MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dal: పప్పు ఉడికించేటప్పుడు పైన వచ్చే తెల్లటి నురగ ప్రమాదకరమా? పప్పు అసలు ఎలా వండాలి..?

Dal: పప్పు ఉడికించేటప్పుడు పైన వచ్చే తెల్లటి నురగ ప్రమాదకరమా? పప్పు అసలు ఎలా వండాలి..?

Dal: మీరు పప్పు ఎలా వండుతున్నారు? పప్పు వండేటప్పుడు పైన తెల్లటి నురగ రావడం ఎప్పుడైనా గమనించారా? ఆ నురగ అసలు మంచిదేనా? ఆ నురగ వస్తే పప్పు తినాలా? వద్దా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 23 2026, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పప్పు ఎలా వండాలి?
Image Credit : gemini ai

పప్పు ఎలా వండాలి?

దాదాపు భారతీయులు రెగ్యులర్ గా పప్పు తింటూనే ఉంటారు.పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే.. పప్పు ఉడికించేటప్పుడు దానిపై ఒక తెల్లటి నురగ లేదా పొరలా ఏర్పడటం మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. చాలా మంది ఇది చాలా హానికరమైన పదార్థంలా భావించి దానిని తొలగిస్తూ ఉంటారు. మరి నిజంగానే.. ఆ నురగ ఆరోగ్యానికి మంచిదేనా? లేదా చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పప్పు ఉడుకుతుంటే నురగ ఎందుకు వస్తుంది?
Image Credit : gemini ai

పప్పు ఉడుకుతుంటే నురగ ఎందుకు వస్తుంది?

పప్పును మనం విడిగా ఉడికించినా, కుక్కర్ లో ఉడికించినా కూడా తెల్లటి నురగ వస్తుంది. ఈ నరగ చాలా సహజంగా ఏర్పడుతుంది. పప్పులోని ప్రోటీన్లు, పిండి పదార్థాలు వేడి నీటిలో కలిసినప్పుడు ఈ నురగ ఏర్పడుతుంది. ఇక.. చాలా మంది ఈ నురగ మంచిది కాదు అని భావిస్తారు. అందుకే.. పై పై నురగను స్పూన్ తో తొలగిస్తూ ఉంటారు. కానీ, ఈ నురగలో ప్రోటీన్లు, స్టార్చ్ తో సపోనిన్స్ అనే సమ్మేళనాలు కూడా ఉంటాయి.

ఈ సపోనిన్స్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ కొలెస్ట్రాల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఈ నురగ తక్కువగా ఉన్నప్పుడే ఈ ప్రయోజనాలు మనకు మేలు చేస్తాయి. కానీ, ఈ నురగ మరీ ఎక్కువగా వస్తే.. పప్పు చేదుగా మారుతుంది. అంతేకాకుండా, ఆ నురగ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే.. పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

33
పప్పు తింటే కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది?
Image Credit : AI Image

పప్పు తింటే కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది?

చాలా మందికి పప్పు తిన్న తర్వాత కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య వస్తుంటుంది. దీనికి అసలు కారణం పప్పులో ఉండే 'ఫోడ్‌మ్యాప్స్' అనే కార్బోహైడ్రేట్లు. ఇవి చిన్న పేగుల్లో సరిగ్గా జీర్ణం అవ్వక.. పెద్ద పేగు చేరి బ్యాక్టీరియా ద్వారా కిణ్వ ప్రక్రియకు గురవుతాయి. దీనివల్లనే గ్యాస్, కడుపునొప్పి, అసౌకర్యం కలుగుతాయి. ఇది అందరికీ జరగదు. పప్పు సరిగా ఉడకనప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి, పప్పు ఎప్పుడూ మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే తినాలి. పప్పు తిన్న తర్వాత కూడా గ్యాస్ సమస్యలు రాకుండా ఉండాలి అన్నా, సులభంగా జీర్ణం అవ్వాలి అంటే... పప్పును ఎక్కువ సేపు నానపెట్టాలి. పప్పు నానపెట్టి, ఆ తర్వాత.. తింటే.. ఈ గ్యాస్ సమస్య రాదు. పప్పును వండటానికి ముందు 20-40 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని పారబోస్తే, అందులోని సమస్య కలిగించే కొన్ని పదార్థాలు తొలగిపోతాయి. దీనివల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది.

పప్పు ఎలా వండాలి..?

ఆరోగ్యానికి మంచిదని చాలా మంది పప్పును విడిగా వండుతూ ఉంటారు. కానీ, పప్పు విషయంలో మాత్రం ప్రెజర్ కుక్కర్ వాడటమే ఉత్తమం. పప్పును ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల అందులోని పీచు పదార్థాలు, ప్రొటీన్లు మెత్తబడి సులభంగా జీర్ణమవుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Papidi Billa: పట్టుచీరలతో ఈ పాపిడి బిళ్ల పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది
Recommended image2
Pimples: 7 రోజుల పాటు ప్రతి ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తాగితే మొటిమలు ఇట్టే మాయం
Recommended image3
Pattu Pavadai Dress: ఈ లెటెస్ట్ పట్టు పరికిణీల్లో మీ బుజ్జి పాపాయిలు ప్రిన్సెస్ లుక్ లో అదిరిపోతారు
Related Stories
Recommended image1
Weight Loss: ఈ చేపలు తింటే బరువు తగ్గడం చాలా ఈజీ, ఎలా తినాలో తెలుసా?
Recommended image2
Fish Fry: చేప ఫ్రై చేస్తుంటే.. వెంటనే ఇరిగిపోతుందా? ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved