MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ఈ గ్రామంలో ఎవరూ మరణించకూడదు, జన్మించకూడదు... దేనికైనా ముందుగా పక్కఊరు వెళ్లాల్సిందే

ఈ గ్రామంలో ఎవరూ మరణించకూడదు, జన్మించకూడదు... దేనికైనా ముందుగా పక్కఊరు వెళ్లాల్సిందే

ప్రపంచంలో వింతైన గ్రామం గురించి ఇక్కడ చెప్పుకోబోతున్నాము. ఈ గ్రామంలో ఎవరూ మరణించడానికి వీల్లేదు. మరణించినా పక్క ఊరికి తీసుకెళ్లిపోతారు. ఇక ప్రసవానికైతే ముందే వేరే ఊరుకు చేరుకోవాలి. ఈ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామం వింతలేంటో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 22 2026, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ గ్రామంలో చనిపోవడం నిషేధం
Image Credit : Getty

ఈ గ్రామంలో చనిపోవడం నిషేధం

ప్రపంచంలో ఎన్నో వింతమైన గ్రామాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ గ్రామం కూడా ఒకటి. ఈ గ్రామంలో ఎవరైనా మరణించడం చట్టరీత్యా నేరం. అలాగే మహిళలు ఇక్కడ ప్రసవానికి ఉండకూడదు. ముందుగానే వేరే ఊరు వెళ్లిపోవాలి. ఈ గ్రామం పేరు లాంగ్‌ఇయర్‌బైన్ (Longyearbyen). నార్వే దేశంలోని స్వాల్‌బార్డ్ (Svalbard) దీవుల్లో ఉన్న గ్రామం ఇది. ఇక్కడ వింత భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. అందుకే కఠినమైన నిబంధనలను పెట్టారు. "ఇక్కడ చనిపోవడం చట్టరీత్యా నేరం" అనే వింత రూల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గడ్డకట్టే మంచు వల్లే
Image Credit : Getty

గడ్డకట్టే మంచు వల్లే

లాంగ్‌ఇయర్‌బైన్ గ్రామం నిత్య మంచుతో నిండి ఉంటుంది. నేల ఎప్పుడూ గడ్డకట్టే ఉంటుంది. దీన్నే 'పెర్మాఫ్రాస్ట్' అంటారు. అంటే ఇక్కడి మట్టి ఏడాది పొడవునా జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంటుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఊరి చివర ఉన్న స్మశాన వాటికలో ఖననం చేసేవారు. కానీ 1950ల్లో ఇక్కడి స్మశానవాటికలో పరిశోధనలు చేసిన సైంటిస్టులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్నో ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాలు ఏమాత్రం కుళ్లిపోకుండా, చర్మం, జుట్టు కూడా అలాగే ఉండటాన్ని వాళ్లు గమనించారు.

1918లో లక్షలాది మందిని బలితీసుకున్న 'స్పానిష్ ఫ్లూ' (Spanish Flu)తో చనిపోయిన వారిని ఇక్కడే పూడ్చిపెట్టారు. ఆ బాడీలను పరిశీలిస్తే, ఆ ప్రమాదకరమైన వైరస్‌లు ఇంకా బతికే ఉన్నాయని తేలింది.

మంచు కారణంగా మృతదేహాలు పైకి రావడం, వాటిలోని ప్రాచీన వైరస్‌లు మళ్లీ వ్యాపిస్తే ప్రపంచానికి ముప్పు అని గ్రహించారు. అందుకే 1950 నుంచి ఇక్కడ మృతదేహాలను పూడ్చిపెట్టడంపై అధికారికంగా నిషేధం విధించారు.

33
పుట్టుక, చావులపై కఠిన నియమాలు
Image Credit : Getty

పుట్టుక, చావులపై కఠిన నియమాలు

గ్రామంలోని ఏ వ్యక్తికైనా నయం కాని జబ్బు వచ్చినా, లేదా వయసు పైబడి చావుకు దగ్గరవుతున్నా.. వాళ్లను వెంటనే విమానాల్లో నార్వే ప్రధాన భూభాగానికి (Mainland Norway) తీసుకెళ్లిపోవాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు లేదా గుండెపోటుతో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే, ఆ బాడీని వెంటనే ప్యాక్ చేసి నార్వేలోని ఇతర ప్రాంతాలకు పంపి అక్కడే అంత్యక్రియలు చేస్తారు. ఇదంతా వ్యక్తి మరణించిన నిమిషాల్లో జరిగిపోతుంది. అలాగే ఈ నగరంలో పెద్ద ఆసుపత్రులు, మెటర్నిటీ వార్డులు లేవు. అందుకే డెలివరీ టైమ్ దగ్గరపడుతున్న గర్భిణులు, కనీసం మూడు వారాల ముందే ఇతర నగరాలకు వెళ్లిపోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Recommended image2
Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత
Recommended image3
Free Train: మనదేశంలో ఎవరైనా ఉచితంగా ప్రయాణించగల రైలు ఇదొక్కటే.. ఈ ట్రైన్ ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
మాంసాహారాన్ని నీచు లేదా నీసు అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరెలా వచ్చింది?
Recommended image2
Hamsa: హంస పాలు - నీళ్లను ఎలా వేరు చేస్తుంది? పాలను మాత్రమే తాగి నీళ్లు ఎలా వదిలేస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved