- Home
- Life
- Smart Kitchen Gadgets: కిచెన్ లో పని తగ్గించే అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్స్..క్షణాల్లో మీ పనులు కంప్లీట్
Smart Kitchen Gadgets: కిచెన్ లో పని తగ్గించే అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్స్..క్షణాల్లో మీ పనులు కంప్లీట్
Smart Kitchen Gadgets: వంట పనులతో రోజంతా టైం వృథా అవుతోందా? కూరగాయలు కోయడం, వంట చేయడం నుంచి గిన్నెలు కడగడం వరకు..విసిగిపోతున్నారా? అయితే ప్రతి కిచెన్ లో ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉండాల్సిందే. అవేంటో ఇక్కడ చూసేద్దాం.

ఇకపై వంట చాలా ఈజీ
వంట పనులతో రోజంతా టైం వృథా అవుతోందా? కూరగాయలు కోయడం, వంట చేయడం నుంచి గిన్నెలు కడగడం వరకు..విసిగిపోతున్నారా? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పనులు తేలడం లేదా? వంటగదిలోకి వెళ్తే చాలు…ఎంత చేసినా ఉంటూనే ఉంటాయి. దానివల్ల ఫ్యామిలీతో గడపలేరు. ఇలానే రోజులు గడిచిపోతుంటాయి. ముఖ్యంగా ఆఫీస్‌కు వెళ్లే మహిళలకు ఉదయం హడావిడిగా వంట చేయడం పెద్ద టాస్క్. అందుకే అలాంటి వాళ్లకోసమే ఈ కిచెన్ గ్యాడ్జెట్స్.
స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్
ఉల్లిపాయలు కోయడం, కూరగాయలు తరగడం, వెల్లుల్లి దంచడం, గిన్నెలు కడగడం లాంటి చిన్న పనులకే ఎక్కువ సమయం పోతుంది. ఈ పనులను త్వరగా ముగించడానికి మార్కెట్లో చాలా స్మార్ట్ కిచెన్ గ్యాడ్జెట్స్ వచ్చాయి. కూరగాయలను నిమిషాల్లో కట్ చేయడం నుంచి గుడ్డు సొనను వేరు చేయడం, గిన్నెలు కడగడం వరకు ప్రతి పనికీ ఒక గ్యాడ్జెట్ ఉంది. ఈ చిన్న కిచెన్ గ్యాడ్జెట్స్ ఉంటే చాలు. గంటల తరబడి వంటగదిలో కష్టపడాల్సిన పనిలేదు. మీ సమయాన్ని, శ్రమను ఆదా చేసి వంటను మరింత ఈజీ చేసే ఆ సూపర్ గ్యాడ్జెట్స్ ఏంటో చూద్దాం.
టీ పెట్టడం పెద్ద టాస్క్
టీ పెట్టడం కంటే, గిన్నెకు అంటుకున్న టీ పొడిని కడగడం పెద్ద పనా? అయితే ఈ స్మార్ట్ టీ స్ట్రైనర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు కావాల్సినంత టీ పొడిని ఈ స్ట్రైనర్‌లో వేసి, పాలు మరుగుతున్న గిన్నెలో పెట్టండి. పాలు మరిగేటప్పుడు టీ పొడిలోని డికాషన్ మాత్రమే పాలలో కలుస్తుంది. టీ పొడి మొత్తం స్ట్రైనర్‌లోనే ఉండిపోతుంది. దీనివల్ల గిన్నెకు టీ పొడి అంటుకోదు. గిన్నెలను నానబెట్టి కడగాల్సిన కష్టం తప్పుతుంది. వంటగది పనులను ఈజీ చేసుకోవాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ టూల్. రోజుకు మూడు నాలుగు సార్లు టీ పెట్టేవాళ్లకు ఇది చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది.
ఫుడ్ డ్రైయింగ్ నెట్ (Food Drying Net)
ఇంట్లో మిరపకాయలు, మసాలా దినుసులు, వడియాలు ఎండబెట్టాలా? అయితే ఈ ఫుడ్ డ్రైయింగ్ నెట్ వాడండి. మీరు ఎండబెట్టాల్సిన వస్తువులను ఈ నెట్‌లో ఉంచి, పైన జిప్ వేస్తే చాలు. డాబా మీద ఎండబెట్టినప్పుడు కాకులు వస్తాయనే టెన్షన్ ఇక ఉండదు. ఈ నెట్ వల్ల కాకులు, పావురాలు లాంటి పక్షులు, పురుగులు ఆహారంపై వాలకుండా ఉంటాయి. అదే సమయంలో గాలి బాగా ఆడి వస్తువులు త్వరగా ఎండుతాయి. వాడకం పూర్తయ్యాక దీన్ని మడిచి పక్కన పెట్టుకోవచ్చు. ఇది ఇంట్లో ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు.
ఆనియన్ హోల్డర్ (Onion Holder)
ఉల్లిపాయలు కోయడం కష్టంగా ఉందా? కళ్లు మండటం, చేతులు కట్ అవుతాయనే భయం ఇక వద్దు. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడం ఒక ఎత్తైతే, కత్తి వేళ్లకు తగులుతుందనే భయం మరో ఎత్తు. ఈ చిన్న ఆనియన్ హోల్డర్ ఉంటే ఉల్లిపాయలు కోయడం చాలా సులభం. ఉల్లిపాయను ఈ హోల్డర్‌కు గుచ్చి గట్టిగా పట్టుకోండి. ఆ తర్వాత కత్తితో ఆ గ్యాప్స్‌లో కట్ చేయండి. దీనివల్ల ఉల్లిపాయ చేతిలోంచి జారిపోదు. కత్తి మీ వేళ్లకు తగులుతుందనే భయం కూడా ఉండదు. అలాగే ఉల్లిపాయలను ఒకే సైజులో సమానంగా కట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. కూరలు, బిర్యానీ, సలాడ్స్ కోసం ఉల్లిపాయలను ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీ కిచెన్‌లో ఈ చిన్న ఆనియన్ హోల్డర్‌ను తప్పకుండా ఉంచుకోండి.
కార్న్ పీలర్ (Corn Peeler)
మొక్కజొన్న కంకి నుంచి గింజలు తీయడం కష్టంగా ఉందా? ఇకపై ఈజీగా తీసేయొచ్చు. కత్తితో గింజలు తీయడం కొంచెం కష్టమైన పనే. అందుకే ఈ కార్న్ పీలర్ లేదా స్ట్రిప్పర్ వాడండి. ఉడికించిన లేదా పచ్చి మొక్కజొన్న కంకిని ఈ పీలర్ గుండా లాగితే చాలు. ఇందులో ఉండే పదునైన బ్లేడ్లు గింజలను సులభంగా వేరు చేస్తాయి. దీనివల్ల చేతులపై ఎక్కువ ఒత్తిడి పడదు. తక్కువ సమయంలోనే ఎక్కువ గింజలను తీయొచ్చు. సూప్, సలాడ్, పాస్తా, ఫ్రైడ్ రైస్ లాంటి వంటకాలకు మొక్కజొన్న గింజలు కావాలంటే ఈ చిన్న గ్యాడ్జెట్ భలేగా పనిచేస్తుంది. మొక్కజొన్న తినడాన్ని మరింత ఈజీ చేయాలంటే ఈ కార్న్ పీలర్‌ను వాడండి.
టెండర్ కోకోనట్ ఓపెనర్ (Tender Coconut Opener)
కొబ్బరి బొండాం కొట్టేటప్పుడు చేతులు నొప్పి పుడుతున్నాయా? కష్టపడకుండా బొండాం ఓపెన్ చేయడానికి ఈ టూల్ వాడండి. కొబ్బరి బొండాం తాగేటప్పుడు దానికి కన్నం పెట్టడం చాలా మందికి కష్టమైన పని. కత్తితో కన్నం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ కోకోనట్ ఓపెనర్ బాగా ఉపయోగపడుతుంది. బొండాం పైన ఈ టూల్ పెట్టి తిప్పితే చాలు, ఈజీగా కన్నం పడుతుంది. బయట కొనుక్కునే వాళ్లకు ఇది అవసరం లేకపోయినా, ఇంటికి తెచ్చుకుని తాగేవాళ్లకు, తోటలో కోసుకునే వాళ్లకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.
ఎగ్ సెపరేటర్ (Egg Separator)
గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన వేరు చేయడం కష్టంగా ఉందా? ఇక చేత్తో వేరు చేయాల్సిన పనిలేదు. కేకులు, కుకీస్ చేసేటప్పుడు తెల్లసొన, పచ్చసొన విడివిడిగా కావాలి. కానీ చేత్తో వేరు చేసేటప్పుడు పచ్చసొన చితికిపోయి తెల్లసొనలో కలిసిపోతుంది. అందుకే ఈ ఎగ్ సెపరేటర్ వాడండి. గుడ్డు పగలగొట్టి ఇందులో పోస్తే చాలు. ఇది తెల్లసొనను కిందకు పంపి, పచ్చసొనను మాత్రమే పైన ఆపుతుంది. దీనివల్ల గుడ్డును వేరు చేసే పని చాలా త్వరగా, సులభంగా పూర్తవుతుంది.కేకులు, ఆమ్లెట్, సాస్ లాంటివి చేసేటప్పుడు గుడ్డును వేరు చేయడానికి ఇది మస్త్ గ్యాడ్జెట్. ఈ చిన్న ఎగ్ సెపరేటర్ ఉంటే మీ పని చాలా ఈజీ అవుతుంది.
సోప్ డిస్పెన్సింగ్ డిష్ బ్రష్ (Soap Dispensing Dish Brush)
గిన్నెలు తోమేటప్పుడు ఒక చేతిలో స్క్రబ్బర్, మరో చేతిలో డిష్ వాష్ లిక్విడ్ బాటిల్ పట్టుకోవడం కష్టంగా ఉందా? ఇక ఆ ఇబ్బంది వద్దు. ఈ సోప్ డిస్పెన్సింగ్ డిష్ బ్రష్ గిన్నెలను ఈజీగా క్లీన్ చేయడానికి భలేగా పనిచేస్తుంది. దీని హ్యాండిల్‌లో లిక్విడ్ నింపుకోవడానికి చిన్న ట్యాంక్ ఉంటుంది. అందులో డిష్ వాష్ లిక్విడ్ పోసి, గిన్నెలు తోమేటప్పుడు పైన ఉన్న బటన్ నొక్కితే చాలు. బ్రష్ లోపలి నుంచి లిక్విడ్ బయటకు వస్తుంది. దాంతో ప్లేట్లు, గిన్నెలు, కడాయిలను ఈజీగా తోమేయొచ్చు. గిన్నెలే కాదు, గ్యాస్ స్టవ్, కిచెన్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల పదే పదే లిక్విడ్ బాటిల్ తీయాల్సిన పని తప్పుతుంది. చేతులకు సబ్బు ఎక్కువగా తగలకుండా కూడా చూసుకోవచ్చు.
డిజిటల్ కిచెన్ స్కేల్ (Digital Kitchen Scale)
వంటలో ఏది ఎంత వేయాలో కన్ఫ్యూజన్‌గా ఉందా? ఇకపై అన్నీ కరెక్ట్ కొలతలతో వేయొచ్చు.
వంటకు కావాల్సిన వస్తువుల బరువును కచ్చితంగా కొలవడానికి ఈ డిజిటల్ కిచెన్ స్కేల్ ఉపయోగపడుతుంది. రోజూ వంట చేసేవాళ్లకు ఇది పెద్దగా అవసరం లేకపోవచ్చు. కానీ కొత్తగా వంట నేర్చుకునేవాళ్లకు, యూట్యూబ్ వీడియోలు చూసి వండేవాళ్లకు ఇది పక్కాగా కావాలి.
బియ్యం, పిండి, చక్కెర, పప్పులు, కూరగాయల బరువును గ్రాములు లేదా కిలోల్లో చూపిస్తుంది. ఇందులో టేర్ (Tare) ఆప్షన్ కూడా ఉంటుంది. ఖాళీ గిన్నె పెట్టి టేర్ నొక్కితే బరువు జీరో అవుతుంది. ఆ తర్వాత అందులో వస్తువులు వేసి కచ్చితమైన బరువు తెలుసుకోవచ్చు. బేకింగ్ నుంచి రోజువారీ వంట వరకు కొలతలు కరెక్ట్‌గా ఉండాలంటే ఈ డిజిటల్ కిచెన్ స్కేల్ వాడండి.
పాట్ హోల్డర్ మ్యాట్ (Heat Resistant Pot Holder Mat)
వేడివేడి కుక్కర్, కడాయిని నేరుగా డైనింగ్ టేబుల్ లేదా కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద పెడుతున్నారా? ఇక ఆ రిస్క్ వద్దు. వేడి గిన్నెలను సురక్షితంగా పెట్టుకోవడానికి ఈ హీట్ రెసిస్టెంట్ పాట్ హోల్డర్ మ్యాట్ బాగా ఉపయోగపడుతుంది. పొయ్యి మీద నుంచి దించిన కుక్కర్, పెనం, వేడి గిన్నెలను నేరుగా టేబుల్ మీద పెట్టకుండా ఈ మ్యాట్ మీద పెట్టండి. దీనివల్ల టేబుల్ పాడవకుండా, మరకలు పడకుండా ఉంటుంది. వాడిన తర్వాత దీన్ని ఈజీగా కడిగి పెట్టుకోవచ్చు. వేడి గిన్నె ఎక్కడ పెట్టాలనే టెన్షన్ ఇక వద్దు. ఈ మ్యాట్ ఉంటే మీ కిచెన్ పని మరింత ఈజీ అవుతుంది.
వెజిటబుల్ చాపర్ (Vegetable Chopper)
కూరగాయలు కోయడం కష్టంగా ఉందా? ఇక నిమిషాల్లో ఈజీగా ముగించేయొచ్చు. ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, బీన్స్ లాంటివి కత్తితో గంటల తరబడి కోయాల్సిన పనిలేదు. మీ వంటగదిలో ఒక వెజిటబుల్ చాపర్ ఉంటే చాలు. కూరగాయలను చాపర్‌లో వేసి లాగితే, అవి చాలా త్వరగా చిన్న ముక్కలుగా కట్ అవుతాయి. రోజూ వంట చేసే మహిళలకు సమయాన్ని, శ్రమను ఆదా చేయడానికి ఇది బెస్ట్ గ్యాడ్జెట్. చాపర్ కొనేటప్పుడు దాని కెపాసిటీ, బ్లేడ్ క్వాలిటీ, మెటీరియల్, గ్రిప్ లాంటివి చూసి తీసుకోండి. ఇది చిన్న గ్యాడ్జెట్ అయినా మీ రోజువారీ పనిని చాలా ఈజీ చేస్తుంది.

