MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?

Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?

Rice Cooking: అన్నం కుక్కర్‌లో వండాలా? లేక ఎక్కువ నీళ్లు పోసి గిన్నెలోనే వండి వార్చాలా? ఏ పద్ధతిలో వండితే పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి? ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 22 2026, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అన్నం ఎలా వండితే మంచిది?
Image Credit : Chatgpt

అన్నం ఎలా వండితే మంచిది?

అన్నం వండే పద్దతి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా ఉంటుంది. కొందరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడతారు. ఇంకొందరు ప్రెషర్లో కుక్కర్లో వండుతారు. మరికొందరు పాత పద్ధతిలో బియ్యంలో నీళ్లు ఎక్కువ వేసి అన్నం ఉడికాక నీటిని వార్చుతారు. ఏ పద్ధతిలో వండితే అన్నంలోని పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి? అనే సందేహం ఎక్కువ మందికి ఉంటుంది.

ఎక్కువ నీళ్లలో ఉడికించి వార్చితే పిండిపదార్థం (స్టార్చ్) తగ్గిపోతుందని, అది ఆరోగ్యానికి మంచిదని చాలామంది అంటుంటారు. అలాగే, కుక్కర్‌లో వండిన అన్నం తింటే షుగర్ వేగంగా పెరుగుతుందనే అపోహ కూడా ఉంది. కానీ మనం ఏ రకం బియ్యం వాడుతున్నాం, ఎంత నీరు పోస్తున్నాం, ఎంతసేపు వండుతున్నాం, వండిన వెంటనే తింటున్నామా లేదా చల్లారాక తింటున్నామా అనే విషయాలు అన్నం స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తాయి.

బియ్యం రకం, ప్రాసెస్ చేసే విధానం, వండే పద్ధతి, నిల్వ చేసి మళ్లీ వేడి చేయడం లాంటివి తిన్న తర్వాత బ్లడ్ షుగర్ ఎంత వేగంగా పెరుగుతుందనే దాన్ని మారుస్తాయని పరిశోధనల్లో తేలింది. అందుకే కుక్కర్ అన్నం చెడ్డది, వార్చిన అన్నమే మంచిది అని ఒకే మాటలో తేల్చి చెప్పలేం. కానీ ఈ రెండు పద్ధతుల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వార్చి వండితే ఏం జరుగుతుంది?
Image Credit : AI Image

వార్చి వండితే ఏం జరుగుతుంది?

బియ్యాన్ని ఎక్కువ నీళ్లలో ఉడికించి, ఆ తర్వాత మిగిలిన నీటిని పారబోసే పద్ధతినే మనం వార్చి వండడం అంటాం. ఈ పద్ధతిలో బియ్యంలో నీటిలో కరిగే కొన్ని పోషకాలు గంజితో పాటు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొన్ని బి-కాంప్లెక్స్ విటమిన్లు ఇలా నీటిని వార్చేసినప్పుడు కోల్పోతాం. బియ్యాన్ని ఎక్కువగా కడగడం వల్ల కూడా నీటిలో కరిగే బి విటమిన్లు తగ్గుతాయని హార్వర్డ్ న్యూట్రిషన్ గైడ్ చెబుతోంది.

అయితే దీన్ని బట్టి వార్చిన అన్నంలో పోషకాలన్నీ పోతాయని చెప్పలేం. అదే సమయంలో, వార్చి వండే పద్ధతి బియ్యంలోని పిండిపదార్థం ఎలా జీర్ణమవుతుందనే దానిపై ప్రభావం చూపుతుంది. వండే పద్ధతులను బట్టి బియ్యంలో త్వరగా జీర్ణమయ్యే స్టార్చ్, నెమ్మదిగా జీర్ణమయ్యే స్టార్చ్ స్థాయిలు మారుతాయని ఒక అధ్యయనంలో తేలింది. కాబట్టి వార్చిన అన్నం అంటే పిండిపదార్థం లేని అన్నం అనుకోవడం పొరపాటు. స్టార్చ్ పూర్తిగా పోదు. ఎంత తగ్గుతుందనేది బియ్యం రకం, నీటి పరిమాణం, వండే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది.

33
కుక్కర్‌లో వండితే...
Image Credit : Pixabay

కుక్కర్‌లో వండితే...

ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండటం చాలా సులువు. తక్కువ నీటితో బియ్యం ఆ నీటిని పీల్చుకుని ఉడుకుతుంది కాబట్టి, మనం గంజిని వంచాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల నీటిలో కరిగే పోషకాలు బయటకు పోకుండా అన్నంలోనే ఉండిపోతాయి. అలాగని కుక్కర్ అన్నమే ఎక్కువ పోషకమైనది అని కూడా చెప్పలేం. ఎందుకంటే బ్లడ్ షుగర్‌పై అన్నం చూపే ప్రభావాన్ని నిర్ణయించేది కేవలం కుక్కర్ మాత్రమే కాదు.

బియ్యం రకం, స్టార్చ్ స్వభావం, బియ్యాన్ని ఎంత పాలిష్ చేశారు, వండే సమయం, మనం తినే పరిమాణం అనేవి ఇక్కడ చాలా ముఖ్యం. వేర్వేరు రకాల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) విలువ 48 నుంచి 93 వరకు మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఉదాహరణకు, పొట్టి గింజల బియ్యం కంటే పొడవాటి గింజల బియ్యం (బాస్మతి లాంటివి) బ్లడ్ షుగర్‌ను నెమ్మదిగా పెంచుతాయి. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ తక్కువ GI కలిగి ఉంటుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. కానీ వండే సమయం, బియ్యం స్వభావాన్ని బట్టి ఈ తేడా మారొచ్చు. కాబట్టి కుక్కర్‌లో వండితే షుగర్ వెంటనే పెరుగుతుందనేది పూర్తిగా నిజం కాదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Recommended image2
Navaratri Fasting: నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ 9 రోజులు ఇలా ప్లాన్ చేసుకోండి
Recommended image3
Long Haram: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే లాంగ్ హారం డిజైన్లు..!
Related Stories
Recommended image1
Hamsa: హంస పాలు - నీళ్లను ఎలా వేరు చేస్తుంది? పాలను మాత్రమే తాగి నీళ్లు ఎలా వదిలేస్తుంది?
Recommended image2
ఈ గ్రామంలో ఎవరూ మరణించకూడదు, జన్మించకూడదు... దేనికైనా ముందుగా పక్కఊరు వెళ్లాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved