MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Hamsa: హంస పాలు - నీళ్లను ఎలా వేరు చేస్తుంది? పాలను మాత్రమే తాగి నీళ్లు ఎలా వదిలేస్తుంది?

Hamsa: హంస పాలు - నీళ్లను ఎలా వేరు చేస్తుంది? పాలను మాత్రమే తాగి నీళ్లు ఎలా వదిలేస్తుంది?

Hamsa: హంసలు ఎంతో అందమైన పక్షులు. కానీ వాటిని చూసిన వారు చాలా తక్కువ. మనదేశంలో చాలా అరుదుగా హంసలు కనిపిస్తాయి. అయితే హంసకు పాలు నీళ్లను వేరు చేసే శక్తి ఉందని చెప్పుకుంటారు. పాలు నీళ్లు కలిపి ఇస్తే అది పాలను మాత్రం తాగి నీళ్లను వదిలేస్తుందని అంటారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 22 2026, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హంసలు పాలు తాగుతాయా?
Image Credit : Gemini AI

హంసలు పాలు తాగుతాయా?

హంసలు చూసేందుకు ఎంతో మనోహరంగా ఉంటాయి. కానీ మనలో చాలా మంది వాటిని ఫోటోల రూపంలో చూడడమే. నేరుగా చూసిన వారు చాలా తక్కువ. విదేశాల్లో మాత్రం కొన్ని చోట్ల హంసలు అధికంగా ఉంటాయి. అయితే మన పురాణాల ప్రకారం హంసకు పాలు, నీటి మిశ్రమం నుంచి కేవలం పాలను మాత్రమే తాగే శక్తి ఉంది. భారతీయ పురాణాలు, సంస్కృత కావ్యాలలో హంసకు ఉన్న ఈ విశిష్ట శక్తినే 'నీర-క్షీర వివేకం' అంటారు. అయితే నిజంగానే హంస అలా చేయగలదా? అంటే లేదనే చెప్పాలి. అది కేవలం ఒక ప్రాచీన పౌరాణిక ప్రతీక, నమ్మకం మాత్రమే. శాస్త్రీయంగా ఇది నిజం కాదు. చెడును విడిచి మంచిని మాత్రమే గ్రహించాలి అని చెప్పేందుకు హంసలాగా పాలను తాగి నీళ్లను వదిలేయాలి అని చెప్పడం అలవాటుగా మారింది. పరమహంస అనే పదం కూడా జ్ఞానోదయం పొందిన మహనీయులను ఉద్దేశించి ఉపయోగించేదే. అంతే తప్ప హంస పాలు తాగదు. అందులో నీటిని వేరు చేయలేదు కూడా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హంస ముక్కు నిర్మాణం ప్రత్యేకం
Image Credit : Pixabay

హంస ముక్కు నిర్మాణం ప్రత్యేకం

హంస ముక్కు నిర్మాణాన్ని పరిశీలిస్తే కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ముక్కు లోపలి భాగంలో 'లామెల్లే' అనే సన్నని దువ్వెన లాంటి లేదా జల్లెడ వంటి నారల నిర్మాణాలు ఉంటాయి. హంసలు నీటిలో మునిగినప్పుడు బురద, నాచు, నీటి మొక్కలు, చిన్నచిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. అవి నీటితో కలిపి ఈ పదార్థాలను నోట్లోకి తీసుకున్నప్పుడు, ఆ జల్లెడ లాంటి భాగం గుండా నీటిని బయటకు పంపేసి గట్టిగా ఉండే ఆహార రేణువులను మాత్రమే లోపల నిలుపుకుంటాయి. ఇది కేవలం ఘన పదార్థాలను ద్రవ పదార్థాల నుంచి వేరు చేసే సహజ వడపోత ప్రక్రియ మాత్రమే. అంతే తప్ప పాలు, నీరు వంటి రెండు ద్రవాలను వేరుచేసే సామర్థ్యం హంస జీర్ణవ్యవస్థకు ఉండదు

33
హంస క్షీర న్యాయం
Image Credit : Pixabay

హంస క్షీర న్యాయం

పాలు సహజంగానే నీరు, కొవ్వు, ప్రొటీన్లతో కలిసి ఉంటుంది. కాబట్టి ప్రయోగశాలల్లో సెంట్రిఫ్యూజ్ లేదా ప్రత్యేక పద్ధతుల ద్వారా తప్ప సాధారణంగా పాల నుంచి నీటిని వేరుచేయడం చాలా కష్టం. అటువంటిది ఒక పక్షి నోటితో ఆ రెండింటినీ వేరుచేయడం అనేది అసంభవం. పురాణాల్లోని ఆధ్యాత్మిక తత్వాన్ని, లోతైన వివేకాన్ని సమాజానికి సులభంగా తెలియజేయడానికి మన పూర్వీకులు అల్లిన ఒక అందమైన రూపకమే ఈ 'హంస క్షీర న్యాయం'. పౌరాణికంగా దీనికున్న తాత్విక విలువ గొప్పదే అయినా, ఆధునిక శాస్త్ర విజ్ఞానం ప్రకారం హంస పాలు, నీటిని వేరుచేయగలదనడం కేవలం ఒక అపోహ.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vizag Beach: గోవా దేనికి గురూ? వైజాగ్ తీరంలో ఈ టాప్ 5 బీచ్ రిసార్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Recommended image2
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Recommended image3
Psychology: సైకాలజీ ప్రకారం డబ్బు మనిషి ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
మాంసాహారాన్ని నీచు లేదా నీసు అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరెలా వచ్చింది?
Recommended image2
భోజనం తర్వాత నెయ్యి, చిన్న బెల్లం ముక్క కలిపి ఎందుకు తినాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved