MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pressure Cooker: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కుక్కర్ సేఫ్ కాదేమో.. వెంటనే చెక్ చేయండి!

Pressure Cooker: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కుక్కర్ సేఫ్ కాదేమో.. వెంటనే చెక్ చేయండి!

Pressure Cooker: కిచెన్ లో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. వంట త్వరగా కావడంలో కుక్కర్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రెషర్ కుక్కర్ లో కొన్ని సంకేతాలు కనిపిస్తే వెంటనే మార్చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 18 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మూత సరిగ్గా పట్టకపోవడం
Image Credit : stockPhoto

మూత సరిగ్గా పట్టకపోవడం

ప్రెషర్ కుక్కర్ మూత సరిగ్గా ఫిట్ కావడం సురక్షితమైన వంటకు చాలా ముఖ్యం. మూత పెట్టిన తర్వాత కూడా అది సరిగ్గా ఫిట్ అవ్వకపోయినా, వంగినట్లు అనిపించినా, అంచులు దెబ్బతిన్నా ఆ కుక్కర్‌ను వాడకపోవడం మంచిది. కుక్కర్ మూత లేదా బాడీకి సొట్టలు పడటం, వంగిపోవడం, పగుళ్లు రావడం లాంటివి చిన్న సమస్యలు కావు. ఇది ప్రెషర్‌తో పనిచేసే వస్తువు కాబట్టి ఇలాంటి డ్యామేజ్‌లను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మూత చుట్టూ ఆవిరి లీక్ కావడం
Image Credit : AI Image

మూత చుట్టూ ఆవిరి లీక్ కావడం

కుక్కర్‌ మూత అంచుల నుంచి ఆవిరి బయటకు వస్తుంటే, ముందుగా గ్యాస్‌కెట్ (రబ్బరు రింగ్) చెక్ చేయాలి. గ్యాస్‌కెట్ పాతబడి గట్టిపడినా, వదులైనా లేదా పగుళ్లు వచ్చినా మూత సరిగ్గా బిగుసుకోదు. దీనికోసం కుక్కర్ మొత్తాన్ని మార్చేయాల్సిన అవసరం లేదు. మీ కుక్కర్ సైజు, మోడల్‌కు సరిపోయే మంచి క్వాలిటీ గ్యాస్‌కెట్ వేస్తే చాలు ఈ సమస్య తీరిపోతుంది.

36
సేఫ్టీ వాల్వ్‌లో సమస్య
Image Credit : stockPhoto

సేఫ్టీ వాల్వ్‌లో సమస్య

ప్రెషర్ కుక్కర్‌లో ఉండే సేఫ్టీ వాల్వ్ అనేది ఏదో చిన్న పార్ట్ కాదు. కుక్కర్‌లో ప్రెషర్ ఎక్కువైతే దాన్ని సురక్షితంగా బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వాల్వ్ డ్యామేజ్ అవ్వడం, పగుళ్లు రావడం, తుప్పు పట్టడం, బ్లాక్ అవ్వడం, సరిగ్గా పనిచేయకపోవడం లాంటివి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. పాడైన సేఫ్టీ వాల్వ్‌తో కుక్కర్‌ను వాడొద్దు. కంపెనీ సూచనల ప్రకారం సరైన స్పేర్ పార్ట్‌తో దాన్ని మార్చాలి.

46
కుక్కర్ బాడీకి పగుళ్లు లేదా సొట్టలు
Image Credit : Getty

కుక్కర్ బాడీకి పగుళ్లు లేదా సొట్టలు

కుక్కర్ మెయిన్ బాడీలో పగుళ్లు, లోతైన సొట్టలు లేదా పెద్ద డ్యామేజ్ జరిగితే, కేవలం గ్యాస్‌కెట్ మార్చి వాడటం సరైన పరిష్కారం కాదు. ప్రెషర్‌తో పనిచేసే వస్తువు బాడీ దెబ్బతింటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మీకు ఏమైనా అనుమానం ఉంటే కంపెనీ సర్వీస్ సెంటర్‌లో చెక్ చేయించడం మంచిది.

56
హ్యాండిల్ లూజ్ అవ్వడం లేదా విరిగిపోవడం
Image Credit : Getty

హ్యాండిల్ లూజ్ అవ్వడం లేదా విరిగిపోవడం

హ్యాండిల్ అనేది కేవలం వంట సౌకర్యం కోసం ఉండే పార్ట్ కాదు. కుక్కర్‌ను సురక్షితంగా పట్టుకుని పక్కన పెట్టడానికి, మూతను సరిగ్గా తీయడానికి ఇది చాలా అవసరం. హ్యాండిల్ వదులైనా, విరిగిపోయినా, అది బిగించే చోట డ్యామేజ్ ఉన్నా, రిపేర్ చేయకుండా కుక్కర్‌ను వాడకూడదు.

66
విజిల్ లేదా ప్రెషర్ తేడాగా రావడం
Image Credit : stockPhoto

విజిల్ లేదా ప్రెషర్ తేడాగా రావడం

కుక్కర్ ఎప్పటిలాగా పనిచేయకపోవడం కూడా మనం గమనించాల్సిన ముఖ్యమైన సంకేతం. మామూలు కంటే భిన్నంగా ఆవిరి బయటకు రావడం, విజిల్ వచ్చే విధానం మారడం, పెద్దగా శబ్దం రావడం, ప్రెషర్ సరిగ్గా రాకపోవడం, వాల్వ్ దగ్గర లీక్ అవ్వడం లాంటి సమస్యలు ఉంటే కచ్చితంగా రిపేర్ చేయించాలి.

కుక్కర్‌ ఎక్కువ కాలం పనిచేయాలంటే?

ప్రతిసారి వాడిన తర్వాత కుక్కర్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ముఖ్యంగా గ్యాస్‌కెట్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆవిరి బయటకు వెళ్లే దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. సేఫ్టీ వాల్వ్‌ను చెక్ చేయాలి. మూత, దాని అంచులకు ఏమైనా డ్యామేజ్ ఉందేమో చూడాలి. అలాగే, కుక్కర్ కెపాసిటీకి మించి నింపకూడదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image3
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Bike Tyres vs Scooter Tyres: బైక్‌ టైర్లు పెద్దగా, స్కూటీ టైర్లు చిన్నగా ఎందుకు ఉంటాయో తెలుసా?
Recommended image2
Healthy Breakfast: డాక్టర్లు సూచించే టాప్ 5 హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved