MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు ఎందుకు నెగెటివ్ విషయాలనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది?

Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు ఎందుకు నెగెటివ్ విషయాలనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది?

Psychology: సాధారణంగా మనల్ని పది మంది ప్రశంసించి, ఒక్కరు విమర్శించినా, అదే మనసులో తిరుగుతూ ఉంటుంది. మన బ్రెయిన్ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మన మెదడు ఎందుకు నెగెటివ్ విషయాలనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. దీనిపై సైకాలజీ ఏం చెబుతోందో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 26 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెగెటివ్ విషయాలు ఎందుకు ఎక్కువ గుర్తుంటాయి?
Image Credit : Getty

నెగెటివ్ విషయాలు ఎందుకు ఎక్కువ గుర్తుంటాయి?

మన రోజూవారీ జీవితంలో ఎన్నో మంచి సంఘటనలు జరిగినా, రాత్రి పడుకునే సమయానికి మాత్రం విమర్శ, అవమానం లేదా ఒక చిన్న తప్పే మనసులో పదే పదే తిరుగుతూ ఉంటుంది. పది మంది మనల్ని మెచ్చుకున్నా సరే.. ఒక్కరు చేసిన ప్రతికూల వ్యాఖ్యే ఎక్కువగా గుర్తుండిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మన మెదడు సహజంగానే అలా పనిచేస్తుందా? సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ విషయాలనే ఎక్కువ గుర్తుంచుకునేలా..
Image Credit : Getty

ఆ విషయాలనే ఎక్కువ గుర్తుంచుకునేలా..

సైకాలజీ నిపుణుల ప్రకారం మన మెదడు ప్రమాదకరమైన లేదా బాధ కలిగించే సంఘటనలను ఎక్కువగా గుర్తుంచుకునేలా అభివృద్ధి చెందింది. విమర్శలు, అపజయాలు, ఉద్యోగ ఒత్తిడి, సంబంధాల్లో తలెత్తే సమస్యలు వంటి ప్రతికూల అనుభవాలను కూడా మన మెదడు అదే తీవ్రతతో గుర్తుంచుకుంటుంది. న్యూరోసైన్స్ పరిశోధనల ప్రకారం భావోద్వేగాలకు సంబంధించిన సమాచారాన్ని మెదడులోని కొన్ని భాగాలు ప్రత్యేకంగా ప్రాసెస్ చేస్తాయి. ముఖ్యంగా భయం, ప్రమాదం లేదా ఒత్తిడికి సంబంధించిన అనుభవాలు ఎక్కువ భావోద్వేగ తీవ్రతను కలిగిస్తే, అవి జ్ఞాపకాల్లో బలంగా నిలిచే అవకాశం ఉంటుంది.

35
సాధారణ మానసిక ప్రక్రియ
Image Credit : Getty

సాధారణ మానసిక ప్రక్రియ

నెగెటివ్ విషయాలు ఎక్కువగా గుర్తుండటం అంటే మన మానసిక ఆరోగ్యం బాగోలేదని అర్థం కాదు. ఇది సాధారణ మానసిక ప్రక్రియ. కానీ ప్రతికూల ఆలోచనలు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేంతగా పెరిగితే లేదా పని, నిద్ర, సంబంధాలు లేదా ఆనందాన్ని దెబ్బతీస్తే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరికీ అప్పుడప్పుడు నెగెటివ్ ఆలోచనలు రావడం సహజమే. కానీ వాటి తీవ్రత, ప్రభావం ముఖ్యం.

45
సోషల్ మీడియా వినియోగం
Image Credit : Getty

సోషల్ మీడియా వినియోగం

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం కూడా ఈ ధోరణిపై ప్రభావం చూపవచ్చు. ప్రతికూల వార్తలు, విమర్శలు లేదా ఇతరులతో నిరంతర పోలికలు మన దృష్టిని మరింత నెగెటివ్ వైపు మళ్లించవచ్చు. అందుకే డిజిటల్ వినియోగానికి పరిమితులు పెట్టుకోవడం, విశ్వసనీయ సమాచారం మాత్రమే చదవడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రత్యక్షంగా సమయం గడపడం వంటి అలవాట్లు మానసిక సమతుల్యతకు దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

55
సానుకూల ప్రభావం కోసం
Image Credit : Getty

సానుకూల ప్రభావం కోసం

సైకాలజీ నిపుణుల ప్రకారం, నెగెటివ్ విషయాల నుంచి బయటపడాలంటే.. రోజులో జరిగిన మూడు మంచి విషయాలను రాసుకోవడం, కృతజ్ఞత భావాన్ని పెంపొందించడం మంచిది. అలాగే ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం, తగినంత నిద్రపోవడం, శారీరక వ్యాయామం చేయడం వంటి అలవాట్లు మెదడుపై సానుకూల ప్రభావం చూపుతాయి. అంతేకాదు ప్రతి నెగెటివ్ ఆలోచన నిజమేనా, దానికి ఆధారాలు ఏంటి అని ప్రశ్నించుకోవడం కూడా మంచి పద్ధతి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం తరచూ ఫోన్ చెక్ చేయాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
Recommended image2
Psychology: ఈ 5 సైకాలజీ ట్రిక్స్ తో ఎవ్వరి మనసులో ఏముందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved