MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight Loss: ఈ చేపలు తింటే బరువు తగ్గడం చాలా ఈజీ, ఎలా తినాలో తెలుసా?

Weight Loss: ఈ చేపలు తింటే బరువు తగ్గడం చాలా ఈజీ, ఎలా తినాలో తెలుసా?

Weight Loss: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అయితే, కొన్ని రకాల చేపలను తినడం వల్ల.. ఈజీగా బరువు తగ్గొచ్చు. అయితే, అవి ఏంటి? వాటిని ఎలా తినాలి అనే విషయం మాత్రం తెలుసుకోవాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 22 2026, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బరువు తగ్గడానికి చేపలు..
Image Credit : magnific

బరువు తగ్గడానికి చేపలు..

చేపలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కూర, పులుసు, ఫ్రై రూపంలో వీటిని ఎంతో రుచిగా లాగిస్తుంటారు. అయితే, ఈ టేస్టీ చేపలతో కేవలం కడుపు నింపుకోవడమే కాదు, సులభంగా బరువు కూడా తగ్గవచ్చు అనేది మీకు తెలుసా? చాలా మంది బరువు తగ్గాలి అంటే ఆహారం తినడం ఆపేయాలి అనుకుంటారు. కానీ, హ్యాపీగా మనకు నచ్చిన ఆహారం తిని కూడా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల చేపలు తింటే.. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఆ చేపలు ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చేపలు తింటే బరువు తగ్గవచ్చా? చేపల పాత్రేమిటి?
Image Credit : ChatGPT

చేపలు తింటే బరువు తగ్గవచ్చా? చేపల పాత్రేమిటి?

బరువు తగ్గడంతో పాటు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో చేపలు అద్భుతంగా సహాయం చేస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు వారానికి రెండు నుంచి మూడు సార్లు చేపలు తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) సిఫార్సు చేస్తోంది. చేపల్లో పోట్రీన్ పుష్కలంగా ఉంటుంది. హెల్దీ ఫ్యాట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

రెడ్ మీట్‌తో పోలిస్తే చేపలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని 'లీన్ ప్రోటీన్' అని పిలుస్తారు. అంతేకాదు.. చేపల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల చేపలు తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీని వల్ల తరచూ ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బరువును అదుపులో ఉంచడంలోనూ, గుండెను కాపాడడంలోనూ గొప్ప పాత్ర పోషిస్తాయి.

33
ఏ చేప ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుంది?
Image Credit : AI

ఏ చేప ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుంది?

సాల్మన్, రావా, ట్రౌట్, ట్యూనా, సార్డినెస్, యాంకోవిస్, మాకేరెల్ వంటివి ఆరోగ్యకరమైన ఆహారానికి ఉత్తమమైన ఎంపికలు. ఎఫ్‌డిఏ సూచన ప్రకారం యాంకోవి, క్లామ్, క్యాట్‌ఫిష్, హెర్రింగ్, అయ్స్టర్, రొయ్యలు, ట్రౌట్ వంటివి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.

సాల్మన్ చేపలో ఉండే మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. తెల్ల చేపలతో పోలిస్తే కొవ్వు ఉండే చేపలలో మంచి కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ట్యూనా చేప కూడా బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.

బరువు తగ్గడానికి ఏ భారతీయ చేపలు మంచివి? 

మన దేశంలో దొరికే ఇండియన్ హెర్రింగ్ ఫిష్ (హిల్సా) బరువు తగ్గించే డైట్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటు మాకేరెల్ (బంగ్డా), బటర్‌ఫిష్ (పాంప్లేట్), క్యాట్‌ఫిష్, అలాగే రవా, కట్ల వంటి స్థానిక చేపలు కూడా బరువు తగ్గే వారి డైట్‌లో చక్కగా సరిపోతాయి.

అయితే, తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే.. చేపలను డీప్ ఫ్రై చేసి తింటే పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి, గ్రిల్ చేసిన లేదా ఉడికించి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం
Recommended image2
Sesame Seeds: ప్రతిరోజూ గుప్పెడు నువ్వులు ఎందుకు తినాలి?
Recommended image3
Chicken: చికెన్ లో ఏ భాగం అస్సలు తినకూడదు? చికెన్ ఎలా తింటే ఆరోగ్యకరం..?
Related Stories
Recommended image1
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image2
PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved