జామకాయలో విటమిన్ సి, డైటరీ ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు.
మీరు రోజూ జామకాయ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అలాగే ఇది జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
నారింజ పండుతో పోలిస్తే జామకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
జామకాయలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించి, పేగుల కదలికలను సాఫీగా ఉంచుతుంది.
జామకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా గ్రహించేలా చేసి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
జామకాయలో ఉండే పొటాషియం, కరిగే ఫైబర్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తాయి.
జామకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తూనే, అతిగా ఆకలి వేయకుండా చేస్తుంది.
Warm Water: భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Earrings: 3 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్.. అందరి కళ్లు మీ వైపే
Fridge : మీ డీప్ ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో తెలుసా?
Gold Earrings: డైలీవేర్ కోసం లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా!