Fish Fry: చేప ఫ్రై చేస్తుంటే.. వెంటనే ఇరిగిపోతుందా? ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది..!
Fish Fry: చేపల కూర కంటే.. చేపల ఫ్రైని చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ, బయట హోటల్స్ లో వచ్చినంత రుచిగా, ముక్క విరగకుండా చేయడం ఇంట్లో అందరికీ కుదరదు.

Fish Fry
ఫిష్ ఫ్రై చేయడానికి నూనెలో వేయగానే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుందా? పైన క్రిస్పీగా రాకుండా మెత్తగా మారిపోతోందా? చేప ముక్కలు విరగకుండా, హోటల్ స్టైల్‌లో గోల్డెన్ కలర్‌లో క్రిస్పీగా వేయించడానికి ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే సరిపోతుంది. జస్ట్ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. హోటల్ లో కంటే రుచిగా, ముక్క విరగకుండా చేపల ఫ్రై చేయచ్చు... అదెలాగో చూద్దాం..
మంచి చేపలు ఎంచుకోవడం ముఖ్యం..
ప్రతి చేప వేపుడుకు పనికిరాదు. హిల్సా, ట్యూనా లాంటి అత్యంత మెత్తటి ఉన్న చేపలను వండితే విరిగిపోతాయి. ఇలాంటివి ఫ్రైకి అస్సలు సెట్ అవ్వవు. సుర్మై (కింగ్‌ఫిష్), పాంఫ్రెట్ (పాంప్లెట్), రోహు, కట్ల, తిలాపియా, కేట్‌ఫిష్. గట్టిగా ఉండే ముక్కలు వేపుడు చేయడానికి చాలా బాగుంటాయి.
చేప ముక్కను సరిగా కట్ చేయడం..
చేప ముక్కలు కనీసం 1 నుండి 1.5 అంగుళాల మందం ఉండేలా చూసుకోండి. చేపను శుభ్రం చేశాక పేపర్ టవల్‌తో తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే నూనెలో వేయగానే ఆవిరి వచ్చి ముక్క మెత్తగా మారి విరిగిపోతుంది. అందుకే, తడి లేకుండా చూసుకోవాలి. ఇక ముక్కకు ముందుగానే ఉప్పు రాయాలి. ఉప్పు రాసి 10 నిమిషాల తర్వాత మాత్రమే నూనెలో వేయించాలి. ముందే ఉప్పు రాస్తే చేపలోంచి నీరు బయటకు వచ్చి ముక్క రుచిగా మారుతుంది.
పర్ఫెక్ట్ క్రిస్పీ కోటింగ్
అల్లం-వెల్లుల్లి, కారం, పసుపు, నిమ్మరసం అన్నింటిని ముందుగానే కలిపి.. ఆ మసాలాను చేప ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత.. పాన్ లో వేయిస్తే.. ముక్క మంచిగా క్రిస్పీగా వేగుతుంది. ముక్క పైకి క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. ఎక్కువ క్రిస్పీగా రావాలి అంటే.. కోటింగ్ కోసం మీరు రవ్వను కూడా వాడొచ్చు. లేదంటే.. బియ్యం పిండి, శనగపిండిలో రవ్వ లేదా బ్రెడ్ క్రమ్స్ వేసి చేప ముక్కలకు అద్దాలి. ఇలా చేసి కాసేపు పక్కన పెట్టి... ఫ్రై చేస్తే.. చేప ముక్క మంచిగా క్రంచీగా ఉంటుంది.
ఎలా ఫ్రై చేయాలంటే...
మందపాటి కాస్ట్ ఐరన్ పెనం లేదా నాన్-స్టిక్ పాన్ వాడాలి. మీకు నచ్చిన నూనె ఏదైనా వాడొచ్చు. నూనె సరిగ్గా వేడెక్కాలి (175°C - 190°C). నూనె సరిగ్గా వేడెక్కకముందే ముక్క వేస్తే అది నూనెను పీల్చుకుని విరిగిపోతుంది.
తిప్పడంలోనే ఉంది అసలు ట్రిక్..
చేప ముక్కను నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. 2 నుండి 3 నిమిషాల పాటు కదల్చకుండా ఉంచితే కింద వైపు కోటింగ్ గట్టిపడి కరకరలాడుతుంది. అంచులు గోల్డెన్ రంగులోకి వచ్చి, పెనం నుండి ముక్క తనంతట తాను విడివడుతున్నప్పుడు మాత్రమే వెడల్పాటి గరిటెతో తిప్పాలి. వేగిన తర్వాత టిష్యూ పేపర్ పై వేస్తే నూనె వడిలి ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయి.

