MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Psychology: ఈ 5 సైకాలజీ ట్రిక్స్ తో ఎవ్వరి మనసులో ఏముందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు!

Psychology: ఈ 5 సైకాలజీ ట్రిక్స్ తో ఎవ్వరి మనసులో ఏముందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు!

Psychology: మనం రోజూ రకరకాల వ్యక్తులను చూస్తుంటాం. కొందరు మనకు వెంటనే అర్థమవుతారు. మరికొందరు బయటకు ఒకలా, లోపల మరోలా ఆలోచిస్తుంటారు. అందుకే ఒక వ్యక్తిని నిజంగా అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఈ 5 సైకాలజీ ట్రిక్స్ తో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 18 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ట్రిక్స్
Image Credit : gemini ai

ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ట్రిక్స్

మన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరైనా సరే.. వారి ఆలోచనలు, భావాలు, ప్రవర్తనను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే సంబంధాలు మరింత బలపడతాయి. సైకాలజీ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి కొన్ని సులభమైన సైకాలజీ ట్రిక్స్‌ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మీ మాటలు వినే తీరు
Image Credit : Gemini AI

మీ మాటలు వినే తీరు

సాధారణంగా చాలామంది మాట్లాడే వ్యక్తిని మాత్రమే పరిశీలిస్తారు. కానీ సైకాలజిస్టులు వినే వ్యక్తి ప్రవర్తనను కూడా గమనిస్తారు. ఒక వ్యక్తి మీ మాటలను శ్రద్ధగా వింటూ కళ్లలోకి చూస్తుంటే, తల ఊపుతూ స్పందిస్తుంటే, అతనికి మీ పట్ల గౌరవం, ఆసక్తి ఉన్నట్లు. అదే ఫోన్ చూడటం, చుట్టూ గమనించడం లేదా తరచూ దృష్టి మళ్లించడం చేస్తే, అతను మీ మాటలపై పూర్తి దృష్టి పెట్టడం లేదని అర్థం చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసా?
Related image2
Psychology: సైకాలజీ ప్రకారం మనసు ఎక్కువగా ఎప్పుడు బాధపడుతుందో తెలుసా..?
36
బాడీ లాంగ్వేజ్
Image Credit : AFP

బాడీ లాంగ్వేజ్

మనం చెప్పే మాటల కంటే బాడీ లాంగ్వేజ్ చాలా సందర్భాల్లో నిజమైన భావాలను బయటపెడుతుంది. ఒక వ్యక్తి చేతులను మడిచి మాట్లాడితే అతను పూర్తిగా ఓపెన్‌గా లేడని భావించవచ్చు. అదే నార్మల్ గా కూర్చొని, బాడీని ఫ్రీగా వదిలేసి మాట్లాడితే అతను సౌకర్యంగా ఉన్నాడని అర్థం. సైకాలజీ పరిశోధనల ప్రకారం భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో బాడీ లాంగ్వేజ్ కీలక పాత్ర పోషిస్తుంది.

46
ఇతరుల గురించి మాట్లాడే విధానం
Image Credit : Chat GTP

ఇతరుల గురించి మాట్లాడే విధానం

ఒక వ్యక్తి తరచూ ఇతరులను విమర్శిస్తూ, నెగెటివ్‌గా మాట్లాడితే, అదే ఆలోచనా విధానం అతనిలో బలంగా ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు, ఇతరుల మంచి లక్షణాలను గుర్తించి ప్రశంసించే వారు సాధారణంగా సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. సైకాలజీ ప్రకారం, మనం ఇతరుల గురించి మాట్లాడే తీరు మన సొంత వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

56
స్పందించే విధానం
Image Credit : AI Generated

స్పందించే విధానం

ప్రతి ఒక్కరూ పెద్ద విషయాల్లో మంచిగా ఉండడానికే  ప్రయత్నిస్తుంటారు. కానీ చిన్న చిన్న అసౌకర్యాలు, ఆలస్యాలు లేదా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వారి అసలు స్వభావం బయటపడుతుంది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు, పని ఆలస్యమైనప్పుడు లేదా చిన్న తప్పు జరిగినప్పుడు వారు ఎలా స్పందిస్తున్నారో గమనించాలి. సహనంగా వ్యవహరించే వారు భావోద్వేగ నియంత్రణ కలిగి ఉంటారు. కోపంగా లేదా అతిగా స్పందించే వారు ఒత్తిడిని సరిగా నిర్వహించలేకపోవచ్చు.

66
ప్రశ్నలు అడిగే అలవాటు
Image Credit : chatgpt

ప్రశ్నలు అడిగే అలవాటు

ఒక వ్యక్తి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడంటే అతనికి నేర్చుకోవాలనే ఆసక్తి, ఎదుటివారి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నట్లు. అలాగే ఎప్పుడూ తన గురించి మాత్రమే మాట్లాడే వారు తమ ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతూ ఎదుటివారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించే వారు సాధారణంగా మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. సైకాలజీ నిపుణుల ప్రకారం ప్రశ్నలు అడిగే తీరు కూడా వ్యక్తి మానసిక ధోరణిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
కుబేర యోగంతో రాబోయే 3 నెలల్లో ఈ 3 రాశులువారికి డబ్బే డబ్బు
Recommended image2
స్వీట్లపై మెరిసే వెండి పూతను తినేస్తున్నారా? అసలు అది నిజమైన వెండేనా?
Recommended image3
Eggs: ఒక గుడ్డులో రెండు పచ్చ సొనలు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి గుడ్లు తినొచ్చా? తినకూడదా?
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసా?
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం మనసు ఎక్కువగా ఎప్పుడు బాధపడుతుందో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved