MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Psychology: సైకాలజీ ప్రకారం తరచూ ఫోన్ చెక్ చేయాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా?

Psychology: సైకాలజీ ప్రకారం తరచూ ఫోన్ చెక్ చేయాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా?

Psychology: చాలామంది ఎలాంటి నోటిఫికేషన్, మెసేజ్ రాకపోయినా సరే.. ఫోన్ తీసుకొని చెక్ చేస్తుంటారు. నిజానికి ఇది అలవాటు మాత్రమే కాదు.. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయని చెబుతోంది సైకాలజీ. మరి ఎందుకు తరచూ ఫోన్ చెక్ చేయాలని అనిపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 24 2026, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఎప్పుడూ ఫోన్ చెక్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది?
Image Credit : stockPhoto

ఎప్పుడూ ఫోన్ చెక్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది?

నేటి కాలంలో చాలామంది ఉదయం లేవగానే ఫస్ట్ ఫోనే చూస్తుంటారు. రాత్రి పడుకునే ముందు కూడా చివరిసారిగా ఫోన్ చెక్ చేసి పడుకుంటారు. కొన్నిసార్లు ఎలాంటి నోటిఫికేషన్ రాకపోయినా ఫోన్ తీసి స్క్రీన్‌ను చూస్తుంటారు. అసలు ఎందుకు ఇంతలా ఫోన్ ని చెక్ చేయాలని అనిపిస్తుంది? దీని గురించి సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కొత్త విషయాల కోసం
Image Credit : Gemini

కొత్త విషయాల కోసం

సైకాలజీ ప్రకారం మన మెదడు ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటుంది. దీన్ని క్యూరియాసిటీ డ్రైవ్ అంటారు. కొత్త విషయం తెలిసినప్పుడు లేదా ఆసక్తికరమైన సమాచారం దొరికినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది ఒక ఫీల్ గుడ్ కెమికల్. ఫోన్‌లో మెసేజ్, లైక్, కామెంట్ లేదా నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మనకు చిన్నపాటి ఆనందం కలుగుతుంది. ఆ అనుభూతిని మళ్లీ పొందాలనే కోరికతో మనం ఫోన్‌ను పదే పదే చెక్ చేస్తుంటాం.

37
అనిశ్చితి కారణంగా..
Image Credit : Gemini

అనిశ్చితి కారణంగా..

మరొక ముఖ్యమైన కారణం వేరియబుల్ రివార్డ్ సిస్టమ్. ఇది మనుషుల ప్రవర్తనను ప్రభావితం చేసే శక్తివంతమైన సైకాలజికల్ సూత్రం. ఫోన్ తీసిన ప్రతిసారి ఆసక్తికరమైన విషయం కనిపించదు. కానీ కొన్నిసార్లు చాలా ముఖ్యమైన మెసేజ్, మంచి వార్త లేదా ఆసక్తికరమైన వీడియో కనిపిస్తుంది. ఈ అనిశ్చితి కారణంగా మన మెదడు ఈ సారి ఏదైనా ప్రత్యేకమైంది ఉండొచ్చు అని భావిస్తుంది. దానివల్ల మనం మళ్లీ మళ్లీ ఫోన్ చెక్ చేస్తుంటాం.

47
వెనుకబడతామనే భయం
Image Credit : Getty

వెనుకబడతామనే భయం

మన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు ఏదైనా కొత్త విషయం గురించి మాట్లాడుతుంటే మనకు తెలియకపోతే వెనుకబడ్డామనే భావన కలుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, వాట్సాప్ లేదా ఇతర యాప్‌లను చెక్ చేస్తూ ఉంటాం. ఏదైనా ముఖ్యమైన సమాచారం మిస్ అవుతామేమో అనే భయం మనల్ని ఫోన్‌కు మరింత దగ్గర చేస్తుంది.

57
యాప్ ల ప్రభావం
Image Credit : Gemini

యాప్ ల ప్రభావం

సాధారణంగా చాలా యాప్ లను మన మానసిక అంశాల ఆధారంగానే రూపొందిస్తారు. అంటే నోటిఫికేషన్‌ల రంగులు, స్క్రోల్ చేసే విధానం, లైక్స్, కామెంట్ల వ్యవస్థ అన్నీ యూజర్స్ ఎక్కువ టైం గడిపేలా రూపొందించబడతాయి. ముఖ్యంగా ఎరుపు రంగు నోటిఫికేషన్ గుర్తులు మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. వాటిని చూసిన వెంటనే ఫోన్ ఓపెన్ చేయాలని అనిపిస్తుంది. అలాగే చాలామంది కాస్త ఖాళీ టైం దొరికినా తెలియకుండానే ఫోన్ తీస్తుంటారు. ఇలా పదేపదే ఒకే చర్యను చేయడం వల్ల అది మన దైనందిన జీవితంలో భాగమైపోతుంది.

67
ఒంటరితనం వల్ల..
Image Credit : AI

ఒంటరితనం వల్ల..

మానసిక ఒత్తిడి, ఒంటరితనం లేదా బోర్‌గా అనిపించినప్పుడు కూడా మనం ఫోన్‌ను చూస్తుంటాం. ఎందుకంటే ఫోన్ తాత్కాలికంగా మన దృష్టిని సమస్యల నుంచి మళ్లిస్తుంది. సోషల్ మీడియా, వీడియోలు లేదా గేమ్స్ కొంతసేపు వినోదాన్ని అందిస్తాయి. దీంతో మనకు రిలాక్స్ అయిన భావన కలుగుతుంది. కానీ దీర్ఘకాలంలో ఇది ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి తీసుకురావచ్చు.

77
ఫోన్ వాడకం తగ్గాలంటే..
Image Credit : Getty

ఫోన్ వాడకం తగ్గాలంటే..

నిపుణుల ప్రకారం ఫోన్ వాడకాన్ని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. కానీ దానిపై నియంత్రణ ముఖ్యం. అవసరం లేని నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం, కేటాయించుకున్న టైంలోనే సోషల్ మీడియా చూడడం, నిద్రపోయే ముందు ఫోన్‌ను దూరంగా పెట్టడం వంటి చిన్న మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటివి ఫోన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Lunch Box Recipes: నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీలు.. టేస్ట్ అదుర్స్!
Recommended image2
Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో
Recommended image3
Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు నల్లపూసలు
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసా?
Recommended image2
Psychology: ఈ 5 సైకాలజీ ట్రిక్స్ తో ఎవ్వరి మనసులో ఏముందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved