MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా

Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 114 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. షఫాలీ వర్మ మెరుపు సెంచరీతో రికార్డు సృష్టించింది. ఈ విజయంతో భారత జట్టు ఫైనల్ చేరుకుంది. ఫైనల్ పోరులో శ్రీలంకతో తలపడనుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 20 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగ్లాదేశ్‌పై భారత్ ధనాధన్ విక్టరీ
Image Credit : X/BCCIWomen

బంగ్లాదేశ్‌పై భారత్ ధనాధన్ విక్టరీ

జపాన్‌లో జరిగిన ఆసియా గేమ్స్ 2026 ఉమెన్స్ క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 114 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 81 పరుగులకే కుప్పకూలింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షెఫాలీ వర్మ చరిత్రాత్మక సెంచరీ
Image Credit : X/BCCIWomen

షెఫాలీ వర్మ చరిత్రాత్మక సెంచరీ

భారత ఓపెనర్ షెఫాలీ వర్మ గ్రౌండ్‌లో సిక్సర్లు, ఫోర్లతో బంగ్లా బౌలర్లను చెడుగుడు ఆడుకుంది. కేవలం 49 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి రికార్డు సృష్టించింది. ఉమెన్స్ ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెంచరీ చేసిన మొదటి ప్లేయర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఫుల్ మెంబర్ టీమ్స్ ప్లేయర్ల రికార్డును కూడా షెఫాలీ వర్మ సమం చేసింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

35
కుప్పకూలిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్
Image Credit : X/BCCIWomen

కుప్పకూలిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్

196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ దిలారా అక్తర్ 23 బంతుల్లో 27 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలోనే 81 పరుగులకు ఆలౌట్ అయింది.

45
చెలరేగిన భారత బౌలర్లు
Image Credit : X/BCCIWomen

చెలరేగిన భారత బౌలర్లు

భారత బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌పై ఒత్తిడి పెంచారు. నందని శర్మ తన స్పెల్‌లో 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, శ్రీ చరణి చెరో 2 వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ సాధించారు. బౌలింగ్ చేసిన ప్రతీ ఒక్కరూ వికెట్ తీసి జట్టు విజయంలో భాగమయ్యారు.

55
గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో శ్రీలంకతో పోరు
Image Credit : X/BCCIWomen

గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో శ్రీలంకతో పోరు

ఈ గెలుపుతో భారత్ కనీసం వెండి పతకాన్ని ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 22న జరగనుంది. గోల్డ్ మెడల్ కోసం భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. గతంలో 2024 హాంగ్‌జౌ ఆసియా గేమ్స్, ఆసియా కప్‌లలో జరిగిన మ్యాచ్‌లకు ఇది రీమ్యాచ్ కానుంది. మరోవైపు కాంస్య పతకం కోసం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Related Stories
Recommended image1
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image2
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved