్థానానికి చేరింది. పురుషుల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బాబర్ అజామ్ (4,596) కంటే కూడా స్మృతి, సూజీ బేట్స్ ముందుండటం విశేషం.

55
ఫైనల్ వైపు భారత్ అడుగులు.. గోల్డ్ మెడల్ ఖాయమేనా?
Image Credit : X@BCCIWomen

ఫైనల్ వైపు భారత్ అడుగులు.. గోల్డ్ మెడల్ ఖాయమేనా?

ఓపెనర్లు తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. అనంతరం జి. కమలిని (3) త్వరగానే అవుట్ అయినా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేసి షెఫాలీకి చక్కటి సహకారం అందించింది. దీంతో భారత్ 195/4 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మంగళవారం జరిగే గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. పసిడి పతకమే లక్ష్యంగా విమెన్ ఇన్ బ్లూ దూసుకెళ్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Related Stories
Recommended image1
Investment Rules: నష్టాలు రాకుండా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? వారెన్ బఫెట్ 5 సీక్రెట్ రూల్స్ ఇవే
Recommended image2
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved